E-Paper
Advertisement

Karimnagar district: పత్తాలేని బీఆర్ఎస్‌.. జగిత్యాలలో దిక్కెవరు?

Karimnagar district: పత్తాలేని బీఆర్ఎస్‌.. జగిత్యాలలో దిక్కెవరు?
Advertisement

Karimnagar district: సర్పంచు ఎన్నికలలో బిఅర్ఎస్ జగిత్యాల నియోజకవర్గం లో పత్తాలేకుండా పోయింది.. ఒకప్పుడు గ్రామీణస్థాయి నుండి ఎంతో పటిష్ఠంగా ఉన్న బీఅర్ఎస్ ఇప్పుడు మాత్రం సర్పంచు ఎన్నికలలో కనీస పోటి ఇవ్వకుండా చేతులెత్తేసే పరిస్థితికొచ్చిందిది…రెండో విడత సర్పంచు ఎన్నికలలో వచ్చిన ఫలితాలు నిజంగా గులాబీపార్టీకి పెద్ద షాక్ ఇచ్చాయంట…ఇప్పుడు ఈ ఓటమికి అక్కడ ఎవరు బాధ్యులు? .. జగిత్యాల నియోజకవర్గంలో బీఅర్ఎస్ ఎందుకు అంతలా ఢీలా పడిపోయింది?

జగిత్యాలతో గులాబీ పార్టీని పటిష్టంగా తయారు చేసిన కవిత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గం ఒకప్పుడు బీఅర్ఎస్‌కి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం.. బీఅర్ఎస్ అధికారంలోకి వచ్చాక అక్కడ ఆ పార్టీకి కాంగ్రెస్ కనీసం పోటీ ఇవ్వలేక పోయింది. అప్పుడు ఎంపిగా ఉన్న కవిత జగిత్యాల జిల్లాపై పూర్తి గా పట్టు సాధించి గులాబీ పార్టీ పాగా వేసేలా ప్రణాళికలు రూపోందించారు.. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించాక మొదటిసారి జరిగిన ఎన్నికలలో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచారు.. కాంగ్రెస్ కురు వృధ్ధుడుగా ఉన్న జీవన్ రెడ్డి ని రెండవసారి ఖచ్చితంగా ఓడిస్తామని అప్పట్లో కవిత శపధం చేసి మరి ఓడించారు…

కవిత జైలుపాలై.. కాంగ్రెస్ బాట పట్టిన సంజీవ్‌కుమార్

Advertisement

జీవన్ రెడ్టి కి వ్యతిరేకంగా జగిత్యాల నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ కుమార్ ని నిలబెట్టి మరి కవిత గెలిపించారు.. ఈ క్రెడిట్ అప్పట్లో కవితకే దక్కిందని చెప్పవచ్చు….సంజయ్ కుమార్ మళ్ళీ తిరిగి రెండవసారి గెలిపించడానికి కూడా కవిత పాటుపడి, నియోజకవర్గంలో బీఅర్ఎస్‌పి గ్రామీణస్థాయి నుండి పటిష్ఠంగా తయారు చేశారు. అయితే ఎమ్మెల్యే ఎన్నికల నుండి ఎంపి ఎలక్షన్స్ కి వచ్చేసరికి పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి .. ఎమ్మెల్సీ గా ఉన్న కవిత లిక్కర్ స్కాం లో అరోపణలు ఎదుర్కోవడం…జైలుకి వెళ్ళడంతో పాటుగా అదే సమయంలో జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా‌ ఉన్న డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి చెయ్యడం తో ఇక్కడ బిఅర్ఎస్ రానురాను పట్టు కోల్పోవుతూ వచ్చింది.

సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్

జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి అంటేనే‌ కాంగ్రెస్…. కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అన్నట్లు ఉండేది…. ఆలాంటి జీవన్ రెడ్డికి జగిత్యాల నియోజకవర్గం తో పాటుగా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలలో గట్టి పట్టు ఉన్నా బీఅర్ఎస్ అధికారంలోకి వచ్చాక రానురాను కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయి బీఅర్ఎస్ పుంజుకొంది.. గత ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు మెజారిటీ సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా బిఅర్ఎస్ బలపరిచిన వారే ఉండేవారు .. కాని న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లోకి రావడం… జగిత్యాల నుండి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తుండటంతో రెండు సంవత్సరాలలోనే బీఅర్ఎస్ జగిత్యాలో చతికిల పడిపోయింది …ఇప్పుడు జరిగిన సర్పంచు ఎన్నికలలో మెజారిటీ ‌స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు.

కాంగ్రెస్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయిన గులాబీపార్టీ

Advertisement

సర్పంచు ఎన్నికలు జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్లో నాయకత్వ లోపాన్ని ఎత్తిచూపాయి…అధికార కాంగ్రెస్ పార్టీకి కనీసం పోటీ ఇవ్వలేక పోయింది బీఅర్ఎస్.. మొత్తం గా ఇక్కడ జరిగిన రెండు విడతల సర్పంచు ఎన్నికలలో కాంగ్రెస్ ‌పార్టీ నియోజకవర్గం లో అత్యధిక స్థానాలు గెలుచుకుంది…133 గ్రామాలలో రెండవ విడత లో ఎన్నికలు జరుగగా 101 స్థానాలలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించారు..ఇక్కడ బీఅర్ఎస్ కనీస పోటీ ఇవ్వలేక పోయింది….. మెజారిటీ గ్రామాలలో పోటీ చేసిన అభ్యర్థులలో కాంగ్రెస్ పార్టీ వారే ఒకరిపై ఒకరూ పొటి పడ్డారు…ఇక్కడ మొదటినుండి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నా జీవన్ రెడ్డి, ఇటివల గెలిచి కాంగ్రెస్ పార్టీతో నడుస్తున్న సంజయ్ కుమార్ ల అనుచరులే గ్రామాలలో పోటీ పడ్ఠారు…అయినా బీఅర్ఎస్ కేవలం 18 స్థానాలకే పరిమితం అయింది….

జగిత్యాల నియోజకవర్గంలో 13 స్థానాలలో గెలిచిన బీజేపీ

ఒకప్పుడు పత్తాలేని బీజేపీ జగిత్యాల నియోజకవర్గంలో 13 స్థానాలలో గెలిచింది….101 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచారంటే కాంగ్రెస్ ఇక్కడ ఎంత బలపడి బీఅర్ఎస్ ఎంత బలహీన పడిందో అర్థం చేసుకోవచ్చు….ఇప్పుడు గత పదేళ్ల నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా , పార్టీ ఇంచార్జ్ గా డాక్టర్ సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌తో కలిసి నడవడంతో బీఅర్ఎస్‌కి కనీసం దిశనిర్ధాశం చేసే నాయకుడు లేకపోయారు…ఆ ప్రభావమే ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గం సర్పంచ్ ఎన్నికలపై పడిందని చెప్పుకోవచ్చు..

కవిత పార్టీ‌నుండి వెళ్ళిపోవడం, ఇన్చార్జ్‌గా‌ ఉన్న సంజయ్ కాంగ్రెస్ తో కలిసి నడవడం ఖచ్చితంగా సర్పంచు ఎన్నికలలో ప్రభావం చూపింది…ఇప్పటికీ జగిత్యాల నియోజకవర్గంలో ఇన్చార్జ్‌ని ప్రకటించకపోవడం, కవిత సొంత పార్టీపైనే తిరుగుబాటు బావుటా ఎగరవేస్తుండటంతో బీఆర్ఎస్‌ని పట్టించుకునే వారు లేకుండాపోయారంటున్నారు.

Story by Ramireddy, Big Tv 

 

Related News

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!

లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!

Big Stories

Advertisement
×