Big Stories

Election Commission: స్వామి భ‌క్తికి రూల్స్ లేవా!

Election Commission Controversy: ఎన్నికల కమిషన్ అధికారులపై కొరడా ఝులిపిస్తున్నా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. చివరకు నామినేషన్ల సందర్భంగా అధికార పార్టీకి విధేయులుగా ఉంటు స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు పలువురు సిబ్బంది. ఏకంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అధికార పార్టీ నేతలు చోచ్చుకు పోతున్నా యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తుండటం విమర్శలపాలవుతుంది. మరో వైపు ప్రతిపక్షాల అభ్యర్థులను మాత్రం రకరకాల ఆంక్షలతో అనేక ఇక్కట్లుకు గురి చేస్తున్నారు. దాంతో అలాంటి అధికారులపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల తతంగం మొత్తం ఎలక్షన్ కమిషన్ పరిదిలో నడుస్తున్నప్పటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న యంత్రాంగం యధేచ్చగా వ్యవహరిస్తుంది. అదేమని ఎవరైనా గట్టగా ప్రశ్నిస్తే పొరపాటున జరిగిందని అంటున్నారు. నామినేషన్ కేంద్రానికి రెండు వందల మీటర్ల దూరంలోకి కేవలం నామినేషన్ వేస్తున్న వ్యక్తి తో పాటు నలుగురు మాత్రమే వెళ్ళాల్పి ఉండగా వందలాది మంది వెళుతున్నారు. అదే విదంగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి వాహానాలు సైతం పంపుతున్నారు. జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు పరిశీలిస్తూ అధికార పక్షంతో అధికారులు అంటకాగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

కుప్పం నియోజకవర్గంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తరపున అయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. అమెను 500 మీటర్ల ముందే వాహానం నుంచి దింపివేసి కాలినడకన రిటర్నీంగ్ అధికారి కార్యాలయం వద్దకు నడిపించారు. అయితే మరోసటి రోజు వైసీపీ అభ్యర్థి భరత్ సతీమణి భర్త తరపున నామినేషన్ దాఖలుకు వచ్చారు. అమె వాహానాన్ని ఎకంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమంతించారు. అదే సమయంలో ఎన్నికల విధులతో సంబంధంలేని రిటైర్డు ఎంపిడిఓ ద్విచక్రవాహానంతో నేరుగా రిటర్నింగ్ అదికారి కార్యాలయంలోకి వెళ్ళారు. దానిపై అక్కడి డీఎస్పీని ప్రశ్నిస్తే పోరపాటున తన సింబ్బంది పంపించారని కప్పదాటు సమాధానం చెప్పారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఈసీకి కంప్లైంట్ చేస్తామంటున్నారు.

Also Read: చింతమనేనికి తీరిన చింత..

చిత్తూరులో వైసీపీ అభ్యర్థి విజయానందారెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన సమయంలో నగరంలో ఎక్కడి కక్కడ ప్రదాన రహాదారులకు అడ్డంగా వాహానాలు నిలిపివేసి జనాన్ని నామినేషన్ కేంద్రానికి తరలించారు. కనీసం రహాదారుల మీద వెళుతున్న పాఠశాల వాహానాలకు సైతం సైడ్ ఇవ్వలేదు. దీంతో గంటల తరబడి చిన్న పిల్లలు పాఠశాల వాహానాలలో ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది చాలదన్నట్లు నిబంధనలు విరుద్దంగా పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ నేరుగా కలెక్టర్ కార్యాలయం గేటు వద్దకు చొచ్చుకు వచ్చారు.

పుంగనూరు లో మంత్రి పెద్ది రెడ్డి నామినేషన్ సందర్భంగా ఏకంగా వందలాది మంది కార్యకర్తలు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చారు. మరుసటి రోజు టిడిపి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తుంటు 500 మీటర్లకు ముందు వాహానాలు అపివేసారు. ఇదే విదంగా ఏకంగా తంబల్లపల్లిలో అయితే టీడీపీ కార్యకర్తలమీదా లాఠీ చార్జీ చేసి వారిపై హత్యయత్నం కేసులు సైతం పెట్టారు.

తాజాగా తిరుపతిలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.రిటర్నీంగ్ అదికారి కార్యాలయం వద్దకు కూడా పూర్తి స్థాయిలో ర్యాలీని అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ పార్టీ అభిమానులు జనసేన అభ్యర్థికి వేయాలనుకున్న గజమాలను సైతం వెనుక్కు పంపాల్సి వచ్చింది. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయంలోకి వెళ్లినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

Also Read: వైసీపీ పనైపోయింది, వారంతా ఇక జైలుకే

జీడి నెల్లూరు నియోజకవర్గంలో సైతం అదే పరిస్థితి కనిపించింది. భా రీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీశ్రేణులను అడ్డుకోవడానికి లారీని అడ్డంగా ఉంచి ర్యాలీని పక్కకు మల్లించాలని పోలీసు అధికారులు యత్నించారు. దీంతో టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం నడిచింది. చివరకు ఎస్అర్ పురం మండల నాయకుడు జయశంకర్ నాయుడిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

చిత్తూరులో డిప్యూటీ మేయర్ ఇంట్లో మద్యం పెద్ద ఎత్తున లభ్యమైంది. రెండు రోజుల తర్వాత దానిపై కేసు నమోదు చేసారు. పుత్తూరులో సైతం ఏకంగా 300 కేసులు మద్యం సీజ్ అయితే దాని గురించి ఏమాత్రం బయటకు పొక్కకుండా అడ్డుకున్నారు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఏకంగా ఓ వీఆర్‌ఒ సమావేశం ఏర్పాటు చేసి వచ్చిన వారందరికి మద్యం పంపిణీ చేసారు. దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగి అధారాలతో సహా ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. కనీసం మద్యం తెచ్చిన కారును సైతం సీజ్ చేయలేదు.

మొత్తం మీద రాష్ట కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా వ్యవహారిస్తున్నప్పటికి  కింది స్థాయి అధికారులు మాత్రం స్వామిభక్తి ప్రదర్శిస్తుండటం వివాదాస్పదంగా మారింది. అలాంటి వారిపై వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నా జిల్లా స్థాయి అధికారులలో స్పందన కనిపించడం లేదు. మరి అలాంటి అధికారుల ధీమా ఏంటో వారికే తెలియాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News