E-Paper
Advertisement

KCR: గులాబీ నేతల్లో అంతర్మథనం… !

KCR: గులాబీ నేతల్లో అంతర్మథనం… !

KCR: తెలంగాణా సెంటిమెంట్ తో ముందుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అదే సెంటిమెంట్ తో అధికారంలో ఉంది. అయితే టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత పార్టీకి 2023 సాధారణ ఎన్నికల్లో మాత్రం ఆ స్ట్రాటజీ వర్కవుట్ అవలేదు.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో తప్ప మిగతా జిల్లాల్లో అనుకున్నంత రిజల్ట్స్ తెచ్చుకోలేకపోయింది. అందుకు కారణం జిల్లాల్లో ఆ పార్టీకి సంబంధించిన ఒక్కరిద్దరికి తప్ప మరే నేతకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే అన్న వాదన వినిపిస్తోంది. ఆ ఎఫెక్ట్ సర్పంచ్ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయిందని, ఇప్పటికైనా అధిష్టానం వైఖరి మారకపోతే రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమదం ఉందని క్యాడర్ వాపోతోంది.

గులాబీ పార్టీలో కొందరు నేతలకే ప్రాధాన్యత

గులాబీ పార్టీలో కేవలం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కొడుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇతర ఒక్కరిద్దరు ముఖ్యనేతలకు మాత్రమే ప్రాధాన్యత ఉందని.. మిగతా బీఆర్ఎస్ నాయకులను పట్టించుకునేవారు లేరని, ఇక జిల్లా నాయకత్వం విషయానికొస్తే పార్టీలో వారి ఊసేత్తినవారే లేరని బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.. ఆ ప్రభావంతో జిల్లాల్లోని గులాబీ దళం తీవ్ర నిరాశలో ఉన్నారట.. 2023 ఎన్నికల తర్వాత తమను పట్టించుకున్న నాధుడే లేడని సభలు, సమావేశాల్లో తమ గోడును వెల్లబోసుకుంటున్నారట అక్కడక్కడ జిల్లాల్లో ఉన్న నాయకులు..

గ్రామస్థాయి నుంచి కమిటీలపై దృష్టి

జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా సరైన కమిటీలు ఏర్పాటు చేసుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందని, అందుకే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని పార్టీ అంతర్గత విశ్లేషణలో తేలిందట.. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు సంసిద్ధం అయింది బీఆర్ఎస్.. గ్రామస్థాయి నుంచి కమిటీలను ఏర్పాటుచేసుకుని మళ్లీ తిరిగి పార్టీని పటిష్టం చేసేందుకు గులాబీ పార్టీ ముఖ్యనేతలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇందుకోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడా గెలిచిన సర్పంచ్ లను సన్మానిస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నారట..

తమ సత్తా ఏంటో చూపించుకోవాలని బీఆర్ఎస్ సిద్ధం

త్వరలో రానున్న జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ సత్తా ఏంటో చూపించుకోవాలని బీఆర్ఎస్ సన్నద్ధం అవుతోందట.. అందుకే గ్రేటర్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్యనేతలతో అతి త్వరలో పార్టీ అధిష్టానం సమావేశం కానుందట.. ఆ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలను వారికి దిశానిర్దేశం చేయనున్నారట.. గ్రేటర్ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యే సీట్ల మాదిరిగానే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని యోచిస్తోందట..

గత తప్పులను దిద్దుకునే పనిలో బీఆర్ఎస్

జిల్లాల్లో మాదిరిగానే గ్రేటర్ లో కూడా సరైన నాయకత్వాన్ని బలపరచకపోతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం ఖాయమని, ముందుగానే మేల్కొన్న బీఆర్ఎస్ గత తప్పులను దిద్దుకునే పనిలో పడిందంట. మరి వచ్చే గ్రేటర్ పోరులో బీఆర్ఎస్ ఎన్ని స్థానాలను దక్కించుకుంటుందో కాని.. బీఆర్ఎస్ మొదలుపెట్టిన ఈ దిద్దుబాటు చర్యలు ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తాయో ఎన్నికల అనంతరం తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Story by: Ajay, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×