Power bank safety tips: డైలీ లైఫ్ స్టైల్‌లో మనతో పాటు ఉండే.. ముఖ్యమైన గాడ్జెట్లలో పవర్ బ్యాంక్ ఒకటి. ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుల్లో లేదా బయట ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ కోసం ఇది ఎంత గానో ఉపయోగ పడుతుంది. అయితే.. దీని వాడకంలో.. మనం చేసే కొన్ని చిన్న చిన్న నిర్లక్ష్యాలు చాలా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది. మార్కెట్లో ఇటీవల వస్తున్న అనేక నివేదికల ప్రకారం.. పవర్ బ్యాంకులు వేడెక్కి పేలి పోవడం లేదా పాడై పోవడం జరుగుతోంది. అందుకే వీటిని వాడే ప్రతీ ఒక్కరూ పవర్ బ్యాంక్ సేఫ్టీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.
చాలా మంది ప్రయాణాలు చేసేటప్పుడు పవర్ బ్యాంక్‌ను కార్లలో, ముఖ్యంగా ఎండ తగిలే డాష్ బోర్డ్‌పై లేదా కిటికీ పక్కన వదిలేస్తుంటారు. లిథియం-అయాన్ బ్యాటరీలతో తయారయ్యే.. పవర్ బ్యాంకులు ఎకకువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. అంతే కాకుండా ఎండ వేడికి ఇవి త్వరగా వేడెక్కి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పవర్ బ్యాంక్‌ను ఎప్పుడూ చల్లని, నీడ ఉండే ప్రదేశాలలోనే ఉంచాలి.
పవర్ బ్యాంక్‌ను ఛార్జ్ చేయడానికి ఎప్పుడూ దానికి ఒరిజినల్ లేదా మంచి బ్రాండ్ అడాప్టర్‌ను మాత్రమే వాడాలి. మార్కెట్లో దొరికే లోకల్ ఛార్జర్లు లేదా వేరే హై-వోల్టేజ్ ఫాస్ట్ ఛార్జర్లను వాడటం వల్ల పవర్ బ్యాంక్ ఇంటర్నల్ సర్క్యూట్ దెబ్బతింటుంది. ఇది బ్యాటరీ లైఫ్‌ను తగ్గించడమే కాకుండా ఉబ్బిపోయేలా చేస్తుంది.
చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు పవర్ బ్యాంక్‌ను ఛార్జింగ్ పెట్టి ఉదయం తీస్తుంటారు. ప్రస్తుతం దొరుకుతున్న పవర్ బ్యాంకుల్లో ఆటో-కట్ ఫీచర్ ఉన్నప్పటికీ, పాత మోడల్స్‌లో లేదా లోకల్ బ్రాండ్లలో ఓవర్‌ఛార్జింగ్ వల్ల బ్యాటరీ ఎక్కువగా వేడెక్కుతుంది. ఇది పేలుళ్లకు దారి తీసే అత్యంత ప్రమాదకరమైన పొరపాటు. 100 శాతం ఛార్జ్ అయిన వెంటనే.. ప్లగ్ నుంచి తొలగించడం మంచి అలవాటు.
అజాగ్రత్తగా పవర్ బ్యాంక్‌ను కింద పడేయడం.. వల్ల లోపల ఉండే లిథియం-అయాన్ సెల్స్ దెబ్బతింటాయి పవర్ బ్యాంక్ బాడీ ఎక్కడైనా పగిలినా లేదా ఉబ్బినా..దానిని వెంటనే వాడటం మానేయాలి. డ్యామేజ్ అయిన పవర్ బ్యాంక్ ఎప్పుడైనా ప్రమాదకరంగా మరే అవకాశం ఉంది.
Also Read: రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!
ఇతర మెటల్ వస్తువులతో పాటు పవర్ బ్యాంక్‌ను.. బ్యాగ్‌లో వేసి తిప్పడం వల్ల, దాని యూఎస్‌బీ పోర్టులు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పవర్ బ్యాంక్‌ను ప్రత్యేకమైన పౌచ్‌లో ఉంచడం బెస్ట్.
సౌకర్యం కోసం వాడే.. గాడ్జెట్లు మన ప్రాణాలకే ముప్పుగా మారకుండా.. చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. పైన పేర్కొన్న చిన్న చిన్న జాగ్రత్తలను.. పాటించడం ద్వారా మీ పవర్ బ్యాంక్‌ను సేఫ్ గా ఉంచుకోవచ్చు.