E-Paper
Advertisement

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!
Advertisement

Property Tax: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో దాదాపు సగం వరకు జనాభా కల్గిన కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రజల అవసరాలకు తగిన విధంగా పౌర సేవల నిర్వహణ, అభివృద్దితో పాటు అత్యవసర సేవలందిస్తున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఈ ఆర్థిక సంవత్సరం కాస్త ముందుగానే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై ఫోకస్ చేసినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం నుంచి క్యూర్ సిటీ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త చట్టం అమల్లోకి రావటంతో ఇకపై ప్రతి ఇంటి నుంచి కార్పొరేషన్లు ప్రాపర్టీ ట్యాక్స్ తో పాటు ఇంట్లో పోగయ్యే చెత్తకు గ్యార్బేజీ కలెక్షన్ ఛార్జీలను కూడా కలిపి వసూలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

రూ. 548 కోట్లు వసూలు..

గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో పాత విధానంలోనే ప్రాపర్టీ ట్యాక్స్ ను వసూలు చేసుకున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్ల గత ఆర్థిక సంవత్సరంలో రూ.3 వేల కోట్ల ట్యాక్స్ కలెక్షన్ ను టార్గెట్ గా పెట్టుకోగా, గత మార్చి నెలాఖరు వరకు సుమారు రూ. 2558 కోట్లను వసూలు చేసుకున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ మాసంలో ట్యాక్స్ కలెక్షన్ ను మెరుగుపర్చుకునేందుకు అమలు చేసిన వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ తో దాదాపు రూ. 548 కోట్లు వసూలు చేసుకున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రస్తుతం కార్పొరేషన్ల ఆదాయాన్ని మెరుగుపరిచేలా కొత్త చట్టంలో నిబంధనలు ఉండటంతో ఈ సారి మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రూ. 5 వేల కోట్ల వరకు వసూలు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్త చట్టం అమలుతో ఈ నెల 2వ తేదీన, లేదా ఆ తర్వాత జరిగే, జరగనున్న ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యు ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయనున్నారు.

Advertisement

Also read: విజయ్ లో ఆ క్వాలిటీ అస్సలు నచ్చదు… రష్మిక కామెంట్స్ వైరల్!

భూముల ధరలు

ఇప్పటికే అసెస్ మెంట్ పూర్తయి పన్ను చెల్లిస్తున్న ఆస్తులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో పది శాతం పన్నును పెంచి వసూలు చేయనున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు ఇంట్లో పోగవుతున్న చెత్తకు అనధికారికంగా స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు చెల్లిస్తున్న గ్యార్బేజీ కలెక్షన్ ఛార్జీలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అధికారికంగా ప్రాపర్టీ ట్యాక్స్ లో భాగంగా వసూలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. భూముల ధరలు ఆకాశాన్నంటిన మాదాపూర్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ప్రపార్టీ ట్యాక్స్ గణనీయంగా పెరిగే అవకాశముంది. మురికివాడలు వంటి ప్రాంతాలకు ఇప్పటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయించగా, కొన్ని బస్తీలకు ట్యాక్స్ ను వర్తింపజేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయించిన మురికివాడల నుంచి గార్బేజీ ఛార్జీలను కూడా వసూలు చేసే అవకాశమున్నట్లు తెలిసింది. మూడు కార్పొరేషన్ల పరిధిలో ట్యాక్స్ చెల్లించే ప్రాపర్టీ ఇండెక్స్ నెంబర్లు (పీటీఐఎన్ ) లు సుమారు 28 లక్షల 29 వేల వరకున్నాయి. వీటిలో దాదాపు మూడు లక్షల ఆస్తులు కమర్షియల్ ట్యాక్స్ ను చెల్లించనున్నాయి.

సర్కారు ప్రాపర్టీల ట్యాక్స్ బకాయిలే ఎక్కువ..

Advertisement

క్యూర్ సిటీ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలే ఎక్కువగా ఉన్నాయి. వీటిని చెల్లించేందుకు ఇటీవలే సర్కారు సుముఖతను వ్యక్తం చేస్తూ అధికారికంగా గత మే నెలలో జీవో నెం.550 ను కూడా విడుదల చేసింది. సర్దుబాటు తర్వాత సర్కారు చెల్లించాల్సిన పన్ను రూ.5864.92 కోట్లు కాగా, ప్రత్యేక జీవోను జారీ చేసి వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) ను అమలు చేసి, వడ్డీ మాఫీ చేసిన తర్వాత సర్కారు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్స్ బకాయిలు మొత్తం రూ. 1686.39 కోట్లుగా తేల్చారు. ఈ మొత్తం ట్యాక్స్ ను మూడు కార్పొరేషన్ల పరిధిలో సర్కారు ఆస్తులకు సంబంధించి మొత్తం ప్రాపర్టీ ఇండెక్స్ నెంబర్లు దాదాపు 2217 వరకున్నాయి. జీవో జారీ చేసి నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు సర్కారు చెల్లించిన ప్రాపర్టీ ట్యాక్స్ అంతంత మాత్రమేనని తెల్సింది. తాజాగా వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ కూడా వర్తించనుంది.

Also read: ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

Tags

Related News

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×