E-Paper
Advertisement

సీఎం సభ తరువాత కేటీఆర్‌ ఇలాఖాలో అభివృద్ధి పరుగులు! వేములవాడతో కలుపుకుని రూ. 345 కోట్ల పనులు! రామన్నా రాకున్నా ఆగని అభివృద్ధి!

సీఎం సభ తరువాత కేటీఆర్‌ ఇలాఖాలో అభివృద్ధి పరుగులు! వేములవాడతో కలుపుకుని రూ. 345 కోట్ల పనులు! రామన్నా రాకున్నా ఆగని అభివృద్ధి!
Advertisement

కేటీఆర్‌ ఇలాఖాలో సీఎం సభ జరిగి నెల రోజులైంది. ఈ నెల రోజుల్లోనే ఎంత మార్పు. ఈ నియోజకవర్గం ముఖ చిత్రాన్నే మార్చేలా అభివృద్ధి పనులు అక్కడ పరుగులు పెడుతున్నాయి. కేటీఆర్‌ ఆ నియోజకవర్గానికి టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారితే.. సీఎం దీన్ని దత్తత తీసుకున్నాడా? అనే రకంగా అభివృద్ది జరుగుతోందక్కడ..

నీ ఏరియాకే వస్తా.. నీ సంగతి చెబుతా! అని సీఎం రేవంత్‌ రెడ్డి అనుకున్నది చేసి చూపుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మూడోసారి ఎన్నికయ్యారు కేటీఆర్‌. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పతనం కావడంతో.. అటు ఛాయలు కూడా పోవడం లేదు. అప్పుడోసారి ఇప్పుడోసారి అలా చుట్టపు చూపుగా పోయి వస్తున్నాడంతే. దీంతో రామన్నను టూరిస్ట్ ఎమ్మెల్యేగా పిలుచుకుంటున్నారు ముద్దుగా.

Advertisement

కవిత కూడా ఆ నియోజకవర్గానికి పోయి అన్నపై విమర్శల వర్షం కురిపించారు ఇటీవల. ఆరోపణల అస్త్రాలు సంధించారు. టూరిస్ట్‌ ఎమ్మెల్యే అని విమర్శించి వచ్చారు. ఆ తరువాత సీఎం సభ పెట్టి మరీ కేటీఆర్‌పై విమర్శలు చేయడంతో పాటు సిరిసిల్ల, వేములవాడలకు కలిపి నిధుల వరద పారించారు. వివిధ అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 345 కోట్లను మంజూరు చేశారు. ఈ పనులు దశలవారీగా చకచకా జరుగుతున్నాయి.

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నేతన్న బజార్‌ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.  చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల ఉత్పత్తుల మార్కెటింగ్‌ చేసుకునే సౌకర్యాన్ని ఇలా కల్పించింది సర్కార్‌. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌న్‌ నిర్మాణానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. పెద్దూర్‌ మండలంలో ఇందిరా మహిళా శక్తి భవనం ప్రారంభమైంది. రూ. 200 కోట్లతో సిరిసిల్ల, వేములవాడ.. రెండు నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ కాంప్లెక్స్‌ పనులు వడివడిగా సాగుతున్నాయి. దీనికి 18 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.

Advertisement

కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్ నిర్మాణం జరుగుతోంది. పాలనా సౌలభ్యం కోసం రెండు నియోజకవర్గాల్లో కొత్త ఆర్డీవో ఆఫీసు భవన నిర్మాణం పనులు మొదలయ్యాయి. 10వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను నిర్మిస్తున్నారు. వేములవాడలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం.. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం రూ. 99.40 కోట్లతో గోపురాలు, ప్రాకారాలు, మండపాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు వడివడిగా సాగుతున్నాయి.

సకాలంలో ఈ పనులన్నీ పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఈ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏడాది కాలంలో దాదాపుగా ఈ పనులన్నీ పూర్తి కావొచ్చని అధికారులు చెబుతున్నారు. సీఎం వచ్చి వెళ్లిన తరువాత కనీసం అటువైపు కూడా కేటీఆర్‌ వెళ్లలేదు. కనీసం తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయలేదనే విమర్శలున్నాయి. లోకల్ ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి పనులు శర వేగంగా జరుగుతుండటంతో ఇది పొలిటికల్‌ చర్చకు దారి తీసింది.

Tags

Related News

హస్తినలో ఇండీ నిరసన గళాలు! హైదరాబాద్‌లో బీజేపీ బల ప్రదర్శనలు! అమిత్ షా రాకతో బీజేపీలో సందడి..! తెలంగాణపై షా స్పెషల్‌ ఫోకస్‌!

ఆప్ ను అందలమెక్కించిన ఢిల్లీ విద్యా విప్లవం..! సర్కారీ విద్యకు అత్యధిక ప్రాధాన్యం..! భారీ సంస్కరణలతో మంచి ఫలితాలు.. పంజాబ్ లో గెలుపుకీ దోహదం!

సర్కారీ విద్య బలోపేతానికి భారీ సిఫార్సులు! మియాపూర్ భూముల అమ్మకం సొమ్మును వినియోగించాలని సూచన..! తన మాటవింటే మళ్లీ గెలవటం పక్కా అంటున్న మురళి!

మూడు పార్టీలు.. మూడు స్కెచ్‌లు.. ఒక్కటే టార్గెట్!

ఎల్‌నినో దెబ్బకు చెక్.. అర్నబ్ తుపాన్‌తో నిండిన ఉత్తరాంధ్ర రిజర్వాయర్లు

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలు అడుగుతున్నారని ప్రచారం! ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే ఆ పత్రాన్ని చూపిన కేటీఆర్‌..! సర్కార్‌ ఖండించినా ఆగని దుష్ప్రచారం!

రాహుల్‌ను ప్రధానిని చేయలేదు..:! కేటీఆర్‌ను సీఎం చేస్తా..! కేసీఆర్‌కు కలిసిరాని కాలం! ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..?

Big Stories

Advertisement
×