Jabardast Pavitra: జబర్దస్త్ పవిత్ర (Jabardast Pavitra).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో లో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈమె.. ప్రస్తుతం సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఫ్యామిలీ స్టార్స్ కార్యక్రమంలో సుధీర్ తో పాటు సందడి చేస్తోంది. అంతేకాదు కెరియర్ ఆరంభంలో షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి, కొన్ని సినిమాలలో కూడా నటించింది. ఇక నిత్యం తన కామెడీతో, అదిరిపోయే పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె జీవితంలో ఎన్నో విషాద గడియలు ముగిసిన విషయం తెలిసిందే. అటు కుటుంబం విషయంలో ఇటు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది పవిత్ర. మనసులో అంత బాధ పెట్టుకున్నా.. బయటకి మాత్రం సంతోషంగా నలుగురిని నవ్విస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
లవ్ లో బ్రేకప్.. స్టేజ్ పై మరొకరు ప్రపోజల్..
ఇదిలా ఉండగా గతంలో పవిత్ర ఒక వ్యక్తిని ప్రేమించి బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే. ఈమె సంతోష్ అనే వ్యక్తిని చాలా ఘాఢంగా ప్రేమించింది. అందరికి తన ప్రియుడు అని పరిచయం చేసింది కూడా.. 2023 నవంబర్లో ప్రియుడు తన వేలికి ఉంగరం పెరుగుతున్న ఫోటోలను షేర్ చేసి.. తమ ప్రేమను ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారని.. త్వరలోనే పెళ్లి కూడా అంటూ సంబరపడిపోయింది. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే పవిత్ర , సంతోష్ విడిపోయారు. 2024 వాలెంటైన్స్ డే రోజు బ్రేకప్ చెప్పుకున్నట్లు స్వయంగా పవిత్ర వెల్లడించింది. ఇక అప్పటినుంచి సింగిల్ గా ఉంటున్న ఈమెకు ఇప్పుడు మరొకరు లవ్ ప్రపోజ్ చేశారు.
స్టేజ్ పైనే పవిత్రకు లవ్ ప్రపోజ్ చేసిన యావర్..
అతను మరెవరో కాదు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ (Prince yawar) పవిత్రకు అందరి ముందే తన ప్రేమ విషయాన్ని వెల్లడించారు. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్ట్స్’ షో కి సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేయగా.. ఈ ప్రోమోలో ప్రిన్స్ యావర్ సందడి చేశారు. ఈ సందర్భంగా స్టేజ్ పై పవిత్రకు ఒక మాట చెప్పాలి అంటూ తెగ సిగ్గు పడిపోయాడు. అయితే అదే సమయంలో ఏం చెప్తాడో ఏంటో అని కంగారు పడ్డ పవిత్ర.. ఏయ్ పిచ్చి లేసిందా.. మా అమ్మ ఇక్కడే ఉంది అని బదులిచ్చింది. అయినా వెనక్కి తగ్గని యావర్ ప్లీజ్ అని బ్రతిమిలాడడంతో.. పవిత్ర నడుచుకుంటూ స్టేజ్ మధ్యలోకి వచ్చింది. దీంతో యావర్ నిజం చెబుతున్నా.. పవిత్ర ఐ లవ్ యు అంటూ ఆమెను ఎత్తుకొని వేదిక అంతా తిప్పాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..
ఇది చూసిన నెటిజన్స్ మాత్రం ఇదొక టిఆర్పి స్టంట్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు టీఆర్పి రేటింగ్ కోసం ఇంత చేయాలా? మీరు చేసినవన్నీ నమ్మడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు.. ఇలాంటి ఎన్నో స్టంట్స్ చూసాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే వీరి ప్రపోజల్ని ఆడియన్స్ నమ్మడం లేదని సమాచారం.
ALSO READ:Film industry: బీచ్ లో లిప్ లాక్ చేస్తూ రెచ్చిపోతున్న మహేష్ బ్యూటీ.. వీడియో వైరల్!
?utm_source=ig_web_copy_link