BigTV English

YS Sharmila Nomination: నామినేషన్ దాఖలు, మాటలకు సంకెళ్లా..?

YS Sharmila Nomination: నామినేషన్ దాఖలు, మాటలకు సంకెళ్లా..?

YS Sharmila Nomination: అధికార వైసీపీ భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని ఆరోపించారు వైఎస్ షర్మిల. న్యాయం కోసం గొంతు ఎత్తితే అడ్డుకున్నారని విమర్శించారు. కడప కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో కలెక్టరేట్‌లోని ఆర్వోకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. షర్మిల నామినేషన్ కార్యక్రమంలో వివేకానంద కూతురు సునీత, తులసీరెడ్డి ఉన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు.


జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. ప్రజా నాయకులకు వ్యక్తిగత జీవితం ఉండకూడదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ఉందా అన్నారు. తండ్రిని పోగొట్టుకున్న సునీత న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు.

జగన్‌కు చిన్నరాయి తగిలితే.. హత్యాయత్నమని బ్యానర్ వార్త వేశారని, మరి వివేకానందను ఏడుసార్లు గొడ్డలితో నరికి చంపితే సాక్షి పత్రికకు హార్ట్‌ఎటాక్ అని ఎలా అనిపించిందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కడప, పులివెందుల ప్రజలు మంచి తీర్పు ఇస్తారని నమ్మకం ఉందన్నారు. న్యాయం కోసం వైఎస్ఆర్ బిడ్డ ఒకవైపు.. నిందుతులు మరోవైపు ఉన్నారని గుర్తుచేశారు.


Also Read: కుప్పంలో చంద్రబాబు బర్త్ డే వేడుకలు.. తిరుమలలో 750 టెంకాయలు కొట్టిన శ్రీధర్

నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల, వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని, అందుకే తమను అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంతకుముందు నామినేషన్ పత్రాలను వైఎస్ఆర్ ఘాటుకు వెళ్లి సమాధి వద్ద పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు షర్మిల. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, మాజీ మంత్రి వివేకాను కడప ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ఈ విషయంలో తనకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు.

https://twitter.com/realyssharmila/status/1781573629517709440

 

Tags

Related News

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

Big Stories

×