E-Paper
Advertisement

జీవన్ రెడ్డి సీన్ రిపీట్ కానుందా? హస్తం పార్టీకి సీనియర్ల తిరుగుబాటు సెగ!

జీవన్ రెడ్డి సీన్ రిపీట్ కానుందా? హస్తం పార్టీకి సీనియర్ల తిరుగుబాటు సెగ!
Advertisement

Congress: కాంగ్రెస్ గురించి తెలిసిందేగా! కుమ్ములాటలు, అలక బాటలు.. అక్కడ అన్నీ కామన్. ముఖ్యంగా్.. సీనియర్ లీడర్ల అసంతృప్తికి తెరపడట్లేదు. కొన్ని నెలల క్రితమే.. జీవన్ రెడ్డి ఎపిసోడ్‌తో గాంధీభవన్‌కు షాక్ తగిలింది. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన వారిని కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని జీవన్ రెడ్డి వెళ్లిపోయారు. ఇప్పుడు.. జిల్లాల్లో వర్గపోరు జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా.. వనపర్తి పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య ఆధిపత్య పోరు పీక్‌కి చేరింది. డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారంటూ.. చిన్నారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మేఘారెడ్డి.. తన అనుచరులను ఇబ్బందిపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇదిలాగే కొనసాగితే.. జీవన్ రెడ్డిలాగా పార్టీపై తిరగబడాల్సి వస్తుందన్నారు.

చిన్నారెడ్డిపై మేఘా రెడ్డి ఫైర్..

Advertisement

చిన్నారెడ్డి మతితప్పి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఫైర్ అయ్యారు. 2018లో.. 50 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెనక ఉండి డ్రామా ఆడిస్తున్నారని ఆరోపించారు.

హీటెక్కిన ఉమ్మడి నల్గొండ..

Advertisement

ఇక.. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు మరింత హీటెక్కాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన అసమ్మతి గళాన్ని వినిపించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్.. మీనాక్షి నటరాజన్, జిల్లా మంత్రులు హాజరైన.. ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్‌కు.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండటం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, బయటి నుంచి వచ్చి చక్రం తిప్పుతున్న వారి తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

సీనియర్ల బహిరంగ అసంతృప్తి..

పార్టీ పెద్దలు ఎన్ని సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నా.. సీనియర్ల బహిరంగ అసంతృప్తి.. ప్రభుత్వానికి, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారుతోంది. వనపర్తిలో చిన్నారెడ్డి-మేఘారెడ్డి వర్గపోరు, నల్గొండలో రాజగోపాల్ రెడ్డి తీరు.. కాంగ్రెస్ హైకమాండ్‌కు తీవ్ర సవాల్‌గా మారాయి. ఈ అంతర్గత కుమ్ములాటలను గాడిలో పెట్టకపోతే.. పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ అసమ్మతి జ్వాలల్ని అధిష్టానం, పీసీసీ చీఫ్ ఎలా చల్లారుస్తారనేదే ఆసక్తిగా మారింది.

Also Read: రెండు రాష్ట్రాలు.. ఒకే సీన్.. అసెంబ్లీకి రాని మాజీ సీఎంలు!

Tags

Related News

పంట పొలాలకే కాదు.. మీ జేబుకూ చిల్లు! ఎల్‌నినో తెస్తున్న ఆర్థిక సంక్షోభం

రెండు రాష్ట్రాలు.. ఒకే సీన్.. అసెంబ్లీకి రాని మాజీ సీఎంలు!

నిరుద్యోగుల నిరసనలకు రాహుల్ గాంధీ మద్దతు.. జార్ఖండ్‌లో దిగివచ్చిన సీఎం సోరేన్!

ఉజ్జయిని నాగచంద్రేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. 13 మంది భక్తులకు గాయాలు!

తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. సెప్టెంబర్ 16 లోపు ఇది చేయకపోతే మీ ఓటు పోయినట్లే?

రీఛార్జ్ పేరుతో టెలికామ్ కంపెనీల దోపిడీ.. జియో, ఎయిర్‌టెల్ కంపెనీల దందా బట్టబయలు

ఏపీలో ఉద్యోగాల రాజకీయం: డీఎస్సీ, గ్రూప్-1 పై అసెంబ్లీ, మండలిలో రచ్చ!

Big Stories

Advertisement
×