BigTV English

Gundeninda Gudigantalu Today Episode : రోహిణి గురించి ప్రభావతికి తెలిసిన నిజం.. ఇంట్లో నుంచి గెంటేయ్యడం ఖాయం..

Gundeninda Gudigantalu Today Episode : రోహిణి గురించి ప్రభావతికి తెలిసిన నిజం.. ఇంట్లో నుంచి గెంటేయ్యడం ఖాయం..

Gundeninda GudiGantalu Today episode November 24 th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుశీలమ్మ మీనాతో చనువుగా ఉండటం చూసి ప్రభావతి, రోహిణి తట్టుకోలేక పోతారు. మా అత్తను ఆ మీనా తన గ్రిప్ లో పెట్టుకుందని కళ్ళల్లో నిప్పు పోసుకుంటుంది. రోహిణి ఎప్పుడెప్పుడు పని తప్పించుకోవాలి అని చూస్తుంది. ఇక డ్రామా ఆడుతుంది. ఇక ప్రభావతి సపోర్ట్ దొరకడంతో ఇంకాస్త రెచ్చిపోతుంది. తనకు వంట చేయడం రాదని రోహిణీ చెప్పినా.. తాను నేర్పిస్తానంటూ వంట చేయిస్తుంది సుశీల. ఇలానే ఉంటే వంట మొత్తం తన తోనే చేయిస్తారని.. తనకు తల తిరుగుతుంది అంటూ యాక్టింగ్ చేస్తుంది రోహిణి. దీంతో ప్రభావతి తీసుకువెళ్లి హాల్లో పడుకోబెట్టి తలపై చల్లని గుడ్డ వేస్తుంది. ఇంతలోనే రోహిణి తల్లి సుగుణ ఇంటికి వస్తుంది. తన కూతురికి ఏదో ప్రమాదం జరిగిందని కంగారు పడుతుంది. అదే రోహిణి కొంప ముంచింది. ఆమె ఇంటికి రావడంతో అడ్డంగా దొరికినట్లు తెలుస్తుంది. ప్రభావతి వచ్చి ఎందుకలా అరుస్తున్నావు. అసలు రోహిణికి నీకు సంబంధం ఏంటి? అని నిలదీస్తుంది ప్రభావతి. ఇక దాంతో ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది..


ఇక ప్రోమో విషయానికొస్తే.. ఎవరో ఫోన్ చేశారు నీకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పడంతోనే ఇక్కడకు వచ్చానని చెబుతుంది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి దినేష్ అని తెలుసుకొని షాక్ అవుతుంది. వాడికి డబ్బులు ఇవ్వలేదని నన్ను ఇది చేస్తున్నాడు. వాడిని అస్సలు వదలను అని అంటుంది. నా బ్రతుకు నేను బ్రతుకుతున్న నన్ను దయచేసి ఇబ్బంది పెట్టకు అని రోహిణి కన్న తల్లికి మోహన్ చెప్పేస్తుంది. దానికి సుగుణ బాధ పడుతుంది. కన్న కూతురు ఎలా ఉందో అని చూడటానికి కూడా రాకూడదు అంటే ఇక నేను బ్రతికి ఉన్నా వెస్ట్ అంటుంది. ఇక మీనా వారి మాటలు వినకపోడవంతో రోహిణి ఏదోటి చెప్పి కవర్ చేస్తుంది. తర్వాత చింటూ కోసం గారెలు తీసుకొచ్చావా అని తినమని ఇస్తుంది రోహిణి. ఉంటాను ఆంటీ అని వెళ్లిపోతుంది రోహిణి. తర్వాత రోహిణి మీకు ముందే తెలుసు కదా అని సుగుణను మీనా అడుగుతుంది. దానికి సుగుణ తెగ షాక్ అవుతుంది. అయితే, రోహిణి తనకు ఎలా తెలుసో చెబుతుంది. కానీ, రోహిణి తన కూతురు అని చెప్పకుండా ఏదో జస్ట్ పరిచయం ఉన్నట్లుగా చెప్పి కవర్ చేస్తుంది సుగుణ..

మీనా మాత్రం వారిద్దరికీ ముందే పరిచయం ఉందని ఎలాగైనా బయట పెట్టాలి అనుకుంటుంది. బాలు దీపావళి పండుగను బాగా జరుపుకోవాలని ఇల్లంతా లైట్లతో నింపేస్తాడు. మీనా ఇంటి నిండా దీపాలు పెడుతుంది. సుశీల చూసి మనమరాలి పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఇక తర్వాత సత్యం ఫ్యామిలీ అంతా కలిసి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో భాగంగానే అంతా కలిసి టపాసులు కాల్చుతుంటారు. వారంతా టపాసులు కాలుస్తుంటే పరాయి వాడిలా దూరం నుంచి చూస్తూ ఉంటాడు రవి. తన కుటుంబం అంతా కలిసి సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుంటే తాను మాత్రం ఇంటికి దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతాడు రవి..


ఇంట్లో అందరు సంబరంగా బాంబులు కాలుస్తుంటే రవి మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటాడు. అటు రవి కోసం శృతి వెతుక్కుంటూ వస్తుంది. సత్యం ఫ్యామిలీతో పాటు రోహిణి కొడుకు చింటు కూడా టపాసులు కాలుస్తుంటాడు. అది చూసి మనోజ్ తెగ చిరాకుపడతాడు. వాడు ఎవడికి పుట్టాడో తెలియదు. కానీ, చూడు దర్జాగా ఇంటి మనవడిలాగా ఎలా కాలుస్తున్నాడో చూడు అని రోహిణి, ప్రభావతితో తన అక్కసు వెళ్లగక్కుతాడు మనోజ్. తర్వాత చింటు టపాసులు కాల్చేందుకు వెళ్తాడు. కానీ, వాడిపై ప్రభావతి అరుస్తుంది. రేయ్ పక్కకు తప్పుకోరా అని గద్దిస్తుంది.. ఇంతలో చింటు కళ్లలో టపాసుల నిప్పు రవ్వు పడుతుంది. దాంతో రోహిణి తెగ కంగారుపడిపోయి చింటూ అని వెళ్తుంది. రోహిణి తల్లి ప్రేమ బయటపడి చింటుని ఎత్తుకుని పక్కకు లాగుతుంది. అదంతా చూసి మనోజ్, ప్రభావతి, బాలు, మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత కింద కూర్చుని మంటగా ఉందా, కళ్లు మండుతున్నాయా, జాగ్రత్తగా ఉండాలి కదా అని చింటుతో చెబుతుంది రోహిణి.

సుగుణకు చింటూను అప్పచెప్పి పిల్లాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటుంది. ఇక రోహిణి దగ్గరకు బాలు వెళ్లి పార్లరమ్మా నువ్వెందుకు అంత కంగారుగా పరిగెత్తావ్ అని అడుగుతాడు. దాంతో రోహిణి భయంతో కంగారుపడుతుంది. రోహిణి ఏం చెబుతుందా అని ప్రభావతి, మనోజ్ వేచిచూస్తారు. కానీ, రోహిణి మాత్రం కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇక చిన్న పిల్లలకు ఏమైనా అయితే తాను తట్టుకోలేనని, పిల్లలంటే తనకు ఇష్టమని, అందుకే అలా రియాక్ట్ అయి కంగారుగా పరుగెత్తానని రోహిణి కవర్ చేసుకుంటుంది. రోహిణి మంచితనతం చూసి ప్రభావతి, మనోజ్ మురిసిపోతారు. మొత్తానికి రోహిణి ఆలా సేఫ్ అయ్యింది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×