Ind Vs Pak War: యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. వార్ సైరన్ మోగుతోంది. దేశమంతా అలర్ట్ నెస్ ప్రకటించేశారు. బుధవారం రోజున భారత్ లో 244 చోట్ల మాక్ డ్రిల్ జరగబోతోంది. యుద్ధం వస్తే ఎలా ఉండాలో జనానికి కూడా అవగాహన పెంచేలా చేయబోతున్నారు. పాకిస్తాన్ తో సరిహద్దు రాష్ట్రాల్లోనే సమస్య ఎక్కువగా ఉంటుంది. మిగితా ప్రాంతాలకు ఎయిర్ స్ట్రైక్స్ భయాలుంటాయి. మిసైల్స్ ప్రయోగించే అవకాశాలు ఉండడంతో అంతా అలర్ట్ అయ్యేలా ప్రిపేర్ చేస్తున్నారు. ఇంతకీ మాక్ డ్రిల్ లో ఏమేం చేస్తారు? జనం రియాక్షన్ ఎలా ఉండాలి? ప్రాణాలు దక్కించుకోవాలంటే చేయాల్సిందేమిటి?
యాక్షన్ కు రియాక్షన్
సేఫ్టీ కోసం గెట్ రెడీ..
ఇదే మాక్ డ్రిల్ లక్ష్యం..
అవును భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో ఏం జరుగుతుందన్నది నెక్ట్స్ మ్యాటర్. కానీ జనాన్ని అలర్ట్ చేయడం చాలా కీలకం. ముఖ్యంగా పాకిస్తాన్ కు ఇటు బంగ్లాదేశ్ కు సరిహద్దు రాష్ట్రాలపై చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇవే చాలా సెన్సిటివ్ ఏరియాస్. మిసైల్స్ అయినా.. యుద్ధ ట్యాంకర్లైనా ఈజీగా విధ్వంసం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే దేశవ్యాప్తంగా 244 చోట్ల మే 7న మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది కేంద్ర హోంశాఖ. యుద్ధాలు రెగ్యులర్ గా రావు.
యుద్ధం వస్తే సన్నద్ధతపై అలర్ట్
అందుకే వాటి గురించి పెద్దగా ఈ తరానికి తెలియదు. యుద్ధం వస్తే ఎలా ఉండాలి.. ఎంతటి అలర్ట్ నెస్ అవసరం.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు ఇవన్నీ చెప్పేలా చేయడమే మాక్ డ్రిల్ ఉద్దేశం. అంతే కాదు.. మన కంట్రోల్ రూమ్స్, భద్రతా వ్యవస్థలు పర్ ఫెక్ట్ గా ఉన్నాయా.. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ర్యాపిడ్ స్పీడ్ లో రియాక్ట్ అవుతున్నాయా అన్నది తెలుసుకునే ఉద్దేశంతో ఈ భారీ మాక్ డ్రిల్ కు ప్లాన్ చేశారు.
1971 భారత్-పాక్ యుద్ధం తర్వాత మళ్లీ మాక్ డ్రిల్
1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత తొలిసారిగా మనదేశంలో మళ్లీ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అంటే ఇదంతా యుద్ధ సంకేతమా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే యుద్ధం సంగతి తర్వాత.. ఫస్ట్ అలర్ట్ గా ఉండడమే కీలకం. ఏప్రిల్ 22న పహల్గాం బైసరన్ గ్రౌండ్ లో ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. దీంతో ప్రతీకారం కోసం భారత్ ఎదురుచూస్తోంది. కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే గట్టి వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీంతో ఏం జరుగుతుందన్నది హైటెన్షన్ గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే మాక్ డ్రిల్ నిర్వహిస్తుండడంతో యుద్ధానికి ఇది సంకేతమా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూనే ఉంది. పాక్ మిసైల్స్ ప్రయోగిస్తే మాత్రం యుద్ధం అనివార్యమే.
ఇదంతా యుద్ధ సంకేతమా?
నిజానికి పహల్గాం దాడితో పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. అటు భారత్ సంయమనంతో ఉన్నా ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. ఏం చేయాలి.. ఎలా చేయాలన్నది ప్లానింగ్ నడుస్తోంది. అది ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. అంతకు ముందు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జనం రెడీగా ఉండేలా పరీక్షించడం, బలోపేతం చేయబోతున్నారు. భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలు తప్ప మిగితా రాష్ట్రాలపై శత్రువు దాడి చేయాలనుకుంటే వైమానిక దాడులు లేదంటే క్షిపణి దాడులే మేజర్ గా ఉంటాయి. సో వీటి నుంచి ఎలా రక్షణ పొందాలన్నది మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం. అందుకే సామాన్య జనం తమను తాము రక్షించుకునేందుకు ఎలాంటి టెక్నిక్స్ వాడాలో మాక్ డ్రిల్ లో చెబుతారు.
మొదట కయ్యానికి కాలుదువ్విన పాక్
అంతే కాదు… వైమానిక దాడుల సమయంలో జనాన్ని హెచ్చరించే ఎయిర్ రైడ్ సైరన్‌ల కెపాసిటీని టెస్ట్ చేయడం, వాటి పనితీరును నిర్ధారించడం వంటివి చేస్తారు. మాక్ డ్రిల్ లో భాగంగా బ్లాక్ ఔట్ చర్యలు అంటే రాత్రిపూట శత్రు విమానాలు లేదా డ్రోన్ ఎటాక్స్ నుంచి తప్పించుకునేందుకు నగరాల్లో లైట్లు ఆఫ్ చేసి మిస్ గైడ్ చేసేలా చూసుకోవడం కీలకం. ఇక వీటితో పాటే శత్రువు దాడి చేస్తే మన దగ్గర వాల్యుబుల్ ఎక్విప్ మెంట్ పైనే ఫోకస్ చేస్తుంటుంది. కీలకమైన ప్రభుత్వ పరిపాలనా భవనాలు, థర్మల్, అణు విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలను కామోఫ్లాజ్ చేయడం కీలగకం.
వైమానిక, క్షిపణి దాడులపై అప్రమత్తత అవసరం
అంటే శత్రువు శాటిలైట్ ద్వారా చూసినా, వైమానిక దాడులు చేయాలని చూసినా డ్రోన్ ఎటాక్ చేయాలని చూసినా ఇలాంటి కీలకమైన స్థావరాలను టెక్నికల్ గా, స్ట్రాటజికల్ గా కనిపించకుండా చేయడమే కామోఫ్లాజ్. నెట్టింగ్ చేయడం, పెయింటింగ్, థర్మల్ ఇమేజింగ్ వాడడం, డమ్మీ స్ట్రక్చర్స్, స్మోక్ స్క్రీన్స్, జామర్స్, రాడార్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ వాడడం ఇలాంటివన్న మాట. అయితే AI వచ్చాక ఇలాంటి పద్ధతులతో శత్రువును నిలువరించడం కష్టంగా మారుతోంది.
జనాన్ని సేఫ్టీ ప్లేస్ కు తరలించే ప్లాన్స్ కీలకం
యుద్ధ సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను ఆధునీకరించడం, రిహార్సల్స్ చేయడం కీలకం. అలాగే కంట్రోల్ రూమ్‌ల పనితీరును పరీక్షించుకోవడం కూడా ముఖ్యమే. కంట్రోల్ రూమ్‌లు, షాడో కంట్రోల్ రూమ్‌ల మధ్య కోఆర్డినేషన్, రియాక్షన్ కెపాసిటీని పరీక్షించడం వంటివి తాజా మాక్ డ్రిల్స్ లో చేయబోతున్నారు. వీటితో పాటే ఫైర్, రెస్క్యూ ఆపరేషన్‌లు, ఇతరత్రావి టెస్ట్ చేస్తారు. ఈ డ్రిల్స్ 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడే నిర్వహిస్తున్నారు.
ఎమర్జెన్సీలో భయాందోళన తగ్గించడం లక్ష్యం
ఈ చర్యలతో శత్రు దాడుల టైంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో గందరగోళాన్ని తగ్గించడం, భయాందోళనలను నివారించడం, జనాన్ని కాపాడడం లక్ష్యంగా డ్రిల్స్ ఉండబోతున్నాయి. ఈ డ్రిల్స్ జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి సరిహద్దు రాష్ట్రాలతో సహా మొత్తంగా 244 చోట్ల జరగబోతున్నాయి. ఈ డ్రిల్‌లు యుద్ధానికి సిద్ధమవుతున్నామని సూచించవు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండటానికి దేశ రక్షణకు ముందస్తు చర్యగా చూడాలి.
కేటగిరి 2 లో విశాఖ, హైదరాబాద్
రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు కేటగిరి 1 జోన్ లో ఉన్నాయి. అంటే ఇవి హైరిస్క్ జోన్స్ అన్న మాట. ఎందుకంటే పాకిస్తాన్ లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ క్షిపణుల్ని ఈ సరిహద్దు రాష్ట్రాలపై ఈజీగా ప్రయోగించగలదు. అందుకే ఎయిర్ స్ట్రైక్స్ జరిగితే ఎలా ఉండాలో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ, హైదరాబాద్ కేటగిరి 2 జోన్ లో ఉన్నాయి. అసోం, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు కేటగిరి టూలో ఉన్నాయి.
చైనా, టర్కీలతో మ్యాటర్ డీల్ చేస్తోంది.
దేశంలో జనానికి యుద్ధ సన్నద్ధత ఎంత ఉందో పరీక్షించడం మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇవి ఎయిర్ స్ట్రైక్స్ నుంచి రక్షణ ఎలా అన్నదే కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి మిసైల్స్ ప్రయోగిస్తే.. మనదేశంలోని ప్రధాన నగరాలకు రీచ్ అయ్యే కెపాసిటీ ఉంది. అయితే మన దగ్గర కౌంటర్ మిసైల్ సిస్టమ్ కూడా ఉండడంతో అవి మన దాకా వచ్చే అవకాశం లేదు. బట్ ఛాన్స్ తీసుకోలేం కదా. అందుకే ఈ వార్ ప్రిపరేషన్. అటు పాకిస్తాన్ కూడా యుద్ధం రాకుండా చాలా ప్రయత్నాలే చేస్తోంది. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు చైనా, టర్కీలతో మ్యాటర్ డీల్ చేస్తోంది.
ఈసారి యుద్ధం వస్తే అంతకు మించి..
కయ్యానికి కాలు దువ్వడం ఆ తర్వాత యుద్ధ సన్నాహాలు జరగకుండా అందరినీ అభ్యర్థించడం పాకిస్తాన్ ఎప్పుడూ చేసే పనే ఇది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. సో ఈసారి యుద్ధం వస్తే కార్గిల్ మాదిరిగా ఆ కొండలకే పరిమితం అయ్యే పరిస్థితి ఉండదు. అందుకే ఈ అలర్ట్. కరెంట్ పోతే కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మెడికల్ కిట్లు, నగదు ఇవన్నీ ఉంచుకోవాలంటున్నారు అధికారులు. సో ఈ అలర్ట్ నెస్ అటుంచితే.. ఇప్పుడు పాకిస్తాన్ పరేషాన్ లో ఉంది. అక్కడితో ఆగకుండా.. UN సెక్యూరిటీ కౌన్సిల్ తో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేయించింది.
సెక్యూరిటీ కౌన్సిల్ చెబితే వింటామా?
యుద్ధం ఆపేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు మీటింగ్ పెట్టుకున్నా దాని అవుట్ కమ్ ఏంటన్నది మాత్రం బయటకు చెప్పలేకపోయారు. సో ఈ ప్రయత్నం ఫెయిల్ అయినట్లే. ఒకవేళ భద్రతామండలి ఏదైనా భారత్ కు సలహా ఇస్తే తీసుకునే పొజిషన్ లో మనం లేము. అందుకే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఆ దేశాలు.
లేటెస్ట్ వార్ షిప్ ను కరాచీ పోర్ట్ కు పంపిన టర్కీ
ప్రస్తుతం పాకిస్తాన్ కు టర్కీ, చైనా అండగా నిలుస్తున్నాయి. టర్కీ అయితే లేటెస్ట్ వార్ షిప్ ను కరాచీ పోర్ట్ కు పంపించింది. ఫైటర్ జెట్స్ కూడా పంపుతోంది. ఈ వార్ షిప్ యాంటీ మిసైల్ సెంట్రిక్ గా ఉన్నాయి. సో పాకిస్తాన్ నుంచి మిసైల్స్ ప్రయోగిస్తే.. మనదేశంలోని చాలా నగరాలు టార్గెట్ చేసే కెపాసిటీ ఉంది. పాకిస్తాన్ పవర్ ఫుల్ లేటెస్ట్ మిసైల్ షాహీన్-3. దీనికి 2,750 కిలోమీటర్ల రేంజ్ ఉంది. ఇలి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. 2015లో మొదటిసారి పరీక్షించారు.
షాహీన్-2కు 2 వేల కిలోమీటర్ల రేంజ్
దీనికి అణ్వాయుధాలను మోసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది. పాక్ నుంచి ఢిల్లీ ఆరేడువందల కిలోమీటర్లు, ముంబై వెయ్యి నుంచి 1200 కిలోమీటర్లు, చెన్నై 2100 కిలోమీటర్లు, బెంగళూరు 2 వేల కిలోమీటర్లు, హైదరాబాద్ 1500 కిలోమీటర్లు.. అహ్మదాబాద్ 900 కిలోమీటర్లు, చివరగా పోర్ట్ బ్లెయిర్ 2500 కిలోమీటర్లు ఉంది. సో అక్కడి వరకు పాక్ మిసైల్ ప్రయోగించే కెపాసిటీ ఉంది. షాహీన్-2కు 2 వేల కిలోమీటర్ల రేంజ్ ఉంది. అబాబీల్, ఘోరీ, బాబర్ క్రూయిజ్ , ఫతా 2 వంటి మిడ్ రేంజ్ నుంచి షార్ట్ రేంజ్ క్షిపణులు పాక్ దగ్గర ఉన్నాయి.
పాక్ మిసైల్స్ ను బార్డర్ లోనే ఖతం చేసే కెపాసిటీ
అయితే పాకిస్తాన్ మిసైల్ ప్రయోగిస్తే.. భారత్ చూస్తూ ఊరుకోదు. వాటిని బార్డర్ దాటకుండానే కౌంటర్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. S-400, బరాక్-8, ఆకాశ్, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వంటి అధునాతన రక్షణ వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి. ఇవి మిసైల్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తాయి. రాడార్ నుంచి తప్పించుకోకుండా చూస్తాయి. S-400 అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ ఇది. దీన్ని మనం రష్యా నుంచి కొన్నాం. ఇది 400 కిలోమీటర్ల పరిధిలో మిసైల్స్, యుద్ధ విమానాలు, డ్రోన్‌లను అడ్డుకుంటుంది.
S-400, బరాక్-8, ఆకాశ్, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్
ఇది మల్టీ టార్గెట్స్ ను ఏకకాలంలో ట్రాక్ చేసి చేదిస్తుంది. షాహీన్ 3, షాహీన్ 2 వంటి మిసైల్స్ ను ఎదుర్కొంటుంది. ఈ S-400 యూనిట్లు పంజాబ్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్‌లో రెడీగా ఉన్నాయి. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను DRDO రూపొందించింది. ఇది కూడా 2 వేల కిలోమీటర్ల దాకా బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుంటుంది. బరాక్-8, ఆకాశ్ మిసైల్ సిస్టమ్, పృథ్వీ డిఫెన్స్ వెహికల్, సముద్ర ఆధారిత రక్షణ, రాడార్ సిస్టమ్స్, DRDO ఆకాశ్-నెక్స్ట్ జనరేషన్ వంటి వ్యవస్థలు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాలు, సైనిక స్థావరాలను సేవ్ చేస్తాయి.
పంజాబ్, JK, రాజస్థాన్‌లో రెడీగా కౌంటర్ మిసైల్ సిస్టమ్స్
సో 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ పకడ్బందీగా చేయబోతున్నారు. ఈ డ్రిల్‌లో జిల్లా అధికారులు, సేఫ్టీ వాలంటీర్లు, హోం గార్డులు, NCC, NSS, NYKS నుంచి పాల్గొంటారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించడానికి జనానికి కన్ఫ్యూజ్ లేకుండా ట్రైనింగ్ ఇస్తారు. ఇస్లామాబాద్‌పై వరుస దౌత్యపరమైన చర్యలు, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి వాటి తర్వాత, ఇప్పుడు భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతోందా అన్నట్లుగా ఈ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి.
ఢిల్లీలో బ్యాక్ టూ బ్యాక్ మీటింగ్స్..
గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భద్రతా సంస్థలోని ఉన్నతాధికారులు, అధికారులు చాలాసార్లు సమావేశమయ్యారు. ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా మద్దతిస్తామని ప్రకటించేశాయి. అందుకే పాకిస్తాన్‌పై భారీ ఎటాక్ కు సమయం వచ్చేసిందా అన్న ఊహాగానాలు పెంచేలా తాజాగా ప్రధాని మోడీతో ఆర్మీ, నేవీ, వైమానిక దళాధిపతులు, రక్షణ కార్యదర్శితో భేటీ అయ్యారు. సో గెట్ రెడీ అంటున్నారు. అలర్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందన్నది మరికొన్ని గంటల్లో తేలబోతోంది.