E-Paper
Advertisement

బంగారం-వెండి ధరలు పతనం, కొనుగోళ్లదారుల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంత?

బంగారం-వెండి ధరలు పతనం, కొనుగోళ్లదారుల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంత?
Advertisement

Gold Price Today: భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం బంగారం మార్కెట్‌పై పడింది. ఫలితంగా విలువైన లోహాల ధరలు పతనమవుతున్నాయి. స్పాట్ విభాగంలో ధర ఇంకా కిందకు దిగి వస్తోంది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గురువారం మార్కెట్లో ఒక్కసారి పరిశీలన చేద్దాం.

అంతర్జాతీయ పరిణామాలపై బంగారం మార్కెట్‌పై ప్రభావం

అమెరికా డాలర్ బలహీనపడటం, వారం రోజుల కనిష్ట స్థాయికి పడిపోయిన బంగారం ధర. ద్రవ్యోల్బణంపై వచ్చిన సానుకూల నివేదిక, ఈనెలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు కాస్త బంగారం, వెండి అమ్మకపు ధరలలో భారీ పెరుగుదలకు దారి తీసింది ఈ క్రమంలో గురువారం ఉదయం బంగారం మార్కెట్లో ఒక శాతానికి పైగా పెరిగింది. బుధవారం కనిష్ట స్థాయికి పడిపోయిన స్పాట్ గోల్డ్, గురువారం ఉదయం 1.3 శాతానికి పెరిగింది. ఔన్సుకు 4,158 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. డిసెంబర్ డెలివరీ కోసం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.8 శాతం పెరిగి ఔన్సుకు 4,180 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి.

గురువారం ఉదయం పెరిగిన బంగారం ధర

Advertisement

అంతర్జాతీయ మార్కెట్ల ధరల ప్రభావం దేశీయంగా బంగారం కొనుగోలుదారులపై పడింది. కొన్నాళ్లుగా గరిష్ఠాల వద్ద ఊగిసలాడిన పసిడి ధర, గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. పండగల సీజన్ కావడం, వివాహ వేడుకలకు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ధర తగ్గుదల కాస్త ఉపశమనాన్ని కలిగించింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు 820 తగ్గి 1,47,440 వద్ద ఉంది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 750 తగ్గి, రూ. 1,35,150గా స్థిరంగా ఉంది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 820 తగ్గి రూ.1,47,440 కు పడిపోయింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.750 తగ్గి రూ.1,35,150 వద్ద ఉంది. వెండి ధర కొంత తగ్గుదల నమోదు చేసింది. నిన్నటితో ధరతో పోల్చి చూస్తే కిలో వెండి ధర రూ.5 వేల మేరా తగ్గింది. ప్రస్తుతం రూ.2.4 లక్షలకు చేరింది.

Advertisement

ALSO READ: పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్‌పర్ట్స్ ఇస్తున్న సలహలివే?

దేశంలోని మెట్రో నగరాల ధరలను చూద్దాం. ఢిల్లీలో ధరలు కాస్త ఎక్కువగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,48,590 పలుకుతోంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల ధరలు హైదరాబాద్ మాదిరిగా ఉన్నాయి.  వెండి ధర కిలోపై సుమారు రూ. 100 అటు ఇటు తగ్గుదల కనిపించింది.

Related News

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్‌పర్ట్స్ ఇస్తున్న సలహలివే?

యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో

చెక్ బౌన్స్ టెన్షనా?అకౌంట్ క్లోజ్ చేసే రైట్స్ బ్యాంకులకు ఉన్నాయా?

మారుతున్న పరిణామాలు.. పండగ వేళ బంగారం ధర పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

ఐటీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు అధిపతి, అదెలా సాధ్యం?

Big Stories

Advertisement
×