BigTV English
Advertisement

Ganja Seized: గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. మొత్తం ఎన్ని కిలోలు దొరికిందంటే..

Ganja Seized: గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. మొత్తం ఎన్ని కిలోలు దొరికిందంటే..

Ganja Seized: హైదరాబాద్‌ గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. రెండు కేసుల్లో 12 కేజీలకుపైగా గంజాయిని పట్టుకున్నారు. మల్కాజ్‌గిరిలోని చర్లపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో DTF సీఐ భరత్‌ భూషన్‌ టీమ్‌లో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన హరి కుశ్వాహ, ఒడిశాకు చెందిన బైనాథ్‌ బిశ్వాల్‌ను అరెస్ట్‌ చేశారు. కుశ్వాహ నుంచి 4 కేజీలు, బిశ్వాల్‌ నుంచి 6 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నిందితులు ఇద్దరిని ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు.


మరో కేసులో రెండు కేజీల గంజాయిని పట్టుకున్నారు. నాందేడ్‌ నుంచి డీసీఎం వ్యాన్‌లో గంజాయి వస్తుందన్న సమాచారంతో.. STFB ఎస్సై బాలరాజు రైడ్స్‌ చేశారు. వ్యాన్‌లో తనిఖీలు చేయగా.. రెండు కేజీల 230 గ్రాముల గంజాయి దొరికింది. డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ పైసల్‌ను అరెస్ట్‌ చేసి.. వ్యాన్‌ను సీజ్‌ చేశారు.

ఉప్పల్ – మల్లాపూర్‌లో మరో గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి.. 106 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ 53 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. HCL ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఒడిశా నుంచి గంజాయి తరలించినట్టు తెలుసుకున్నారు. గోడౌన్‌లో తనిఖీ చేసి 2 కిలోల చొప్పున గంజాయి ఉన్న 56 ప్యాకెట్లు.. ఒక కిలో గంజాయి ఉన్న 6 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు వివేక్‌రెడ్డి, మధుకిరణ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాంబాబు పరారీలో ఉన్నట్టు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.


Also Read: నెక్స్ట్ సీఎం మీరే..! నాంచారమ్మ జాతరలో సోది జోస్యం చెప్పించుకుంటున్న కవిత

ప్రధాన నిందితుడు రాంబాబు.. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తెచ్చి అమ్మాలని చూశాడని చెప్పారు పోలీసులు. రాంబాబు చెప్పడంతోనే.. ఇద్దరు నిందితులు గంజాయి ప్యాకెట్లను గోడౌన్‌లో దాడిపెట్టారని అన్నారు. రాంబాబును పట్టుకుంటే.. ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడతాయన్నారు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి. ఒడిశాలోని మల్కన్‌ జిల్లాలో గంజాయిని పెద్ద మొత్తంలో సేకరించి.. మిషన్లలో ప్రెస్సింగ్‌ చేసి ముద్దలుగా తయారుచేసి.. హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్టు గుర్తించారు. గంజాయిని ఎలా ప్రెస్సింగ్‌ చేస్తున్నారో.. ఆ వీడియోలను కూడా సేకరించామన్నారు జాయింట్‌ కమిషనర్‌ ఖురేషి. మాదకద్రవ్యాల ముఠాలను నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారాయన.

Related News

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Hyderabad: జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ హత్య కేసులో 24 గంటల్లోనే వీడిన మిస్టరీ!

Bandi Sanjay: బోరబండ రోడ్ షో రగడ.. పోలీసులు ఎంఐఎం తొత్తులా?, బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×