E-Paper
Advertisement

బావిలో పడ్డ ఏనుగు పిల్ల.. కాపాడాలంటూ గుంపుగా ఏనుగుల భీకర గర్జనలు!

బావిలో పడ్డ ఏనుగు పిల్ల.. కాపాడాలంటూ గుంపుగా ఏనుగుల భీకర గర్జనలు!
Advertisement

Elephant Rescue: కేరళలోని తన్నితోడులో ఓ ఏనుగు పిల్ల బావిలో పడిపోయింది. రాత్రి రబ్బరు తోటలోకి ఏనుగుల గుంపు ప్రవేశించగా చీకట్లో దారి తెలియక, రెండేళ్ల వయసున్న ఏనుగు పిల్ల బావిలో చిక్కుకుంది. అయితే తెల్లవారుజామున ఏనుగుల గుంపు అరవడాన్ని స్థానికులు గమనించారు. అనుమానం వచ్చి రబ్బరు తోట వైపు వెళ్లి చూడగా, బావిలోని ఏనుగు పిల్ల పైకి రాలేక తల్లడిల్లుతూ కనిపించింది.

జేసీబీతో..

తోట యజమాని గోపి, స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది జేసీబీతో సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే ఏనుగుల గుంపు సమీపంలోనే ఉండటంతో రెస్క్యూ టీమ్ మొదట కాస్త ఆందోళన చెందింది. ఆ తర్వాత ఏనుగులు కొద్దిగా వెనక్కి తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఏనుగు పిల్లకు ఎటువంటి గాయాలు కాకుండా, బావికి ఒక వైపు భాగాన్ని జేసీబీతో తవ్వారు. అంతేకాదు సులభంగా పైకి నడిచి రావడానికి వీలుగా మట్టి దారిని ఏర్పాటు చేశారు.

Advertisement

Also read: Sai Baba: సనాతన ధర్మంలో కొత్త వివాదం.. కుండబద్దలు కొట్టిన మంత్రి ఆనం..!

పంట పొలాల్లో నష్టం..

వాయిస్ 03 : అటవీ అధికారులు అనుకున్నట్టుగానే ఆ ఏనుగు పిల్ల మట్టి దారి గుండా నెమ్మదిగా పైకి వచ్చింది. బయటపడిన ఏనుగు పిల్లను ఫారెస్ట్ అధికారులు టపాసులు కాలుస్తూ అడవి వైపునకు మళ్లించారు. ప్రస్తుతం దాన్ని తిరిగి ఏనుగుల గుంపుతో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ సక్సెస్ అయినప్పటికీ, స్థానికులు అటవీ శాఖ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఏనుగుల గుంపులు పంట పొలాల్లోకి వస్తూ నష్టం కలిగిస్తున్నాయంటున్నారు.

Advertisement

Storey By: Appa Rao Big Tv

Also read; MP Defections: ప్రాంతీయ పార్టీలను కుదేలు చేస్తున్న ఎన్డీయే నయా స్ట్రాటజీ.. నెక్ట్స్ టార్గెట్ అదేనా..?

Related News

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

Big Stories

Advertisement
×