CID investigation on jagan mohan Rao: HCA అక్రమాల కేసులో అరెస్టయిన నిందితులను సీఐడీ కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్ మాల్, శ్రీ చక్రక్లబ్ సభ్యున్నంటూ జగన్మోహన్ రావు సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తీరు సహా ఇతర అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఆయనతో పాటు ట్రెజరర్ శ్రీనివాస్ రావు, CEO సునీల్ కాంటె, శ్రీచక్ర క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, ఆయన భార్య శ్రీ చక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవితను కస్టడీలోనికి తీసుకొని విచారిస్తున్నారు.
రాజేందర్ యాదవ్, కవితల పాత్రపై ప్రశ్నలు..
శ్రీ చక్ర క్రికెట్ క్లబ్‌లో సభ్యున్నంటూ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు, దీంతో సహకరించిన రాజేందర్ యాదవ్, కవితల పాత్రపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొదట తాను క్లబ్ సభ్యున్నేనని జగన్మోహన్ రావు చెప్పినట్లు తెలిసింది. అయితే క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణా యాదవ్ సంతకాన్ని ఎందుకు ఫోర్జరీ చేయాల్సి వచ్చిందని అడిగితే.. మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రాజేందర్ యాదవ్ తో ఏవైనా లావాదేవీలు జరిగాయా అని కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యారు..
ఇక టెండర్లు పిలవకుండా క్రికెట్ బాల్స్ కోసం ఇండియానా స్పోర్ట్స్ సంస్థకు చెల్లించిన కోటి 3 లక్షల రూపాయలపై ఆరా తీసింది. డబ్బు చెల్లించిన తర్వాత ఎన్ని క్రికెట్ బాల్స్ HCAకు అందాయని అడిగినట్లు తెలుస్తోంది. క్లాతింగ్, డ్రెస్ మెటీరియల్ కోసం టెండర్లు పిలువకుండా చేసిన 56 లక్షల 84 వేల రూపాయలు విషయం కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసలు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యారన్న దానిపై కూడా అడిగినట్లు సమాచారం.
హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసే దిశగా సర్కార్ కసరత్తు
మరోవైపు హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి జగన్మోహన్ రావును సస్పెండ్ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. బీసీసీఐకి ఇప్పటికే లేఖ కూడా రాసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో తలెత్తిన వివాదం నేపథ్యంలో విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికను కూడా బీసీసీఐకి పంపింది. ఇక హెచ్‌సీఏ బాడీ మొత్తాన్ని రద్దు చేయాలంటూ బీసీసీఐకి రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొంది.
Also Read: అమెరికా వార్నింగ్.. తప్పు చేస్తే ప్యాకప్ చెప్పాల్సిందే.?
కేటీఆర్, కవితపై సీఐడీకి ఫిర్యాదు
ఇటు మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై సీఐడీకి ఫిర్యాదు చేశారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు. CID అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిసి కంప్లైంట్ చేశారు. HCAలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత ఉన్నారని ఆరోపించారు. ఈ అక్రమాల వెనక మరికొందరు పెద్దలు ఉన్నారని వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది TCA. ఈ మేరకు టీసీఏ ప్రెసిడెంట్ యెండల లక్ష్మీ నారాయణ, సెక్రెటరీ గురువారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు.
HCA అక్రమాలపై రెండో రోజు సీఐడీ విచారణ
HCA అక్రమాలపై రెండో రోజు సీఐడీ విచారణ కొనసాగుతోంది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్‌మాల్‌పై జగన్మోహన్ రావు సహా ఐదుగురు నిందితులను సీఐడీ విచారిస్తోంది. శ్రీ చక్ర క్లబ్ ఏర్పాటు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, IPL టికెట్ల వివాదం, HCA నిధుల గోల్ మాల్‌పై సీఐడీ ప్రశ్నిస్తోంది. శ్రీ చక్ర క్రికెట్ క్లబ్‌లో సభ్యున్నంటూ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు, దీంట్లో సహకరించిన రాజేందర్ యాదవ్, కవితల పాత్రపై నిన్నటి విచారణలో అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. టెండర్లు పిలవకుండా క్రికెట్ బాల్స్ కోసం.. డ్రెస్ మెటీరియల్ కోసం డబ్బులు చెల్లించడంపై కూడా ఆరా తీశారు. అసలు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎలా ఎన్నికయ్యారన్న దానిపై కూడా అడిగినట్లు సమాచారం.
మరోవైపు హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి జగన్మోహన్ రావును సస్పెండ్ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. బీసీసీఐకి ఇప్పటికే లేఖ కూడా రాసింది. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై సీఐడీకి ఫిర్యాదు చేశారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు. CID అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిసి కంప్లైంట్ చేశారు. HCAలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత ఉన్నారని ఆరోపించారు.