Big Stories

Chilkur Balaji Temple: గరుడ ప్రసాదం తింటే సంతానం.. నిజమా..? అబద్ధమా..?

Garuda Prasadam in Chilkur Balaji Temple: జంక్షన్లు జామయ్యాయి.. రోడ్లు కిక్కిరిసిపోయాయి.. ఏకంగా 10 కిలోమీటర్ల వరకు ముందుకు కదలడానికి లేదు.. వెనక్కి వెళ్లడానికి చాన్స్‌ లేదు. కారణం చిలుకూరి బాలాజీ దేవాలయం. అక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవం.. ఇంకా సూటిగా చెప్పాలంటే గరుడ ప్రసాద వితరణ. అది దక్కిన వారికి సంతాన భాగ్యం కలుగుతుందన్న నమ్మకం. ఇంతకీ ఎన్నడూ లేని ఇబ్బంది ఈనాడే ఎందుకొచ్చింది? దానికి రీజన్సేంటి?

- Advertisement -

చిలుకూరి బాలాజీ దేవాలయం.. ఇప్పుడు ఓ సెన్సేషన్.. ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు తీరుతాయని చాలా మందికి నమ్మకం. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి వీసా చిక్కులు కూడా తీరుస్తారని చాలా మంది చాలా బలంగా నమ్ముతారు. కానీ.. ఈసారి ఇక్కడి ప్రసాదం తిన్నవారికి సంతాన భాగ్యం దక్కుతుందన్న ప్రచారం జరిగింది. ఎంతలా అంటే ఐదు వేల మంది వస్తారనుకున్న భక్తుల సంఖ్య.. ఏకంగా 60 వేలకు చేరేంతలా.. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యేంతలా.. చిలుకూరుకు వెళ్లే రూట్‌ అంటే.. లంగర్‌హౌస్‌ నుంచి మొదలు పెడితే సన్ సిటీ, కాళీమందిర్, ORR, పోలీస్ అకాడమీ జంక్షన్, అజీజ్‌ నగర్, చిలుకూరు చౌరస్తా వరకు.. ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు.. మొత్తానికి ఎటూ కదలడానికి లేనంతగా.. పోలీసులు కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేసేంతగా ట్రాఫిక్.

- Advertisement -

Also Read: ప్రసాదం ప్రభావం.. చిలుకూరులో భారీగా ట్రాఫిక్ జామ్!

మరి ఈ ప్రచారం నిజమేనా? నిజమా? అబద్ధమా? అనే విషయాన్ని మనం నిరూపించలేం కానీ.. భక్తులకు ఓ నమ్మకం ఉంది. అదేంటంటే. బాలాజీ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత దశమి రోజు నుంచి ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు పుట్టమన్నుతో పూజలు నిర్వహిస్తారు. రెండోరోజు గరుత్మంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ ప్రసాదాన్నే గరుడ ప్రసాదం అంటారు. ఈ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు పంపిస్తారు. ఈ ప్రసాదం తిన్న వారికి సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.. ఇది ప్రతి ఏటా జరిగిదే.. ప్రతి ఏటా చాలా మంది మహిళలు రావడం.. వారికి ప్రసాదం అందించడం జరుగుతున్నదే.

మరి ప్రతి ఏటా ఇలా ఎందుకు ఇబ్బందులు ఎదురుకాలేదు? ఇప్పుడు ఎందుకు అయ్యాయి? ఇది మెయిన్ క్వశ్చన్. ప్రతిసారి లాగానే ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ బ్రహ్మోత్సవాల గురించి అనౌన్స్ చేశారు. సంతానం లేని వారు, పెళ్లి కాని వారు, విదేశాలకు వెళ్లాలనుకునేవారు.. ఇలా అనేక సమస్యలు ఉన్నవారు స్వామివారిని దర్శించుకోవాలని.. ప్రసాదం స్వీకరించాలని సూచించారు. ఇది కూడా ప్రతిసారి జరిగిదే.. కానీ సోషల్ మీడియాలో ఈసారి రంగరాజన్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పెళ్లై ఎన్నో ఏళ్లైనా సంతానం లేని జంటల మనసులకు ఈ వ్యాఖ్యలు టచ్ అయ్యాయి. ఎన్నో ట్రై చేశాం.. స్వామివారిపై నమ్మకం ఉంచుదామనుకొని వేలాది మంది ఆలయానికి బయల్దేరారు. రెస్పాన్స్‌ ఎలా ఉందంటే.. ఐదు వేల మంది వస్తారనుకుంటే.. ఏకంగా 3 లక్షల మంది వరకు వచ్చారు. కొందరైతే కార్లను వదిలేసి నడుచుకుంటూ ఆలయానికి చేరుకొని మరీ ప్రసాదాన్ని తీసుకున్నారు.

Also Read: Telangana Inter Results 2024 : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. 24న ఇంటర్, మే1న టెన్త్ రిజల్ట్స్

కాసేపు నమ్మకాలు, వాటి వల్ల కలిగిన ఇబ్బందులను పక్కన పెడితే ఇక్కడో విషయం క్లారిటీగా అర్థమవుతుంది. అదేంటంటే ప్రస్తుతం చాలా మంది పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్నారని, లేదంటే నిజమో, కాదో తెలీని ఓ ప్రచారానికి ఇంత మేర రెస్పాన్స్‌ రావడం ఏంటి? నిజానికి నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్.. ఇప్పుడు టోటల్ ఇండియాను ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. ఇండియాలో10 నుంచి 14 మంది జంటలను ఇన్‌ఫెర్టిలిటీ ఎఫెక్ట్ చేస్తుంది. అయితే దీనిపై చాలా మంది ఇప్పటికి కూడా డాక్టర్స్‌ను కన్సల్ట్‌ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. లేట్ మ్యారేజెస్‌, హార్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్ .. ఒవ్యూలేషన్ ఇష్యూస్.. ఇలా అనేక సమస్యలు ఉంటాయి. వీటన్నింటికంటే మెయిన్ రీజన్.. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న లైఫ్‌ స్టైల్. స్మోకింగ్, డ్రింకింగ్ మితిమీరి చేయడం .. ఓబెసిటీ, ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం.. మిడ్‌నైట్ లైఫ్ పేరుతో నిద్రకు దూరం కావడం. వర్క్‌ను పర్సనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం.. ఎక్సర్‌సైజ్‌లకు దూరంగా ఉండటం.. ఇలా చేయాల్సినవన్ని చేసి.. తీరా సమయం వచ్చాక బాధపడితే ఏం లాభం ఉండదంటున్నారు నిపుణులు.

ఒకప్పుడు ప్రతీ ఇంట్లోనూ గంపెడు మంది పిల్లలుండేవాళ్లని చెప్పుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు ఒక్క బేబీ కూడా లేదని భయపడే పరిస్థితి వచ్చేసింది. ఫ్యూచర్‌లో ఈ సమస్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఆ సమస్యకు మూలం ఏంటన్నది తెలుసుకుని దాన్ని సరి చేసుకోవాలని గానీ..
ఇలా ప్రసాదం కోసం పరుగులు పెడితే పిల్లలు పుడతారంటారా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News