BigTV English

PM Modi: జూన్ 4 సమీపిస్తుండటంతో ఇండియా కూటమిలో అసహనం: పీఎం మోదీ

PM Modi: జూన్ 4 సమీపిస్తుండటంతో ఇండియా కూటమిలో అసహనం: పీఎం మోదీ

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఫలితాలు వెల్లడయ్యే సమయం దగ్గర పడుతుండటంతో ఇండియా కూటమిలో అసహనం పెరుగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు తనను దూషిస్తున్నారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బీహార్ లోని మహరాజ్ గంజ్ లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు.


ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాల తేదీ సమీపిస్తుండటంతో వారంతా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు రాబోయే ఐదేళ్ల కోసం మరో సారి మోదీlr ఎన్నుకుంటారన్న విషయాన్ని విపక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం కేంద్రంలో పటిష్ట ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వికసిత్ భారత్ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా మరోసారి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు.

Also Read: రాజీవ్ గాంధీ వర్థంతి.. నివాళులు అర్పించిన ప్రధాని, కాంగ్రెస్ నేతలు


కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరిగిందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆరోపించారు. యూపీలోని సిద్దార్థ నగర్ లో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా అవినీతి గురించి వెల్లడించారని గుర్తు చేశారు. తాము ఖర్చు చేసిన ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతోందని చెప్పారని అన్నారు. కానీ ప్రస్థుతం ఆ పరిస్థితి లేదు.. జన్ ధన్ ఖాతాల్లో నేరుగా డబ్బు ప్రజలకు చేరుతోందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

 

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×