BigTV English

Mahabubabad BRS: మానుకోటలో మూతపడ్డ బీఆర్ఎస్.. అందరూ జంపే?

Mahabubabad BRS: మానుకోటలో మూతపడ్డ బీఆర్ఎస్.. అందరూ జంపే?

Mahabubabad BRS: గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ప్రతిసారి సిట్టింగులకే టికెట్లంటూ కేసీఆర్ ఇచ్చిన అలుసుతో వారు మరింత చెలరేగిపోయారు. పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టకుండా సొంత ఖజానాలు నింపుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అలా పదేళ్లు చెలాయించిన నేతలు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పార్టీ ఆఫీసు గుమ్మం కూడా తొక్కడం లేదంట. దాంతో అక్కడ బీఆర్ఎస్ ఆఫీసు కూడా మూతపడిందంట. కారు పార్టీకి అంత దారుణమైన పరిస్థితి ఎక్కడ దాపురించింది?


నియోజకవర్గ బాస్‌లు ఎమ్మెల్యేలే.. వారు చెప్పిందే ఫైనల్.. వారు సై అంటే సై, నై అంటే నై.. ఇలా గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ ఫుల్ పవర్స్ ఇచ్చాడు. ఇంకేముంది వారి ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరి పోయాయి. సొంత పార్టీ నేతలను సైతం పట్టించుకోలేదు. ఇలా మాజీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచుకున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ నియోజకవర్గంలో సైతం అప్పటి ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ అవినీతి కి అడ్డు అదుపు లేకుండా పోయింది. పార్టీ ని పక్కన పెట్టి తన సొంతవారి కోసం చేయాల్సిదంతా చేసుకున్నారు. ముందు నుంచి గులాబీ జెండా పట్టిన వారికి మొండి చేయి చూపించారు.

తహశీల్దార్ మొదలుకొని కలెక్టర్ వరకు, ఎస్సై నుండి ఎస్పీ వరకు బెదిరింపులు పాల్పడినట్లు శంకర్‌నాయక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన చెప్పిన పని చేయకుంటే గులాబీ బాస్ కేసీఆర్ కి చెప్పి ట్రాన్స్‌ఫర్ చేయించి, ఎక్కడా కూడా పోస్టింగ్ లేకుండా చేయిస్తానని వార్నింగ్ ఇచ్చే వారంట. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా తో దురుసుగా వ్యవహరించారు. దాంతో ఆమె జిల్లా ఎస్పీ కి, IAS సంఘానికి ఫిర్యాదు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని శంకర్ నాయక్ ఏకంగా జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయించారు. అప్పట్లో ఆమెకు ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చారు. అలా శంకర్ నాయక్ చెలరేగి పోవడానికి కేసిఆర్, కేటీఆర్‌ల అండదండటే కారణమంటారు.


అదలా ఉంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మకాం మార్చారు. తన సొంత గ్రామం అయిన పాలకుర్తి నియోజకవర్గంలోని ఊకల్ గ్రామం కు పరిమితం అయ్యారు. దాంతో మహబూబాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు బాగోగులు ఎవరికి చెప్పుకోవాలి అని తలలు పట్టికున్నాయి. నియోజకవర్గంలో ఉన్న ఇంటికి తాళం వేసి ఉండడంతో నిరాశ తో వెనుతిరిగుతున్నారు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షురాలు గా ఉన్న మాజీ ఎంపీ కవిత కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈమె సైతం కేటిఆర్ కు బినామీ ఉంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

Also Read: కేటీఆర్ జైలుకి వెళ్తే.. బీఆర్ఎస్‌ను నడిపేదెవరు? రాత్రి ఏం జరిగింది?

కవిత ఇంటికి కూడా తాళం వేసి ఉంటుంది. ఎప్పుడో ఓ సారి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారంట. ఇక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ , జిల్లా నుండి స్ర్తీ ,శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గా ప్రాతినిధ్యం వహించారు. ఈమె కూడా వ్యక్తిగతంగా వందల కోట్ల ఆస్తులు కూడా బెట్టారని జిల్లాలో టాక్. ఒక్క గిరిజనుడిని కూడా ఎదగనివ్వలేదన్న విమర్శులున్నాయి. ఆమె కూడా జిల్లా లో అందుబాటులో ఉండటం లేదు. ఆమె ఇంటికి కూడా తాళమే స్వాగతం పలుకుతుంది. ఇక జిల్లా కేంద్రంలో లో మిగిలింది ఎమ్మెల్సీ తక్కళ్ల పల్లి రవీందర్ రావు.. ఈయన రూటే సెపరేటు. పార్టీ క్యాడర్ కానీ, పార్టీ పనులు కానీ పట్టించుకోరు. నిత్యం కేసీఆర్ భజన చేయడమే ఆయన పని. ఆయన కేవలం తన వర్గం కోసమే పనిచేస్తారంట.

అప్పుడు అధికారం లో ఉన్నప్పుడు పార్టీ తో రాజభోగాలు అనుభవించి, వ్యక్తి గతంగా ఎంతో లాభపడి ప్రస్తుతం ఎవరూ నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో క్యాడర్ మొత్తం గుర్రు గా ఉన్నారు. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ , మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత వేర్వేరు గా క్యాంపు కార్యాలయాలను పోటాపోటీగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించింది. ఇప్పుడు అవన్ని మూతపడ్డాయి. అధికారం పోయాక జనాలు మాకు ఎందుకు అనుకున్నారో ఏమో అటు జనానికి, ఇటు కేడర్‌కి ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు.

మొత్తానికి మానుకోటలో బీఆర్‌ఎస్‌ నేతల క్యాంపు కార్యాలయాలకు , బీఆర్ఎస్ కార్యాలయానికి తాళం పడటం చర్చనీయాంశంగా మారింది. అందుబాటులో ఉంటే పార్టీ క్యాడర్ కు బాధలు,కష్టలలో పాలు పంచుకోవాల్సి వస్తుందని, ఆర్ధిక భారం మీద పడుతుందని కూడా జిల్లా కార్యాలయంతో పాటు అందరి క్యాంపు కార్యాలయం కు తాళం వేసుకున్నట్లు ప్రజల్లో టాక్ వినిపిస్తుంది. గత ఏడాది మొత్తం లో కేవలం 5 సార్లు మాత్రమే పార్టీ కార్యాలయం తాళం తీశారని, తీసినప్పుడల్లా గంట సమయం కు మించి ఉంచలేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ ఎస్ శ్రేణుల్లో వారి పట్ల , పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుంది.

 

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×