Intinti Ramayanam Today Episode july 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఇంట్లో అక్షయ్ కనిపించడంతో వీడియో తీస్తుంది. కచ్చితంగా అవని అక్క ఇది అంత చేసింది అని అత్తయ్యకి చెప్తే ఎంత గొడవ చేస్తుందో అర్థమవుతుంది అని పల్లవి వెళ్తూ ఉంటుంది. అవని కారు ఆపి పల్లవి ఈ నిజాన్ని నువ్వు అత్తయ్య చెప్తే నీ గురించి మీ నాన్న గురించి మొత్తం బండారు అని బయట పెట్టాల్సి వస్తుందని బెదిరిస్తుంది. అంతేకాదు నీకు ఒకటి ఇవ్వడం మర్చిపోయానని చంప పగలగొడుతుంది. మీ నాన్న గురించి నీ గురించి బయట పెడితే ఆ తర్వాత మీ నాన్న జైలుకు వెళ్తాడు నువ్వు రోడ్ల పట్టుకుని తిరుగుతావు అని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు నిజం చెప్పాలని చూసావనుకో నీకు ఏం జరుగుతుందో అది జరుగుతుంది అని అవని అంటుంది. పల్లవిని మాట్లాడినవ్వకుండా అవని నోరుని లాక్ చేస్తే వస్తుంది. విషయం చెప్పాలనుకుంటే చెప్పు నీ ఇష్టం అని అంటుంది. అవినీకి అడ్డంగా దొరికిపోయాము. కచ్చితంగా ఈ విషయాన్ని బయటపెట్టి నాన్న నేను ఇదంతా చేశామని తెలుసుకుంటుందని కంగారు పడుతుంది. ఈ విషయం గనుక తెలిస్తే ఇంట్లో నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. పల్లవి శ్రీయాను కొట్టడంతో పార్వతి సీరియస్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి నేను ఇచ్చిన సున్నుండలు తిన్నాడా అని అడుగుతుంది. మొత్తం తిన్నాడు అత్తయ్య అని పల్లవి అంటుంది. ఎలా ఉన్నాయి అంట బాగున్నాయంటా నాని పార్వతి క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తుంది. ఇదంతా ఎందుకు మీరే వీడియో కాల్ చేసి ఒకసారి ఎలా ఉందో అడగండి అని పల్లవి సలహా ఇస్తుంది. ఆ తర్వాత అక్షయ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుందని జూమ్ చేసి ఫోన్ మాట్లాడాలని కాల్ లిఫ్ట్ చేస్తాడు. పార్వతీ అందరితో నార్మల్గానే మాట్లాడుతాడు. ఫోను ఎలాగో మేనేజ్ చేసాడు అని పల్లవి డల్ అవుతుంది. ఇంకా అక్షయ్ హాస్పిటల్ కి వెళ్ళాలని రెడీ అవుతాడు. అవని నేను అందుకే వచ్చాను నేను తీసుకెళ్తాను పదండి అని అంటుంది.
ఇక అవని అక్షయ్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లాలని చెప్పడానికి వస్తుంది. అప్పటికే అక్షయ్ హాస్పిటల్ కి వెళ్ళాలని రెడీ అవుతుంటాడు. నేను తీసుకువెళ్తాను అని అవని అంటుంది.. బయటికి రాదని బండిమీద తీసుకొని వెళ్ళాలి అంటే ఈ బండి మీద నేను రాను అని అక్షయ్ అంటాడు. నాతో పాటు వస్తున్నప్పుడు నా బండి మీద రావడానికి ఏంటి ప్రాబ్లం మీరేం ట్రై చేయొద్దు నేను చేస్తానని అవని అంటుంది. కానీ నువ్వు చేస్తావని నాకు డౌట్ గా ఉంది అని అక్షయ్ అంటాడు. ఏదోలా చేసి అవని అక్షయ్ ఇద్దరు ఒకే బండిమీద బయటికి వస్తారు..
అటు పల్లవి సున్నుండలు అక్షయ్కివ్వకుండా బ్యాగ్ లోనే పెట్టుకుందని కమల్ గమనిస్తాడు. సున్నుండలు బాక్స్ ని తీసుకుని వెళ్లి పల్లవి దగ్గర అడుగుతాడు. అన్నయ్యకి ఇవ్వాల్సిన సున్నుండలు ఇవే కదా. ఎందుకు ఇవ్వలేదు అని అంటుంది. మా ఫ్రెండ్ కనిపిస్తే తనతో మాట్లాడుతూ టైం అయిపోయింది ఇంటికి వచ్చేసాను అని అంటాడు.. అయితే నువ్వు ఎందుకు అబద్దం చెప్పావు అన్నయ్య నీకు సపోర్ట్ చేస్తూ అబద్ధం చెప్పాడా అని కమల్ అడుగుతాడు. నువ్వు చేసిన దానికి నువ్వే బదులు చెప్పాలి ఇప్పుడు ఈ సున్నుండలు తీసుకెళ్లి అమ్మకు ఇస్తే వద్దని చెప్పావని తిడుతుంది.
మొత్తం నువ్వే తిను అని పల్లవిని సున్నుండలు తినేలా చేస్తాడు కమల్.. ఆ తర్వాత పార్వతి వచ్చి మళ్ళీ సున్నుండలు తెచ్చి ఇస్తుంది. ఇవి కూడా తినాలని బలవంతంగా పల్లవి చేత సున్నుండలు తినిపిస్తాడు. కమల్. ఇక పల్లవి పార్వతి ఇద్దరూ కలిసి దగ్గరికి వెళ్లాలని అనుకుంటారు.. పల్లవి కచ్చితంగా అక్షయ్ బావ అవని అక్క దగ్గర ఉన్న విషయాన్ని చెప్పాలి అని అనుకుంటుంది. అంతలోపే అవని అక్షయ్ బండిమీద అలా వెళ్లడం వల్ల మీకు గమనిస్తుంది. ఇతని ఎలాగైనా అత్తయ్య దగ్గర బుక్ చేయాలి అని అనుకుంటుంది. అంత దూరం తీసుకెళ్లి కారుని ఆపుతుంది. బయటకొచ్చిన పార్వతిని అక్షయ్ చూస్తాడు..
Also Raed :మనోజ్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రభావతి.. నిజం తెలుసుకున్న శృతి..
ఆ తర్వాత అవనితో చెప్తాడు. అవని పైట కప్పుకొని అక్షయ్ మేనేజ్ చేయాలని అనుకుంటాడు. అటు ఇటు తిరగడంతో పార్వతి దగ్గరికి వెళ్లి అవని బండి ఆపుతుంది. పార్వతి నన్ను బండిమీద వచ్చి గుద్దేయాలని చూస్తున్నావా అని అడుగుతుంది. బ్రేక్ ఎందుకు వేస్తాను గుద్దేస్తాను కదా అని అవని అంటుంది. ఇద్దరూ మాటలు యుద్ధం మొదలుపెడతారు. పల్లవి అక్షయ బావ దొరికిపోతే బాగుండు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..