E-Paper
Advertisement

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!
Advertisement

ఒక్కరోజు బాగోతానికి మూతి మీసాలు కొరుక్కున్నాడట.. అనేది ప్రఖ్యాత తెలుగు సామెత. కానీ కేటీఆర్‌ మాత్రం ఒక్కరోజు బాగోతానికి మూతి మీసాలు, గడ్డం కూడా పెంచుకున్నాడు. ఎందుకు పెంచుకోవాలనుకున్నాడో తెలియదు కానీ, ఆ ప్రయోగం వికటించిందనే చెప్పాలి.

కేటీఆర్‌ను క్లీన్‌ షేవ్‌లో చూసిన జనానికి ఈ కొత్త అవతారం కొంత ఎబ్బెట్టుగా, గలీజుగానే కనిపించిందనుకోవాలి. ఎందుకంటే పైన బట్ట.. కింద మీసాలు గడ్డం పెంచుకుంటే ఆ కొత్త లుక్కు ఆకర్షణీయంగా ఏం కనిపించలేదు. ఓ వైపు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కేటీఆర్‌ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నాడని విస్తృత ప్రచారం చేసింది. వారు వెక్కిరించినట్టుగానే కేటీఆర్‌ కూడా ఆ ఆటలో పావుగా మారాడు.

Advertisement

కేసీఆర్‌కు గడ్డం, మీసం సెట్‌ కాదు. కేటీఆర్‌ కూడా మొదటి నుంచీ అంతే. జనాల మదిలో వీరిద్దరి ముఖాలు అలాగే ఫిక్స్ అయిపోయాయి. మధ్యలో కొత్త వేశం ఎందుకు? ప్రజా నాయకులు ఎవరూ తరుచూ తమ వేషధారణ మార్చరు. అలా మార్చడం వల్ల వారికే నష్టం. జనం నుంచి వారంతట వారే దూరమవుతున్నారని లెక్క.

అవును మరి.. ఆ వేషధారణకు అలా కనెక్టయిపోతారు మరి. సినీ దర్శకుడు కోడి రామకృష్ణ ఓసారి షూటింగ్‌లో తనకు తలనొప్పిగా ఉందని, నెత్తికి కర్చీఫ్‌ను కట్టుకుని షూటింగ్‌ చేశాడు. ఆ సినిమా షూటింగ్‌ మొత్తం అలాగే పూర్తయ్యింది. సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. అంతే .. ఆ కోడి.. ఇక తన ప్రతి సినిమాలోనూ ఇలాగే షూటింగులు చేస్తూ వచ్చాడు. చివరకు ఆయన ఎటు పోయినా.. ఇదే వేషదారణ..ఆ నెత్తికి కర్చీఫ్‌ కట్టు లేకపోతే.. అసలు జనం ఆయన్ను గుర్తించని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

అలా జనం తమ అభిమాన నాయకుడ్ని, ప్రముఖ నాయకుడ్ని గుర్తు పెట్టుకునేందుకు వారి వేషదారణను తమ మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయిపోతారనడానికి ఇదో ఉదాహరణ. నిజంగా చెప్పాలంటే నిన్న జరిగిన సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభ.. భారీగానే ఉంది. ఏర్పాట్లూ అలాగే ఉన్నాయి. తొలిసారి కేటీఆర్‌ ఇంతటి భారీ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడా అనిపించింది.

కేసీఆర్‌ కూడా ఇదే కోరుకుంటున్నాడు. ‘కొడుకు ఒంటి చేత్తో భారీ సభలను డీల్‌ చేయగలగాలి. జనాన్ని ఆకట్టుకోగలగాలి. అట్లయితేనే.. రేపు రేపు కేటీఆర్ ను  సీఎంగా అకస్మాత్తుగా ప్రకటించేసినా.. జనం నుంచి పెద్దగా వ్యతిరేకత రాదు..’  అనేది ఆయన దురాలోచన.. సారీ.. దూరాలోచన…!

ఏదో సినిమాలో కామెడీ డైలాగ్‌లా.. ‘అతను ఏ దొంగతనం చేసినా ఇట్టే దొరికిపోవడం అతగాడి స్పెషాలిటీ..! అన్నట్టుగా.. అంత పెద్ద సభకు ఇలా కామెడీగా గడ్డం, మీసాల కొత్త వేషంతో రావడమెందుకు? పైగా జనం ఏమనుకుంటారోననే భీతి వెంటాడగా.. తనకు తాను దాన్ని నివృత్తి చేసుకునేందుకు ఆ వేదికగనే.. ‘ఈ గడ్డం, మీసాలు ఎందుకు పెంచానని అనుకుంటున్నారా? సింగరేణికి వస్తున్నాగా.. ఇంత మాత్రం ఉండొద్దా?’ అని సర్ధిచెప్పుకుని, సమర్థించుకుని, తనకు తాను భుజాలు చరుచుకుని బేలగా మారాడే తప్ప.. సీరియస్‌ సభను లైట్‌ చేశాడే తప్ప.. పెద్దగా అది ఉపయోగపడలేదనే విషయాన్ని గ్రహించలేదు.

కేసీఆర్‌ ఏదో చేద్దామనుకుంటాడు. కానీ కేటీఆర్‌ అక్కడికి రాడు.. ఇలా తను గిరి గీసుకున్న గీతలోనే ఉండిపోతాడు. సీరియస్‌ ఇష్యూలను ఇలా సిల్లీ కామెంట్లతో లైట్ చేసేస్తాడు.. అనే కామెంట్లు కూడా ఆ పార్టీ నుంచి వస్తున్నాయి. ఆ వేదిక మీదున్న పెద్దలను, సీనియర్ల పేర్లను పలకడంలో కూడా తడబడ్డాడు. సారీ, క్షమించాలి..అంటూ పదే పదే వారిని మరిచినందుకు చింతించడం తత్తరపడినట్టే అనిపించింది.

ఎందుకంటే తను మొదటిసారిగా అంతపెద్ద సభను డీల్‌ చేయడం కూడా కొంత అయోమయానికి లోను చేసినట్టే అనిపించింది. సభ సక్సెసే కానీ పేషెంట్‌ డెడ్ అన్నట్టుగానే కేటీఆర్‌ తీరు.. వేషధారణ ఉందనే కామెంట్లు వచ్చాయి.

Tags

Related News

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

Big Stories

Advertisement
×