Instagram Journey: 2010 అక్టోబర్ 6. కెవిన్ సిస్ట్రోమ్ మైక్ క్రీగర్ ఈ ఇద్దరు కలిసి Instagramను ప్రారంభించారు. మొదట్లో ఇది కేవలం ఫొటోలు షేర్ చేసుకునే యాప్. లాంచ్ అయిన రోజే దాదాపు 25 వేల మంది రిజిస్టర్ అయ్యారు. వారం రోజుల్లోనే లక్ష దాటారు. మూడు నెలల్లో 10 లక్షల మంది యూజర్లు అయ్యారు.
2011లో 1 కోటి మంది.. 2013కి 10 కోట్ల మంది.. 2015లో 40 కోట్ల మంది. అంటే.. ఫొటోలు పెట్టుకునే చిన్న యాప్ ప్రపంచ సోషల్ మీడియా పవర్‌గా మారిపోయింది. 2012లో Facebook.. Instagramపై కన్నేసింది. ఎంతకు తెలుసా? 100 కోట్ల డాలర్లు. అంటే అప్పటి లెక్కల్లో దాదాపు 5 వేల కోట్లకు పైగా. ఆ సమయంలో Instagramకి సిబ్బంది కూడా చాలా తక్కువ. కానీ Facebook మాత్రం భవిష్యత్తు బిజినెస్‌ను ముందే చూసింది.
ఇప్పుడు Instagram స్థాయి ఊహించలేనంత పెరిగింది. 2026లో Meta వెల్లడించిన ప్రకారం.. Instagram రోజువారీ యాక్టివ్ యూజర్లు 200 కోట్ల మార్క్‌ను దాటింది. అంటే.. ఒక్కరోజులో 200 కోట్ల మంది. ఇది ప్రపంచ జనాభాలో భారీ భాగం. మన దేశంలోనూ Instagramకు భారీ క్రేజ్ ఉంది. 2025 చివరి నాటికి Meta అడ్వర్టైజింగ్ టూల్స్ ప్రకారం భారత్‌లో Instagramను చేరుకునే అడ్వర్టైజింగ్ ఆడియన్స్ 48.1 కోట్లు. ఒక ఏడాదిలోనే ఈ సంఖ్య దాదాపు 9 కోట్ల మేర పెరిగింది. అందుకే India.. Instagramకు అత్యంత కీలక మార్కెట్లలో ఒకటిగా మారింది.
Also read: బీఆర్ఎస్ సోషల్ మీడియాకు.. బల్మూరి వెంకట్ మాస్ వార్నింగ్!