Big Stories

Chinthamaneni Prabhakar : చింతమనేనికి తీరిన చింత..

- Advertisement -
- Advertisement -

తాజాగా శ్రీకాకుళంలో చంద్రబాబు చేతుల మీదుగా బీఫాం తీసుకుని ఈసీ నిబంధనల ప్రకారం లాంఛనం పూర్తి చేయనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో దెందులూరు అసెంబ్లీ స్థానంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో దెందులూరుకు ముడిపడటంతో చింతమనేని అభ్యర్ధిత్వం సస్పెన్స్‌లో పడింది.

Also Read: వైసీపీ పనైపోయింది, వారంతా ఇక జైలుకే

అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడ టికెట్ కోసం పట్టుపట్టారు .. ఆ సీటు బీజేపీకి కేటాయించినప్పటికీ టీడీపీ అభ్యర్ధిగానే పోటీలో ఉంటానని ప్రకటించారు. అయితే ఇప్పుడా చిక్కుముడి వీడింది నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయించడానికి టీడీపీ, బీజేపీ నేతలు ఒప్పించారు. చంద్రబాబు, బుచ్చయ్యచౌదరి, బీజేపీ నేతలతో చర్చల తర్వాత బీజేపీ నుంచి పోటీకి నల్లమిల్లి అంగీకారించారు. తాజాగా ఆయన బీజేపీలో చేరి అనపర్తి అభ్యర్ధిగా ఖరారయ్యారు.

అయితే బీజేపీ అనపర్తి అభ్యర్ధిగా శివరామకృష్ణంరాజుని ప్రకటించింది. అయితే నల్లమిల్లి ఆ పార్టీలో చేరడంతో శివరామకృష్ణంరాజు పోటీ నుంచి తప్పుకుని ఆయనకు సహకరించడానికి అంగీంకరించారు. ఆ క్రమంలో బీజేపీ రాష్ఠ్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నల్లమిల్లి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసి స్వచ్ఛంధంగా తప్పుకున్న శిమరామకృష్ణంరాజుని ప్రశంసలతో ముంచెత్తారు.

నల్లమిల్లి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేస్తుండటంతో చింతమనేనికి లైన్ క్లియర్ చేసింది టీడీపీ దెందులూరు టికెట్‌ను చింతమనేనికి కన్ఫామ్ చేసింది తెలుగుదేశం అధిష్టానం. చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలుకు గుడువు ముగియనుండటంతో తన నామినేషన్ దాఖలు చేశారు. దుగ్గిరాలలోని నివాసం నుంచి వందలాది బైకులతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా తనదే గెలుపు అంటూ చింతమనేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఉభయగోదావరి జిల్లాల్లో పొత్తుల లెక్కలు అలా ఫైనల్ అయ్యాయిప్పుడు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News