E-Paper
Advertisement

“G9 బొగ్గు అక్కడ.. చెత్త బొగ్గు ఇక్కడ!”.. సింగరేణి దందాను బయటపెట్టిన జగదీశ్వర్ రెడ్డి!

“G9 బొగ్గు అక్కడ.. చెత్త బొగ్గు ఇక్కడ!”.. సింగరేణి దందాను బయటపెట్టిన జగదీశ్వర్ రెడ్డి!
Advertisement

Jagadish Reddy on Singareni Coal:బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్ట్రైట్ టాక్’ ముఖాముఖి కార్యక్రమంలో సూర్యపేట BRS ఎమ్మెల్యే, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న పలు విషయలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22A నిషేధిత భూముల అంశంతో పాటు విద్యుత్ రంగాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు, సింగరేణి బొగ్గు కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాలు మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన వివరంగా మాట్లాడారు.

Advertisement

అక్రమంగా సింగరేణి బొగ్గు తరలింపు

గత BRS ప్రభుత్వ హయాంలో తెలంగాణలో విద్యుత్ రంగాన్ని ఒక ఉన్నతస్థానానికి తీసుకువచ్చామని జగదీశ్వర్ రెడ్డి గుర్తుచేశారు.అయితే ప్రస్తుతం ఈ పాలకులు దాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లలో 3100 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తిని సమర్థవంతంగా చేయవచ్చని, అయితే కావాలనే కేసీఆర్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని వాటిని వాడకుండా
విద్యుత్ కోతలకు గురయ్యేలా చేస్తున్నారని మండి పడ్డారు.

Advertisement

సింగరేణి పరిధిలోని 13 ప్రధాన గనుల నుండి మంచి క్వాలిటీ బొగ్గు అయిన ‘G9’ రకం బొగ్గు రోజువారీగా పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోందని తెలిపారు. అయితే ఈ నాణ్యమైన G9 బొగ్గును మన వద్ద ఉన్న తెలంగాణ ప్లాంట్లకు ఇవ్వకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి పక్క రాష్ట్రాలకు ఇష్టానుసారంగా తరలిస్తున్నారని మండిపడ్డారు.

మన ప్రాజెక్టులకు మాత్రం నాణ్యత లేని, తక్కువ కేలరిఫిక్ విలువ కలిగిన బొగ్గును మళ్ళించడం వల్ల ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం దారుణంగా పడిపోతోందని చెప్పారు. గతంలో G9 బొగ్గు లేకపోతే ప్లాంట్లు నడవవని చెప్పిన సాకులను తిప్పికొడుతూ, G6 నుండి G15 వరకు ఏ రకమైన బొగ్గుతోనైనా విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతిక వ్యవస్థ మన వద్ద ఉందన్నారు.

రైతాంగానికి సంక్షోభం

పవర్ జనరేషన్ నిలిచిపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని, ఎండల సమయంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని జగదీశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ట్రయల్ రన్ల పేరుతో సమయం వృధా చేస్తూ 10 నిమిషాల విద్యుత్ ఇచ్చి బంద్ చేయడం ప్రభుత్వం ఫెయిల్యూర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని అన్నారు. ఇక శ్రీశైలం జలాశయంలోని నీటిపై మాట్లాడుతూ, నాగార్జునసాగర్, శ్రీశైలం పరిధిలో తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలు వందలాది టీఎంసీల కొద్దీ రాయలసీమకు తరలిపోతున్నా ఈ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ లా చూస్తూ ఉందని మండిపడ్డారు. శ్రీశైలంలో 100 TMCల దాకా నీటిని వాడుకునే సౌకర్యం ఉన్నా సరైన ప్లాన్ లేకపోవడం వల్ల తెలంగాణ భూములకు సాగునీరు అందకుండా పోతోందని వాపోయారు.

కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక

ఇక ఈ మధ్య మంత్రి కొండా సురేఖ పార్టీ మార్పుపై కూడా తనదైన శైలిలో స్పందించారు.అలాంటి ఆయారాం గయారాం లు మాకు అవసరం లేదని కుండ బద్దలు కొట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని, కాంగ్రెస్ నాయకులు తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి చవకబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారు 

BRS పార్టీ కేడర్ ఎంతో బలమైనదని, తమ అధినాయకత్వాన్ని లేదా పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఆఫీస్ గేటును కనీసం తాకలేరని, పార్టీకి ఉన్న ప్రజాదరణ, కార్యకర్తల బలమే తమ శక్తి అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని తేల్చి చెప్పారు !

also read :కాంట్రాక్టులు.. కమిషన్లు.. అభివృద్ధి అంటే ఇదేనా? BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్

Tags

Related News

కాంట్రాక్టులు.. కమిషన్లు.. అభివృద్ధి అంటే ఇదేనా? BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్

ప్రజల భూముల విషయంలో ఇదేం పద్ధతి? 22Aపై జగదీశ్ రెడ్డి

భూమి మనదే.. కానీ అమ్ముకోలేం! 22Aపై జగదీశ్ రెడ్డి కీలక కామెంట్స్

మచిలీపట్నంలో హోరెత్తిన వీఆర్ఏ జేఏసీ ధర్నా.. వారి డిమాండ్లు ఇవే!

ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ.. అభ్యర్థి ఎవరంటే?

నాకు వారి నుండి ప్రాణహాని ఉంది.. యరపతినేని శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!

కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్.. సర్ వివాదంపై స్పష్టత కోరిన ఎన్డీయే మిత్రపక్షాలు!

Big Stories

Advertisement
×