E-Paper
Advertisement

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!
Advertisement

ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా..! బుల్లెట్ దిగిందా.. లేదా? అనే సినీ డైలాగు కేసీఆర్‌కు కరెక్టుగా నప్పుతుంది. ఆయనంతే. ఇప్పుడు ఓడాడు కాబట్టి.. ఫామ్‌మౌజ్‌కే పరిమితమయ్యాడు.. అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఉద్యమ సమయం నుంచీ అంతే. అలా వచ్చి ఇలా అలజడి సృష్టించి.. మళ్లీ మాయమవుతుండె. ఎవరెంత మొత్తుకున్నా బయటకు వచ్చే వాడు కాదు.

తనకు రావాలనిపించినప్పుడే వస్తాడు. ఎవరో పిలిస్తేనో.. ఎవరో తిడితేనో.. మరెవరో రెచ్చగొడితేనే.. రెచ్చిపోయి.. ఆ కఫ్యూజన్‌లో తనను తాను కొట్టేసుకునే రకం కాదు. సమయం చూసి పంజా విసరుతాడన్న మాట. నిన్నమొన్నటి దాకా.. అధికార కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి..అంతా కలిసి బయటకు రా.. రా..! అని ఎంత గగ్గోలు పెట్టినా చడీలేదు చప్పుడు లేదు.

Advertisement

చివరకు ఫామ్‌హౌజుల చుట్టూ బస్సు యాత్రలు చేసినా కస్సుమనలేదు. బుస్సుమనలేదు. పల్లెత్తు మాట లేదు. గాంధీ జయంతి రోజున మాత్రం జాతిపిత టైపులో రేవంత్‌కు హితోపదేశం చేసేలా.. కక్షలొద్దు.. విధ్వేషాలు రగిలించేలా మాటలొద్దు.. అంటూ నీతి సూత్రాలతో కూడిన ఓ ప్రకటన విడుదల చేశాడు.

ఇగో ఇప్పుడు మళ్లీ వచ్చాడు. బతుకమ్మ పాటల రూపంలో. బతుకమ్మ పండుగనే వేదిక చేసుకుని బీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా రాసి ఆయన మెప్పు పొంది తరించిన అనంతరం బయటకు విడుదలైన ఆ రెండు పాటలు.. ఆసాంతం.. కేసీఆర్‌ను ఆకాశానికెత్తి వదిలేస్తాయన్నమాట. దీనికి బతుకమ్మ కోరస్‌ను జతకలిసి.. అంతా ఆయన భజనే ఉండేలా పాటలు రాయించుకున్నట్టున్నాడు.

Advertisement

‘అప్పుడెలా ఉండే గౌరమ్మా.. ఇప్పుడెలా ఉందే గౌరమ్మా..! కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా మనమంతా పచ్చగ ఉంటిమి గౌరమ్మా..!’ అంటూ కూనిరాగాలు, శాపనార్ధాలతో కలగలిపిన కీర్తి బావుటాలు ఎగరేసే పాటలన్న మాట అవి. వాటిని విని తరించి.. కాలర్‌ ఎగరేసుకుంటున్నారు గులాబీ శ్రేణులు. కేసీఆర్‌ అభిమానులు.

తనను మరిచిపోతున్నారని అనుకున్నాడో.. లేదా తను చేసిన మంచి పనులను గుర్తు చేయడం ద్వారానైనా.. జనం గుర్తు పెట్టుకుని మరీ చర్చించుకుంటారనే భావనో తెలియదు కానీ, కేసీఆర్‌పై పాడిన ఆ రెండు పాటలు బీఆర్‌ఎస్‌ భజన గీతాలుగానే ఉన్నాయి. అంటే ‘ఇక ఎన్నికల వరకు నేను రాను.. అందుకే ఈ బతుకమ్మ పండుగ వేదికగా రిలీజైన ఈ పాటలు వింటూ.. తనను మరిచిపోకుండా గుర్తు చేసుకుంటూ.. మళ్లీ నేనే రావాలని ఆకాంక్షిస్తూ.. ఆ క్షణం కోసం క్షణ క్షణం ఎదురు చూస్తూ..అలా మిగిలిన కాలం గడిపేయండి’ అని ఓ మెసేజ్‌ కూడా ఈ పాటల ద్వారా ఇచ్చినట్టున్నాడు కేసీఆర్‌.

కవిత ఆ పార్టీలో ఉన్నప్పుడు జాగృతి ద్వారా బతుకమ్మ పాటలు విడుదల చేసేవారు. అందులో కవిత ఏదో ఒక చోట అలా కనిపించేది. మొత్తం పాటలో ఉంటే అది భజన పాటగానే ఉంటుందనే భావన కావొచ్చు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. మొత్తం కేసీఆర్‌పైనే పాట కైగట్టి.. బతుకమ్మ ఆత్మనే లేకుండా చేసి.. ఓడిపోయామనే బాధనే వ్యక్తం చేసి.. ప్రజలు తమను ఓడించి బాధపడి, పశ్చాత్తాపడుతున్నారనే భావనను జోడించి.. కాంగ్రెస్‌ను అనవసరంగా గెలిపించామనే అర్థం ఇరికించి.. మొత్తానికి ఈ సమయం కోసమే చూస్తన్నామనే కసిని కసితీరా  తీర్చుకున్నారనేలానే ఉన్నాయి ఈ రెండు పాటలు..!

Tags

Related News

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేది ఆ నలుగురే.. ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ కొత్త నినాదం!

విశాఖ నావికాదళంపై పాక్ కన్ను.. 13 మంది నేవీ సిబ్బందిపై అనుమానాలు!

జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్ నిరసన.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు!

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

Big Stories

Advertisement
×