E-Paper
Advertisement

నార్సింగిలో పట్టభద్రుల శంఖారావం.. ఓటరు నమోదు ప్రారంభించిన పొన్నం ప్రభాకర్!

నార్సింగిలో పట్టభద్రుల శంఖారావం.. ఓటరు నమోదు ప్రారంభించిన పొన్నం ప్రభాకర్!
Advertisement

Ponnam Prabhakar: టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆధ్వర్యంలో నార్సింగిలో ‘ట్టభద్రుల సమ్మేళనం 2026 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాబోయే శాసనమండలి ఎన్నికలను పురస్కరించుకుని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు.

ఓట్ల తొలగింపుపై తీవ్ర ఆందోళన

Advertisement

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఓటర్ల నమోదుపై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరుగుతున్న సర్ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 2001లో నమోదు ప్రక్రియ జరిగినప్పుడు ఒక్క అర్హమైన ఓటు కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని, కానీ ప్రస్తుతం ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఓట్ల తొలగింపు సాగుతోందని విమర్శించారు. ఏకంగా సిఈసి జ్ఞానేశ్వర్ మీదనే అవిశ్వాసం పెట్టే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పోరాటం.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం

Advertisement

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ అని, అక్రమ ఓట్ల తొలగింపుపై గట్టిగా పోరాడుతుందని పొన్నం స్పష్టం చేశారు. జిల్లాల వారీగా బాధ్యతలను వివరిస్తూ.. హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా తాను, రంగారెడ్డి జిల్లాకు శ్రీధర్ బాబు, మహబూబ్‌నగర్ జిల్లాకు దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఈ నమోదు కార్యక్రమం వేగవంతంగా సాగుతుందని తెలిపారు. నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పట్టభద్రుల గొంతుకగా శాసనమండలి

శాసనమండలిలో పట్టభద్రుల హక్కుల కోసం నిలబడే సరైన గొంతుక ఉండాలని, ఇందుకోసం గ్రామస్థాయిలోని ప్రతీ గ్రాడ్యుయేట్‌ను గుర్తించి ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: హైదరాబాద్‌లో భారీ చీటీల మోసం.. రూ. 16 కోట్లతో కుటుంబం పరారీ!

Tags

Related News

చిక్కడపల్లిలో దారుణం.. భార్యను రోకలిబండతో బాది చంపిన భర్త!

హైదరాబాద్‌లో భారీ చీటీల మోసం.. రూ. 16 కోట్లతో కుటుంబం పరారీ!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై బదిలీల్లో కొత్త రూల్స్?

ఇంకో 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.. రాసి పెట్టుకో కేటీఆర్: అద్దంకి దయాకర్

మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి

అస్తిత్వ పోరాటానికి దృశ్య రూపం.. థియేటర్‌లో ‘పారడైజ్’ మూవీ వాచ్.. కేటీఆర్‌తోపాటు సీనియర్ నేతలు

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 30 మంది ప్రయాణికులు, చౌటుప్పల్ వద్ద ఘటన

Big Stories

Advertisement
×