BigTV English

Telangana Inter Results 2024: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. 24న ఇంటర్, మే1న టెన్త్ రిజల్ట్స్!

Telangana Inter Results 2024: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. 24న ఇంటర్, మే1న టెన్త్ రిజల్ట్స్!

Update on TS Inter Results 2024(TS today news): ఏపీ, తెలంగాణల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఒకట్రెండు రోజుల తేడాతో జరిగాయి. ఏపీలో ఫలితాలు వెలువడి పదిరోజులు కావస్తున్నా.. తెలంగాణలో మాత్రం ఇంటర్ ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. ఫలితాలను విడుదల చేసేందుకు ఎన్నికల కోడ్ అడ్డం వస్తుందని భావించిన విద్యాశాఖ అధికారులు.. ఈసీ అనుమతితోనే 24న ఫలితాలను ప్రకటించనున్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా.. టెక్నికల్ గా ఇంకేవైనా లొసుగులున్నాయా అని పరిశీలిస్తున్నారు.


ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలతో పాటు.. ఇంటర్ ఒకేషనల్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 9 లక్షల 22 వేల 520 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవ్వగా.. 4 లక్షల 78 వేల 527 మంది విద్యార్థులు ఫస్టియర్ పరీక్షలు రాశారు. మరో 4 లక్షల మందికిపైగా విద్యార్థులు సెకండియర్ పరీక్షలు రాశారు.

Also Read: ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరాకు 8 రోజులు సెలవులు


ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు.. https://tsbie.cgg.gov.in/ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 24వ తేదీన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఒకేరోజున విడుదల చేయనున్నారు.

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు 5 లక్షల 8 వేల 385 మంది విద్యార్థులు హాజరయ్యారు. పదోతరగతి పరీక్షల మూల్యాంకనం ఏప్రిల్ 20నే పూర్తయింది. ఏప్రిల్ 30న లేదా మే 1న పదవ తరరగతి ఫలితాలను వెల్లడించే యోచనలో ఉంది విద్యాశాఖ.

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×