Jagan: వైసీపీ అధినేత జగన్ టూర్లపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టూర్ల పేర్లతో పార్టీ మద్దతుదారులను రెచ్చగొట్టి శాంతి భధ్రతలకు విఘాతం చేస్తున్నా రంటూ ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తోంది. ఈ క్రమంలో బుధవారం పల్నాడు టూర్‌పై పలువురు అరెస్టయ్యారు. మాజీ మంత్రి అంబటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ డ్యామేజ్‌ని కంట్రోల్ చేసేందుకు గురువారం ఉదయం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్.
పర్యటనలో తెలుసుకున్న అంశాలను చెప్పాల్సింది పోయి అధినేత జగన్ చెవిరెడ్డి అరెస్టు విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తాను చేస్తున్న పర్యటనలకు ప్రజల్లో మాంచి స్పందన వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. కార్యకర్తలను, ప్రజలను పరామర్శించడం ప్రతిపక్ష నాయకుడిగా తాను చేసిందా తప్పా అంటూ ప్రశ్నించారు. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు? పోలీసులను ఎందుకు మోహరిస్తున్నారు? వచ్చినవారిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారంటూ పలు ప్రశ్నలు సంధించారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు, కార్యకర్తల్లో ఓ విప్లవం వచ్చిందన్నారు. ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి? బెదిరింపులు ఏంటని తనదైనశైలిలో మండిపడ్డారు. వాడిని తొక్కుతా.. వీడిని తొక్కుతా అన్న మాటలు ఏంటి? ప్రజలు దయ తలచి అధికారం ఇచ్చారని, మంచి చేయాల్సింది పోయి అబద్దాలతో, మోసాలతో పాలన చేస్తున్నారని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తానని అనడం ఏంటన్నది జగన్ ప్రశ్న.
లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్సీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలిగిందన్నారు జగన్. ఏడాదిలో ఈ కేసులో ఆయన పేరు రాలేదని, సడన్‌గా ఎలా వచ్చిందన్నారు. ఆయన్ని ఇరికించేందుకు తప్పుడు సాక్షాలను క్రియేట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. తన పర్యటనకు ముందు చెవిరెడ్డిని అరెస్ట్ చేశారని, తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వనందుకు గన్‌మెన్‌ను చిత్రహింసలు పెట్టారంటూ చెప్పుకొచ్చారు. బాధిత కానిస్టేబుల్.. డీజీపీ మొదలు రాష్ట్రపతి వరకు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు.
ALSO READ: జగన్ పల్నాడు టూర్ పై కేసులు, వారంతా బుక్కయినట్టే
ఓవరాల్‌గా జగన్ మీడియా సమావేశాన్ని గమనించినవాళ్లు కేవలం చెవిరెడ్డి అరెస్టుపై జగన్ మీడియా సమావేశం పెట్టినట్టు కనిపిస్తోందన్నారు. చట్టాలను రాజకీయ నేతలు గౌరవించకుంటే ప్రజలు ఇంకెలా గౌరవిస్తారన్నది టీడీపీ వైపు నుంచి సెటైర్లు పడిపోతున్నాయి. కేసులు సహజమేనని మళ్లీ మాజీ సీఎం జగన్ టూర్లను కంటిన్యూ చేస్తారా? అనవసరంగా కార్యకర్తలు ఇరుక్కుపోతున్నారని వెనక్కి తగ్గుతారా? అనేది చూడాలి.
వైసీపీ పాలన విషయానికొద్దాం. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు బయటకు రాకుండా గేటు తాళాలు వేసిన విషయాన్ని జగన్ మరిచిపోయారా అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ పిలుపు మేరకు తాము ఏ కార్యక్రమానికి వెళ్లాలన్నా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేసిన విషయం గుర్తుకు రాలేదా? అని అంటున్నారు. కూటమి పాలన ప్రశాంతంగా ఉండడం వల్ల జగన్ జిల్లాల పర్యటనకు వెళ్తున్నారని అంటున్నారు. చివరకు వైసీపీ నేతలు నిరసనలు, ధర్నాలు చేయడం లేదా? అంటూ మండిపడుతున్నారు.
లిక్కర్ కేసులో ఉన్నపళంగా చెవిరెడ్డి పేరు ఎందుకు వచ్చింది?: వైఎస్ జగన్
నా పర్యటనకు ముందు చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు
తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వనందుకు గన్ మెన్ ను చిత్రహింసలు పెట్టారు
దీంతో డీజీపీ, రాష్ట్రపతికి ఆ గన్ మెన్ లేఖ రాశారు
ఇలాంటి పరిస్థితుల వల్లే నక్సలిజం పుడుతుంది
— BIG TV Breaking News (@bigtvtelugu) June 19, 2025