E-Paper
Advertisement

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?
Advertisement

TG Congress: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మార్పుపై ఏఐసీసీ స్థాయిలో కసరత్తు మొదలైంది. ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ ఇన్‌చార్జ్‌లను మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఇప్పుడు తెలంగాణ లో మార్చుతారనే ప్రచారం ఊపందుకున్నది. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో సోమవారం కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం సుమారు 10 నెలల పాటు విదేశాలకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ బాధ్యతల నుంచి ఆమె స్వచ్ఛందంగా తాత్కాలిక విరామం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి పరిస్​థితుల్లోనే కొత్త ఇన్ చార్జ్ ను నియమించాలని ఏఐసీసీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కీలక నేతలనే ఎంపిక చేసే ఛాన్స్..

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయి అమలు, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం దెబ్బతినకుండా ఉండేందుకు పూర్తిస్థాయి ఇన్‌చార్జ్‌ అవసరమని ఏఐసీసీ భావిస్తోంది. ప్రభుత్వంతో సమన్వయమై పార్టీని సంపూర్ణంగా ముందుకు తీసుకువెళ్లేలా సమర్ధమైన నేతను ఎంపిక చేయాలని అధిష్టానం ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా చాలా పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, ప్రధానంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ అనుభవం కలిగిన ముకుల్ వాస్నిక్ ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన సంస్థాగత నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉన్నది.

Advertisement

Also read: హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

శక్తిసిన్ గోహిల్..

ఇక గుజరాత్ కు చెందిన సీనియర్ వ్యూహకర్త శక్తిసిన్ గోహిల్ పేరుకూడా వినిపిస్తుంది. మరోవైపు తెలంగాణ రాజకీయాలపై, స్థానిక సీనియర్ నాయకులతో సుదీర్ఘ అనుబంధం కలిగిన దిగ్విజయ్ సింగ్ కూడా మళ్లీ రాష్ట్రానికి వస్తారనే ప్రచారం ఉన్నది. పైగా గతంలో రాష్ట్ర సమస్యలు, నాయకుల అంతర్గత సమీకరణాలపై పూర్తి అవగాహన కలిగిన నేతగా ఆయనకు పేరుంది. అంతేగాక రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, మాజీ ఎంపీ అజయ్ కుమార్ ల పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. వీరిద్దరూ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ లో కాంగ్రెస్ ను పవర్ లోకి తీసుకువచ్చేందుకు పనిచేశారనే చర్చ కూడా ఉన్నది.

ఢిల్లీకి పీసీసీ చీఫ్​.. కీలక డిస్కషన్..

Advertisement

ఏఐసీసీ ఇన్ చార్జ్ ఎంపికతో పాటు సంస్థాగత మార్పులు, సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వం, పార్టీ సమన్వయం, దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పై చేయాల్సిన ఎదురుదాడి, ఎస్ ఐ ఆర్ పై వ్యవహరించాల్సిన తీరు లపై సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో మీటింగ్ జరగనున్నది. ఈ మీటింగ్ లో హైమాండ్ కీలక ఆదేశాలు ఇచ్చే ఛాన్స్ ఉన్నది. అంతేగాక తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంపై కూడా పీసీసీ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది.మరోవైపు పార్టీలో ఇంటర్నల్ సమస్యలు, లీడర్ల మధ్​య గ్యాప్ వంటి అంశాన్ని కూడా పీసీసీ చీఫ్​ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

Also read: ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×