BigTV English

Unknown Party Treasures: పార్టీలు లేవమ్మా..! కళ్లు బైర్లు కమ్మే లెక్కలు బయటపెట్టిన ఈసీ

Unknown Party Treasures: పార్టీలు లేవమ్మా..! కళ్లు బైర్లు కమ్మే లెక్కలు బయటపెట్టిన ఈసీ

Unknown Party Treasures: నెలకు లక్ష రూపాయల దాకా సంపాదించిన వారు ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. అంతకు మించి సంపాదిస్తే స్లాబ్ ప్రకారం కట్టాలి. అయితే ఇందులో ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయి. విరాళాలు ఇచ్చినా, చారిటీ ప్రోగ్రామ్స్ కు సహాయం చేసినా ఐటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఇదే లూప్ హోల్ ను అడ్డం పెట్టుకుని బోగస్ క్లెయిమ్ గేమ్ నడిపిస్తున్నారు. ఇందుకోసం పొలిటికల్ పార్టీలను వాడుకుంటున్నట్లుగా తేలింది. 2022 నుంచి 2024 మధ్య ఏకంగా పది వేల కోట్ల రూపాయల స్కాం నడిచిందన్న మ్యాటర్ తెరపైకి వచ్చింది. ఇంతకీ ఐటీ నిఘాలో తేలిందేంటి?


ఓట్లు రావు..
సీట్లు ఉండవు..
పోటీనే చేయవు..
ఖాతాల్లో పైసల గలగల..
భారీ డిపాజిట్లు, విత్ డ్రాలు..
ఏంటి ఈ మిస్ మ్యాచ్ లెక్క?

రాజకీయ పార్టీ పెట్టేది ఇందుకేనా?


మనది ప్రజాస్వామ్య దేశం. రాజకీయ పార్టీ పెడితే కామన్ మ్యాన్ కు లేని బెనిఫిట్స్ ఎన్నో వచ్చి పడుతాయి. మొన్నటిదాకా పార్టీలకు విరాళం ఎవరు ఇస్తున్నారో కూడా తెలియకపోయేది. సుప్రీం తీర్పుతో ఇది మారింది. సో సరిగ్గా ఇలాంటి బెనిఫిట్స్ ను క్యాష్ చేసుకునేందుకే రాజకీయ పార్టీ అవతారం ఎత్తుతారు కొందరు. జస్ట్ పాన్ డబ్బా మాదిరిగా పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఒక కుర్చీ, ఒక టేబుల్ అంతే. అది కూడా సాదాసీదా ఏరియాల్లోనే. చుట్టు పక్కల వారికి కూడా ఏం డౌట్ రాదు. కానీ ఆ పార్టీ అకౌంట్లలో మాత్రం లక్షలు, కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆ డబ్బా ఆఫీస్ నుంచే నడిపిస్తుంటారు. అక్కడే గేమ్ ఉంది మరి. ఇక్కడ మనం అన్ని గుర్తింపు లేని పార్టీలను పాయింట్ అవుట్ చేయడం లేదు. ఐటీ నిఘాలో తేలిన విషయాలనే ప్రస్తావిస్తున్నాం. 2022 నుంచి 2024 మధ్య ఈసీ ఓ డ్రైవ్ చేపట్టింది. అసలు గుర్తింపులేని రాజకీయ పార్టీలు దేశంలో ఎన్ని ఉన్నాయి.. అవి ఏం చేస్తున్నాయి.

విరాళాలు ఎవరిస్తున్నారు? ఎందుకిస్తున్నారు?

వాటి సరైన అడ్రస్ ఏంటి.. అని లెన్స్ పెడితే చాలా వరకు వట్టి స్క్రాపే అని తేలింది. ఇదే సమయంలో సరైన అడ్రస్ లు ఇవ్వాలని ఈసీ అడిగితే కొన్ని ఇవ్వలేదు. వాటిని పూర్తిగా పక్కన పెట్టింది ఈసీ. సో నెక్ట్స్ పాయింట్ కు వద్దాం. ఇప్పుడు ఐటీ శాఖ వంతు. మరి ఇలా డబ్బా ఆఫీస్ లో పార్టీ పెట్టి ఊరికే ఉంటున్నారా అంటే.. లెక్కకు మిక్కిలి విరాళాలు.. ఎవరు ఇస్తున్నారో తెలియదు.. ఎందుకు ఇస్తున్నారో తెలియదు. అభ్యర్థుల్నే పెట్టని పార్టీలు బ్యాంకుల నుంచి క్యాష్ ఎందుకు విత్ డ్రా చేస్తున్నాయో అంతకంటే తెలియదు. కానీ మ్యాటర్ లో డీప్ గా వెళ్తే డీల్స్ అన్నిటినీ ఐటీ డీకోడ్ చేస్తోంది. మొత్తంగా గత మూడేళ్లలో ఏకంగా 10 వేల కోట్ల రూపాయల మేర స్కాం నడిచినట్లు ప్రాథమికంగా ఐడెంటిఫై చేసింది.

గుర్తింపులేని పార్టీలకు ఫండింగ్ జోరు పెరిగిందా?

దేశంలో రిజిస్టర్ అయి గుర్తింపులేని రాజకీయ పార్టీలు ఫుల్ జోరుమీదున్నాయి. ఓట్ల రూపంలో కాదు.. ఫండింగ్ లో. అవును మీరు వింటున్నది నిజమే.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా వీటి ముందు దిగదుడుపే మరి. నిజానికి రాజకీయ పార్టీ పెట్టిన వారు ఏం చేయాలి.. ఎన్నికలు వస్తే అభ్యర్థులను పోటీకి పెట్టాలి. జనంలోకి వెళ్లి ప్రచారం చేయాలి. మరి వీటికి జనం ఇచ్చే విరాళాలే కీలకం. అందుకే ఫండింగ్ తీసుకుంటాయి. పార్టీని రన్ చేసుకుంటాయి. కానీ ఈసీ గుర్తింపులేని, అడ్రస్ లేని కొన్ని రాజకీయ పార్టీలు.. విచిత్రంగా.. ఎన్నికల్లో ప్రచారం చేయడం కంటే.. పార్టీకి విరాళం ఇవ్వడం వల్ల కలిగే ఐటీ మినహాయింపు బెనిఫిట్స్ గురించి ఫుల్ జోష్ తో ప్రచారం చేస్తుంటాయి. ఎందుకంటే వారి లెక్కలు వారికి ఉన్నాయి మరి. జస్ట్ పొలిటికల్ ఫండింగ్ కోసమే నడిచేవి పెరుగుతున్నాయనడానికి తాజాగా బయటికొస్తున్న బోగస్ క్లెయిమ్ లెక్కలే నిదర్శనం.

రూ.10 వేల కోట్ల విరాళాలు సేకరించినట్లు గుర్తింపు

గుర్తింపు లేని కొన్ని పొలిటికల్ పార్టీలు నిర్వహిస్తున్న వందలాది బ్యాంకు ఖాతాలలో 10 వేలకోట్ల రూపాయలకు పైగా నిధులు విరాళంగా సేకరించినట్లు ఆదాయపు పన్ను శాఖ ఇటీవలే ఐడెంటిఫై చేసింది. 2022 నుంచి 2024 వరకు రెండేళ్లలో 3,260కి పైగా ఇలాంటి పార్టీలకు ఇంత మొత్తం ఫండింగ్ గా వచ్చిందని తేలింది. రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం తప్పు కాదు. కానీ పోటీ పెట్టకుండా, ఖాతాల నుంచి డబ్బును ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. ఎటు మళ్లిస్తున్నారో చూస్తే అసలు డౌట్లన్నీ బయటికొస్తున్నాయి. షెల్ కంపెనీలకు వెళ్తున్నట్లు, థర్డ్ పార్టీలకు చేరుతున్నట్లుగా ఐటీ శాఖ గుర్తించింది. నిజానికి గుర్తింపు లేని పార్టీల్లో 75 శాతం అసలు పోటీనే పెట్టడం లేదని సాక్షాత్తూ ఎన్నికల సంఘమే గుర్తించింది. ఇందులోనూ 90 శాతం పార్టీలు ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం కచ్చితంగా ఇవ్వాల్సిన రిపోర్ట్స్ ను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వట్లేదని ఐడెంటిఫై చేశారు.

ఈసీ తాజా ఆడిట్ ప్రకారం బీజేపీ దగ్గర రూ.7,113 కోట్లు

ఈసీ గుర్తింపు పొంది, దేశ రాజకీయాలను శాసిస్తున్న జాతీయ, ప్రాంతీయ పార్టీల కంటే గుర్తింపు లేని పొలిటికల్ పార్టీల ఖజానా గలగలలాడుతోంది. ఒక్కసారి ఆ లెక్కలు చూద్దాం. 2025 జనవరిలో ఎన్నికల సంఘం తన తాజా ఆడిట్ రిపోర్ట్ లో ఇచ్చిన లెక్కల ప్రకారం బిజెపి వద్ద 7,113 కోట్ల క్యాష్, అలాగే బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. అదే కాంగ్రెస్ వద్ద 857.15 కోట్ల రూపాయలున్నట్లు తేలింది. సో ఈ లెక్కలతో పోల్చితే గుర్తింపులేని పార్టీల మ్యాటర్ జోరుగా ఉంది. మరో విషయం.. సీబీడీటీ కూడా ఈ లెక్కల్ని కాలిక్యులేట్ చేయగా.. ట్యాక్స్ పేయర్స్ ఇస్తున్న విరాళాలకు.. ఫండింగ్ తీసుకుంటున్న గుర్తింపులేని రాజకీయ పార్టీలు చూపిస్తున్న లెక్కలకు అస్సలు మ్యాచింగ్ కుదరట్లేదు. సో ఎలక్టోరల్ ఫండింగ్ ను దుర్వినియోగం చేస్తున్నారని CBDT హైలెట్ చేసింది.

గుర్తింపులేని పార్టీలకు భారీ విరాళాలు ఇచ్చిన వారి గుర్తింపు

గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన వారిని ఐటీ శాఖ లిస్టవుట్ చేసింది. అసలు పోటీకే పెట్టని ఈ పార్టీలకు విరాళం ఎందుకిస్తున్నారు. ఉద్దేశమేంటి.. ఈ రాజకీయ పార్టీ నుంచి మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? ఆ వ్యక్తి పేరు చెప్పండి. మీరు విరాళం ఇచ్చిన పార్టీ మీ నియోజకవర్గంలో పోటీ చేసిందా? విరాళం ఇచ్చే ముందు మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా? మీరు ఎన్నికల ట్రస్ట్‌ను ఎలా సంప్రదించారు? ఇలాంటి క్వశ్చన్స్ ను ఐటీ శాఖ అడుగుతోంది. అంతకు ముందు జరిగిన వాటిని డీకోడ్ చేసింది. 2022-23లో దాతలు ఐటీ చట్టంలోని 80GGB అలాగే 80GGC కింద కలిపి 10,975 కోట్ల రూపాయలకు పైగా పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసినట్లు ఐటీ డేటా చెబుతోంది.

రూ. 6,116 కోట్ల లెక్క బయటికెందుకు రాలేదు?

అదే టైంలో రాజకీయ పార్టీలు ప్రకటించిన విరాళాల లెక్కలు చూస్తే కేవలం 4,858 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. అదే సమయంలో 6,116 కోట్ల విరాళాలు అందుకున్నట్లు గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఎందుకు బయటపెట్టలేకపోయాయన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. వీటిని ఎన్నికలు ప్రచారం వంటి వాటికి ఖర్చు చేయకుండా వేరే అవసరాలకు మళ్లించినట్లు స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఐటీ శాఖ డౌట్లు పెరగడం, స్క్రూటెనీ పెంచడంతో 2023-24లో అదనపు విరాళాల సంఖ్య సగానికి తగ్గి 3,053 కోట్లుగా లెక్క తేలింది. సో పన్ను మినహాయింపు కోరుకునే నెంబర్ ఒకలా ఉంటే.. పార్టీలు చూపిస్తున్న స్లిప్స్ మాత్రం ఇంకోలా ఉంటున్నాయి. లెక్క కుదరడం లేదు.

ఈ మ్యాప్ చూడండి

ఈ మ్యాప్ చూడండి.. దాత బ్యాంకు చెక్ లేదంటే డిపాజిట్ ద్వారా గుర్తింపులేని ఏదైనా పొలిటికల్ పార్టీకి డబ్బు పంపుతాడు. సో పొలిటికల్ పార్టీ బ్యాంకు ఖాతాలోకి డబ్బు చేరుతుంది. అక్కడి నుంచి థర్డ్ పార్టీ పర్సన్ వన్ కు ఈ అమౌంట్ పంపుతారు. అతడి బ్యాంక్ నుంచి థర్డ్ పార్టీ పర్సన్ టూకు అమౌంట్ వెళ్తుంది. ఫైనల్ గా మళ్లీ దాతకే కమీషన్ ను మినహాయించుకుని వెళ్తుంది. అక్కడ డోనార్ కు ట్యాక్స్ మినహాయింపు క్లెయిమ్ చేసుకుంటూనే తాను విరాళంగా ఇచ్చిన డబ్బులో పెద్ద మొత్తం క్యాష్ రూపంలో తిరిగి వస్తుందన్న మాట. సో కొన్ని గుర్తింపు లేని పొలిటికల్ పార్టీలు ఇలా ఎలక్టోరల్ ఫండింగ్ ను ఎన్నికల కోసం, పార్టీని నడపడం కోసం ఖర్చు చేయకుండా కమీషన్లు తీసుకుంటూ ఇలా దుర్వినియోగం చేస్తున్నాయన్న విషయంపై ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

బయటికొస్తున్న హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల స్టోరీ

ఇలా గుర్తింపులేని రాజకీయ పార్టీలకు హైదరాబాద్ కు చెందిన పలువురు సాఫ్ట్ వేర్ నిపుణులు పెద్ద మొత్తంలో ఫండింగ్ చేస్తున్నట్లు లేటెస్ట్ గా ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దృష్టికి వచ్చింది. ఇలాంటి పార్టీలపై ఐటీ నిపుణులకు ప్రేమ ఎందుకు పెరిగిందో చూస్తే అసలు లెక్కలన్నీ బయటపడ్డాయి. విరాళాలు ఇచ్చినట్లు నటిస్తూ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80GCCని వాడుకుని క్లెయిమ్ చేసుకున్నట్లు గుర్తించారు. ఇలా హైదరాబాద్ సిటీలోని 36 కంపెనీలకు చెందిన వారిలో ఎక్కువ వేతనాలు ఉండే ఐటీ నిపుణులు ఇలా విరాళం ఇచ్చి ట్యాక్స్ మినహాయింపు కోసం 110 కోట్ల రూపాయల రీఫండ్ కు అప్లై చేసినట్లు ఐటీ శాఖ దర్యాప్తులో తేలింది.

ఐటీ శాఖ నజర్ తో వెలుగులోకి ఫేక్ ఫండింగ్ మ్యాటర్

ఏడాది 46 లక్షల రూపాయల వేతనం ఉన్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయీ.. ఒక గుర్తింపు లేని రాజకీయ పార్టీకి 45 లక్షల విరాళం ఇచ్చినట్లు క్లెయిమ్ చేయడంతో ఐటీ శాఖ లోతుగా దర్యాప్తు చేసి ఈ మ్యాటర్ ను బయటపెట్టింది. ఇలాంటి మోసపూరిత రిఫండ్ క్లెయిమ్స్ పై ఐటీ శాఖ నజర్ పెట్టడంతో చాలా వరకు తగ్గాయి. అయినా సరే కొందరు ఎవరికీ దొరుకుతాం అన్న ఉద్దేశంతో రెచ్చిపోతూనే ఉన్నారు. కమీషన్లు తీసుకుని విరాళాలు స్వీకరిస్తున్న గుర్తింపులేని రాజకీయ పార్టీలు ఎక్కువగా గుజరాత్, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు.

తప్పుడు క్లెయిమ్స్ చేస్తే 200 శాతం ఫైన్ విధింపు

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇలా తప్పుడు క్లెయిమ్ లు చేసిన వారు ఎవరైనా ఉంటే.. 200 శాతం ఫైన్ నుంచి తప్పించుకునేందుకు మార్చి 31, 2025 లోపు అప్డేట్ చేసిన ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఐటీ శాఖ ఫైన్ సహా శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐటీ సెక్షన్ 80 జీజీసీని దుర్వినియోగం చేయొద్దని ఐటీ శాఖ అలర్ట్ చేస్తోంది. ఇలా నకిలీ విరాళాలు ఇస్తూ పన్ను రిటర్న్ లలో మోసపూరిత క్లెయిమ్స్ చేయొద్దని సూచిస్తున్నారు. ఈ చర్యలు ఫలించి డిసెంబర్ 2024 వరకు, దాదాపు 90 వేల మంది పన్ను చెల్లింపుదారులు తప్పుడు తగ్గింపు క్లెయిమ్‌లను ఉపసంహరించుకున్నారు.

Also Read: డీలిమిటేషన్‌పై సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

కమీషన్ తీసుకుని మిగితాది క్యాష్ రూపంలో రిటర్న్

అదనపు పన్నులు కూడా చెల్లించారు. చాలా మంది దాతలు పార్టీ నుండి నగదు రూపంలో డబ్బును తిరిగి పొందడానికి మాత్రమే చెక్కులు ఇచ్చారనే డౌట్లు 2021 నుంచే పెరుగుతూ వచ్చాయి. అవి ఇప్పుడు పరాకాష్టకు చేరాయంతే. ఈ మొత్తం సిస్టమ్ మనీలాండరింగ్ కు దారి తీస్తూ.. 1 నుంచి 3 కమీషన్ తీసుకుని మిగితాది తిరిగి ఇచ్చేలా వ్యవస్థ మారిపోయిందంటున్నారు. దాతలు విరాళంగా ఇచ్చిన మొత్తాలపై పూర్తి మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. దాంతో వారు కట్టాల్సిన పన్ను భారం తగ్గుతుంది.

80GGC కింద క్లెయిమ్ చేసుకుంటే స్క్రూటెనీ

చట్టం ప్రకారం, పన్ను నుంచి తప్పించుకోవడానికి రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వగల మొత్తానికి ఎలాంటి పరిమితి లేదు. ఇది కూడా చాలా మందికి కలిసి వస్తోంది. అయితే మీ నియోజకవర్గాల్లో పోటీ పెట్టని గుర్తింపు లేని రాజకీయ పార్టీకి 5 లక్షలు ఆపై విరాళం ఇచ్చి.. సెక్షన్ 80GGC కింద ట్యాక్స్ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకుంటే… ఈజీగా ఐటీ శాఖకు దొరికిపోవడం ఖాయమే. సో బీ అలర్ట్. కొన్ని గుర్తింపు లేని రాజకీయ పార్టీల వల్ల మిగితా వాటికి కూడా చెడ్డపేరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×