E-Paper
Advertisement

ఓటుకు పదివేలిచ్చినా తీసుకోండి..! ఈసారి పొరపాటు చేయకుండా మనకే ఓటేయండి! కేసీఆర్‌ను ఓడగొట్టి తప్పు చేశారు..!

ఓటుకు పదివేలిచ్చినా తీసుకోండి..! ఈసారి పొరపాటు చేయకుండా మనకే ఓటేయండి! కేసీఆర్‌ను ఓడగొట్టి తప్పు చేశారు..!
Advertisement

కేటీఆర్‌ తెలంగాణ ప్రజలకు ఉచితోపదేశం చేశాడు. కేసీఆర్‌ను ఓడగొట్టి జనం తప్పు పనిచేశారని, ఆ తప్పుకు శిక్ష ఐదేండ్లు ఉంటుందని, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నాడు. మరోసారి ఇలాంటి పొరపాటు చేయొద్దని హితవు పలికాడాయన. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు ఓటుకు పదివేల రూపాయలు ఇస్తారట. వాటిని తీసుకోండి.. కానీ ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కే వేయండి..! అని ఇప్పట్నుంచే ఎన్నికల క్యాంపెయిన్‌ మొదలుపెట్టాడు రామన్న.

ఓటుకు పదివేలు ఇచ్చేంతగా సంపాదించారని కేటీఆర్‌ పరోక్షంగా తెలంగాణ జనానికి చెప్పే ప్రయత్నం చేశాడు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన భూపాలపల్లి పార్టీ మీటింగులో ఆయన మాట్లాడాడు. ‘పక్క పార్టీ నేతపై సానుభూతి చూపారు. ఓట్లేసి గెలిపించారు. ఏమైంది.. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు?’ అని ‘బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించినందుకు ఇదే మీకు శిక్ష..!’ అన్నట్టుగానే ఆయన మాటలు సాగాయి. బీఆర్ఎస్ కు కాకుండా ఎవరికి ఓటేసినా అది తప్పుడు ఓటేనన్నట్టుగా  కేసీఆర్ ప్రసంగం కొనసాగింది.

Advertisement

కేసీఆర్‌ ముందే చెప్పాడని, మనల్ని వెతుక్కుంటూ టార్చ్‌ లైట్ వేసుకుని మరీ జనమే వస్తారని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు కేటీఆర్‌. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎలాంటి లోపాలు, పాపాలు లేవనే విధంగా, కానీ జనమే ఆదమరిచి, ఆశపడి కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశారనే అర్థం వచ్చేలా కేటీఆర్‌ ఉపన్యాసం కొనసాగింది. ఆ పార్టీ నేతలే ఈ సర్కార్‌ అవినీతిని బయట పెట్టుకుంటున్నారని, ఆ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా పంచి మళ్లీ గెలుద్దామనుకుంటున్నారని చెప్పుకొచ్చాడు కేటీఆర్‌.

బీఆర్ఎస్ ను  ఓడగొట్టినందుకు జనం ఏడుస్తున్నారని అని అన్నాడు కేటీఆర్. వారికి తప్పు తెలిసొచ్చిందని, అందుకే ఈసారి కాంగ్రెస్‌కు ఓటేసే తప్పుడు, పొరపాటు పనులు చేయొద్దని సూచించారు ఓటర్లకు. పదివేలిచ్చినా తీసుకోవాలన్న ఆయన.. మరి బీఆర్‌ఎస్‌ ఏమాత్రం ఇస్తుందో చెప్పలేదు. అసలేమీ ఇవ్వకుండానే బీఆరెస్‌కు ఓటేయమని చెప్పినట్టా? లేక తక్కువిచ్చినా … ఎక్కువిచ్చిన వారికి మాత్రం ఓటేయొద్దని చెప్పినట్టా? అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేలా మాట్లాడాడు.

Advertisement

తెలంగాణలో ఓటు కు పదివేలు పలుకబోతుందని ముందే ప్రకటిస్తున్నారా? అనే వివాదస్పద చర్చకు తెరలేపాడు కేటీఆర్‌. రైతుల విషయంలో కూడా నోరు జారాడు. యూరియా కోసం చెప్పులు లైన్‌లో పెట్టి కాళ్లు కాల్చుకుంటున్నారని, కింద కూర్చుంటే ముడ్డి కూడా కాలుతుందని ఎద్దేవా చేసినట్టుగానే ఆయన ప్రసంగం కొనసాగింది.

మేడిగడ్డ వద్ద కాంగ్రెస్‌ వాళ్లే బాంబులు పెట్టి పేల్చేశారని మళ్లీ ఆరోపించాడు కేటీఆర్‌. తమను ఎన్నికల్లో ఓడగొట్టేందుకు నీటిలో బాంబులు పెట్టి పేల్చారని, ఆ ఎన్నికల సమయంలో పెద్దగా పట్టించుకోలేదని, ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఏం చేయలేకపోయామని, కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసి గెలిచారని ఆరోపించాడు కేటీఆర్. బాంబులు పెట్టి పేల్చేశారని అంత పెద్ద ఆరోపణ చేసిన కేటీఆర్‌.. పెద్దగా డ్యామేజీ ఏమీ కాలేదని, ఓ రెండు పిల్లర్లే కుంగాయంతే.. అని మళ్లీ దాన్ని సర్దిచెప్పే ప్రయత్నంలో పొంతన లేని కామెంట్స్‌ చేశాడు.

ఎన్డీఎస్‌ఏ తీరుపైనా అపవాదును వేశాడు కేటీఆర్‌. వారు పరిశీలించకుండానే కాళేశ్వరం పనికిరాదు అన్నట్టుగా రిపోర్టు ఇచ్చి వెళ్లారని చెప్పిన కేటీఆర్.. కేంద్రం నుంచి బీజేపీ తరుపున వచ్చారని అన్నాడు. ఇక్కడున్నది కాంగ్రెస్‌ సర్కార్‌.. మరి బీజేపీ ఎందుకు కాళేశ్వరం విషయంలో తప్పుడు నివేదికలు ఇస్తుంది? దీనిపైనా క్లారిటీ మిస్ అయ్యాడు కేటీఆర్‌.

కొత్త పింఛన్లు అని ఇప్పుడిస్తున్న నాలుగున్నర లక్షల పింఛన్లు.. తాము ఇచ్చినవి తీసేసి.. వాటినే కొత్తగా ఇస్తున్నారని ఆరోపించాడు. కేసీఆర్‌ సీఎంగా ఉండి ఉంటే ఇప్పటి వరకు నాలుగు వేల పింఛన్‌ ఇవ్వకపోతుండెనా? అని అడిగారు. పాలిచ్చే బర్రెను వదిలేసి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని ఓటరు తీర్పును తప్పుబట్టేలా, తమ ఓటమిని జీర్ణించుకోలేని విధంగానే షరా మామూలుగా మాట్లాడాడు కేటీఆర్‌. అంతకు ముందు మాట్లాడిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.. ప్రజలు కేసీఆర్‌ను ఓడగొట్టినందుకు చెంపలేసుకుంటున్నారని అన్నాడు. తప్పంతా జనానిదే. మేము పుణ్య పురుషులమే అన్నట్టుగానే సాగుతున్నాయి బీఆర్ఎస్ నేతల మాటలు.

Tags

Related News

అసంతృప్తుల వేళ అసమ్మతి గోల! కోమటిరెడ్డి వ్యూహమేమిటీ..? పాత, కొత్త కలయికల గ్యాప్‌ను వాడుకుంటున్నారా? పార్టీలో అతనికి మద్దతెలా ఉంది?

సన్నరకాలన్నీ ప్రైవేటు దళారులే ఎగబడి కొంటున్న వైనం..! సిండికేట్‌గా మారి క్వింటాలుకు 3వేలుగా నిర్ణయం..! డెబ్బై శాతం ప్రైవేటుకే అమ్ముకుంటున్న రైతులు..

రాష్ట్రంలో సబ్సిడీ విత్తనాలు ఎక్కడ.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు!

కాంట్రవర్సీలకు కేరాఫ్​‌గా కార్మిక శాఖ.. పీక్స్‌కు చేరిన అంతర్గత పోరు!

‘ఇందిరమ్మ బీమా’పై సర్వత్రా ఆసక్తి! రేషన్‌ కార్డు దారులందరికీ వర్తించేలా పథకం..! రూ. 4వేల కోట్లు కేటాయించిన సర్కార్‌..!

మైక్రోసాఫ్ట్ నుంచి బ్యాంకుల వరకు.. అమెరికాలో అసలేం జరుగుతోంది?

స్టేట్‌లో సిద్దాంతపర విమర్శల దాడి! సెంట్రల్‌లో కేంద్ర సాయం కోరి..! భారత్‌ సమ్మిట్‌తో విమర్శలు గుప్పించినా.. ప్రధానితో సమస్యలు విన్నవించినా..!

Big Stories

Advertisement
×