E-Paper
Advertisement

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…
Advertisement

ఈ మధ్య కేటీఆర్‌ తీరు చూస్తే.. పూర్తిగా అల్ప సంతోషిగా మారిపోయాడేమోననిపిస్తున్నది. ఆయనకుండే.. అహంభావం, చికాకు, వ్యంగ్యం, వెటకారానికి తోడు.. ఇది కూడా యాడ్‌ అయినట్టుంది. లేదా పరిస్థితులే అలా తయారు చేసి ఉంటాయి కాబోలు.

వినాయక నిమజ్జనానికి కేసీఆర్‌ పాటలు పెట్టుకున్న విషయాన్ని పెద్దగా చూపే క్రమంలో మరీ ఇంత సంకుచితమైపోయాడేంటీ అని అనిపించిదంటే నమ్మండి. ఎవరో ఒకరు.. ఎక్కడో ఒక దగ్గర .. లేదా కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా పార్టీ రంగు దీనికి పులిమి ఉంటారు. పాటలు పాడి.. గులాబీ శ్రేణుల్లో జోష్‌ నింపే ప్రయత్నమే కావొచ్చు. కేసీఆర్‌ అభిమానులే అయి ఉండొచ్చు. ఆయన మళ్లీ రావాలని కోరుకునే బ్యాచే కావొచ్చు. కాదనలేం.

Advertisement

కానీ అలా పాడారని, చూశారా తెలంగాణలో ప్రతి ఒక్కరి గుండెలో కేసీఆర్ ఉన్నాడు.. అనే విధంగా వ్యక్తీకరించి.. వక్రీకరించి.. సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టుకోవడమే తప్ప మరోటి కాదు. కాదంటారా? పైగా.. ఫామ్‌హౌజ్‌ల నుంచి ఆయన రాకపోయినా.. మూడేండ్లు ప్రజలకు దూరంగా ఉన్నా.. జనం మరిచిపోలేదనే లింకును దీనికి జోడించి.. సమర్థించి..ఇదే జనం అనుకునే భావన అని సూత్రీకరించి.. ఏందన్నా.? రామన్నా.? మరీ ఇంత దిగజారి పోయావేందన్నా..అని అనాలనిపించింది.

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌లనే ఉంటడు.. ఆయనకు ఎప్పుడు రావాల్నో తెలుసు..? మీరు రారమ్మని  పిలిస్తే రాడు.. జనమే ఆయన మూడేండ్లు రాకున్నా.. యాదికి పెట్టుకున్నరు… సమయానికి బయటకు వచ్చి.. జనంతో కలుస్తాడు..!అని కేటీఆర్‌ .. ఇటు జనానికి, అటు కాంగ్రెస్‌ పార్టీ నేతలకూ చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఓ జీవన్‌రెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరితే భారీ బహిరంగ సభకు కేసీఆర్‌ బయటకు వస్తాడా? కేసీఆర్‌ ఏడున్నవన్నా.. రా అన్నా.. అని జనం ఆవేదనతో పిలిస్తే కనీసం పలకలేదేం..? పైగా కత్తి ఒకనికిచ్చి.. నన్ను యుద్దం చేయమంటే ఎట్లా? అని ఎటకారం ఆడిన కేసీఆర్‌ను ఏమనాలె.. ఇదే డైలాగును పదే పదే కొడుతున్న నిన్ను జనం ఏమనుకోవాలె..?

Advertisement

అసెంబ్లీకి రావు. సరే.. మరి జీవన్‌రెడ్డి కంటే జనం అంత అధ్వాన్నంగా కనబడుతున్నారా? జనం ఎదుర్కొంటున్న సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ఓ బహిరంగ సభ పెట్టొచ్చుగా..అంత తీరిక లేదా? ఓపిక లేదా? అని అడుగున్నారన్నా జనం. పోనీ కనీసం .. అలా తెలంగాణ భవన్‌కు వచ్చి ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి మాకోసం మాట్లాడి పోవచ్చుకదా? అని అదే జనం అనుకుంటున్నారన్నా..!

ఇగ ప్యారాడైజ్‌ సినిమాకు పోయిండు కేటీఆర్‌ తన టీమ్‌ను వెంటబెట్టుకుని. ఆ సినిమాలో కేసీఆర్‌ పాత్రను అక్కడ జొప్పించారే తప్ప.. అంత పాజిటివ్‌ ఎలివేషన్‌ ఏం లేదక్కడ. పైగా సిగరెట్ తాగే సీన్… మాస్‌ అప్పీయరెన్స్‌ కోసం పెట్టి ఉంటారు కానీ.. అది నెగెటివిటీనే తెచ్చిపెట్టింది కేసీఆర్‌కు.

పైగా ఇది కేసీఆర్‌ను పోలిన పాత్ర అని ఆయన పేరును చెప్పడానికి  కూడా గజ్జున వణికింది ఆ సినీ టీం. పోనీ సినిమా చూసిన నువ్వైనా.. కేసీఆర్‌ పాత్ర చాలా బాగుంది..! జనం కేరింతలు కొట్టారు.. నాకు కూడా ఆ నటన నచ్చింది..? అని ఓ ముచ్చట చెప్పకపోతివి. ఆ సీన్‌లో పొట్టి శ్రీరాములు పేరును సందర్భానికి వాడుకున్నారేమో గానీ, ఉద్యమ దళపతి స్థానంలో ఆ పాత్రతో చెప్పించిన ఆ డైలాగు ద్వారా  తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేసి చూపినట్టు, చరిత్ర వక్రీకరించినట్టుగా అనిపించలేదా? అంతెందుకు నీకు అనిపించలేదా? దీన్ని కూడా పొలిటికల్‌ మైలేజీకి వాడుకుందామని చూసిన నిన్ను చూస్తే జాలేస్తుంది రామన్నా!

చివరగా ఒక విషయం చెప్పాలనిపించింది… చావు నోట్లో తలకాయ పెట్టైనా సరే నీకు గుర్తింపు తెస్తా..! ఆ సీన్‌లో కేసీఆర్‌ పాత్రతో చెప్పించిన డైలాగును.. నీ కోసం కేసీఆరే చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే.. ఆయన ఎంత తపన పడుతున్నా సీఎం క్యాండిడేట్‌గా జనం నిన్ను గుర్తిస్తలేరాయె..! అందుకే మీ సోషల్ మీడియా బ్యాచ్‌తో.. నాని పాత్రకు నీ తలకాయను అతికించి.. చావునోట్లో తలకాయ పెట్టైనా సరే.. నీకు సీఎం గుర్తింపును తెస్తా…! అని డైలాగును మార్చి చెప్పించు.. దాన్ని వైరల్ చేయించు.. అట్లైనా జనం మదిలో ఈ ఆలోచన చక్కర్లు కొడుతుందేమో!

Tags

Related News

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వేటు?

రహస్య స్నేహితుడిని కాదని అడుగు బయటపెట్టగలడా…? సొంతంగా బలం నిరూపించుకోవాలనే తండ్లాటే..!

“G9 బొగ్గు అక్కడ.. చెత్త బొగ్గు ఇక్కడ!”.. సింగరేణి దందాను బయటపెట్టిన జగదీశ్వర్ రెడ్డి!

కాంట్రాక్టులు.. కమిషన్లు.. అభివృద్ధి అంటే ఇదేనా? BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్

ప్రజల భూముల విషయంలో ఇదేం పద్ధతి? 22Aపై జగదీశ్ రెడ్డి

Big Stories

Advertisement
×