YSRCP VS TDP: వైసీపీ మాజీ నేత.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి అని విమర్శించారు. రాజ్యసభ సభ్యునిగా మూడున్నర సంవత్సరాలు పదవీకాలం ఉండగా.. చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆరోపించారు. ఆ ఆరోపణలు, విమర్శలపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారనీ, జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆ కౌంటర్ ఉంటుందనీ అంతా భావించారు. అయితే జగన్ విమర్శలను విజయసాయి పట్టించుకోవడం లేదంట. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు ఫేస్ బుక్ పోస్టు చర్చల్లో నలుగుతోంది.
అమరావతి రాజధానిపై మరోసారి అక్కసు వెల్లగక్కిన జగన్
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో కాని ప్రెస్‌మీట్ పెట్టరు. ఎప్పుడు మాట్లాడినా ప్రీ రికార్డెడ్ వీడియోలే రిలీజ్ అవుతుంటాయి. అటువంటాయన ఇటీవల మీడియా ముందు కొచ్చి అమరావతి రాజధానిపై మరోసారి తన వ్యతిరేకత చాటుకున్నారు. అమరావతి రాజధాని పున:నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభించడం…మూడేళ్ళలో అమరావతి రాజధాని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ నేతలు తీరు చూస్తే వారి విధానం మారలేదని స్పష్టమవుతోంది. అప్పులు తెచ్చి అమరావతి కోసం పెడితే మిగిలిన ప్రాంతాల సంగతేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ అమరావతి నిర్మాణ వ్యయం పెంచేసి టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని ఘాటైన ఆరోపణలు చేశారు.
నిర్మాణ వ్యయం పెంచేస్తూ ఎడాపెడా అప్పులు చేస్తున్నారని విమర్శ
అల్రెడీ గతంలో టీడీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన పనులు పూర్తి చేయడానికని, నిర్మాణ వ్యయం పెంచేస్తూ ఎడాపెడా అప్పులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజధానిని ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాంతంలో కాకుండా నాగార్జున యూనివర్సిటీ దగ్గరో.. లేకపోతే బెజవాడ, గుంటూరుల మధ్య 500 ఎకరాల్లో నిర్మించాలని సూచనలు కూడా చేస్తున్నారు. అయితే ఆయన నోటి వెంట మూడు రాజధానుల ప్రపోజల్ మాత్రం రావడం లేదు. ఇదే జగన్ గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు రాజధాని నగరం నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరమవుతుందని శాసనసభలో చెప్పారు. ఇప్పుడు 500 ఎకరాలు సరిపోతుందంటున్నారు
విజయసాయిరెడ్డిపై మరో సారి తీవ్ర విమర్శలు
ఇక ఆ మీడియా సమావేశంలో జగన్ మరోసారి విజయసాయిరెడ్డిపై మరో సారి తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సరెండర్ అయ్యారని… రాజ్యసభ సభ్యునిగా మూడున్నర సంవత్సరాలు పదవీకాలం ఉన్నా.. చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆరోపించారు.
జగన్ విమర్శలపై స్పందించి విజయసాయిరెడ్డి
ఆ ఆరోపణలు, విమర్శలపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారనీ, జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆ కౌంటర్ ఉంటుందనీ అంతా భావించారు. అయితే జగన్ విమర్శలపై విజయసాయి అసలు రియాక్ట్ కాలేదు. సోషల్ మీడియాలో కూడా ఎలాంటి కామెంట్ పెట్టలేదు. సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. వ్యవసాయమే తన వ్యాపకం అంటూ ప్రకటించారు . ఆయన రాజకీయ విరమణ ప్రకటించినా.. జగన్ హయాంలో జరిగిన అక్రమాలు, కుంభకోణాలకు సంబంధించిన కేసులు ఆయనను విడిచి పెట్టడం లేదు. వాటి విచారణ నిమిత్తం దర్యాప్తు సంస్థల ముందు హాజరైన సందర్భాలలో విజయసాయి రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ పోర్ట్ కేసులో వైవీ కొడుకుని టార్గెట్ చేసిన సాయిరెడ్డి
కాకినాడ పోర్టు భూముల కేసులో కర్త, కర్మ, క్రియా మొత్తం వైవీ సుబ్బారెడ్డి కుమారుడే అనీ, అలాగే మద్యం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డే సర్వం అని విజయసాయిరెడ్డి ఆయా కేసుల దర్యాప్తులో భాగంగా దర్యాప్తు సంస్థల ముందు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత జగన్ ఆయన్ని విశ్వసనీయత లేని వ్యక్తిగా పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. వాటికి విజయసాయి కూడా అప్పట్లో కౌంటర్ ఇచ్చారు. ఆ తరువాత తాజాగా జగన్ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు.
Also Read: బీఆర్ఎస్‌లో కవితను ఇబ్బంది పెట్టేది వాళ్లేనా?
విజయసాయి తన రాజ్యసభ సభ్యత్వాన్ని అమ్మేసుకున్నారని ఆరోపణలు
కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికి విజయసాయి తన రాజ్యసభ సభ్యత్వాన్ని అమ్మేసుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటికి విజయసాయి నుంచి ఏ స్థాయిలో రిటార్డ్ ఉంటుందా అని అంతా ఎదురు చూస్తుంటే.. విజయసాయి కంటే ముందుగా.. దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు సంచలనం సృష్టిస్తోంది. అలేఖ్యకు విజయసాయి వరుసకు బాబాయ్ అవుతారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సమయంలో నందమూరి, నారా కుటుంబాలు, విజయసాయిరెడ్డి కుటుంబం అలేఖ్యకు అండగా నిలిచాయి.
నమ్మకం, విధేయత, నీతి మీరు చెప్పినవి మాత్రమే కాదు..
విజయసాయిని జగన్ దూరం పెట్టడానికి అది కూడా ఒక కారణమన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు జగన్ ఆయనపై ఆరోపణలు గుప్పించిన గంటల వ్యవధిలోనే అలేఖ్య తన పేస్ బుక్‌లో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఆ పోస్టులో ఆమె పరోక్షంగా టార్గెట్ చేశారు. నమ్మకం, విధేయత, నీతి మీరు చెప్పినవి మాత్రమే కాదు.. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చాలామంది ఊహాగానాలు ప్రచారం చేస్తున్నా… మీరు కూడా వాటి గురించి మాట్లాడటం చూస్తుంటే ఏమవుతుందో అని నేను తరచుగా ఆలోచిస్తుంటానని అలేఖ్య పోస్ట్ చేశారు. జగన్ పదేపదే సాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్న తరుణంలో అలేఖ్య విజయసాయికి మద్దతుగా పెట్టిన పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.