Palakollu Janasena Plan: గోదావరి జిల్లాలో జనసేన జోరు ఊపు మీద ఉంది.. కూటమి భాగస్వా అధికామిగా అధికారంలో ఉండటంతో జనసైనికులు సైతం వినూత్న కార్యక్రమాలతో ప్రజలలోకి వెళ్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో జన సైనికులు పోరాటపటిమతో ముందుకు సాగుతుంటే పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం పార్టీకి నాయకత్వం లేక గల్లంతయ్యి పరిస్థితికి చేరుకుంటుంది.. జనసేన పార్టీ బలంగా ఉన్న పాలకొల్లులో కూడా నేతల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అక్కడ జనసైనికులకు ఎదురువుతోంది.. క్యాడర్ ఫుల్ గా ఉన్న నాయకులు ఎందుకు ముందుకు రావడం లేదు ?? జనసేన పార్టీకి ఆ పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటి ?
కాపు ఓటర్లు గణనీయంగా ఉన్న చిరంజీవికి తప్పని ఓటమి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా పలు రంగాల వారికి సుపరిచితమైంది. ఎంతో మంది రంగస్థలం కలకారులు సీని ప్రముఖులు పాలకొల్లు నుంచి వచ్చినవారే. అటువంటి పాలకొల్లు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలికి సొంత నియోజకవర్గం. పాలకొల్లు నుంచి ప్రజారాజ్యం అధ్యక్షుడి హోదాలో చీరంజివి 2009 ఎన్నిలకల్లో పోటి చేయడంతో యావత్ ప్రపంచంలోని తెలుగువారి దృష్టిని పాలకొల్లు ఆకర్శించింది. ఆ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓటర్లు గణనీయంగా ఉన్న అప్పటికే మెగా బ్రడదర్ ఒటమి పాలయ్యారు.
రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న జనసేనాని పవన్
అప్పట్లో చిరంజీవి పొలిటికల్ ఫెయిల్యూర్ చరిత్ర చూసిన ప్రస్తుతం డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది. సొంత సామాజిక ఓటర్లు మెజార్టీ వర్గంగా ఉండటంతో జనసేనా పార్టీ కోసం కష్టపడుతూ తమ పార్టీని బలోపేతం చేసేందుకు ఆహార్ణిషలు కష్టపడుతూంటారు పాలకొల్లు జనసైనికులు.. కూటమి ప్రభుత్వంలో జనసేన ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికి పాలకొల్లు నియోజకవర్గం మాత్రం జనసేన పార్టీకి నియోజకవర్గ ఇన్చార్జ్ కూడా లేకపోవడం.. కార్యకర్తలు ఉన్నప్పటికి వాటికి అండగా ఉండే నాయకులు లేకపోవడం వల్ల జనసేన పార్టీ నియోజకవర్గంలో కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పవన్ పాలకొల్లును ఎందుకు పట్టించుకోవడం లేదు?
పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ బలంగా ఉన్నప్పటికి అధికార కూటమిలో ఉన్న జనసేన పార్టీ ఎందుకు బలపడలేకపోతుంది.. దానికి కారణాలు ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? అనే ప్రశ్నలు జనసైనికుల్లో తలెత్తుతున్నాయి. 2019లో పాలకొల్లు నియోజవర్గం నుంచి జనసేన పార్టీ తరపున గుణ్ణం నాగబాబు పోటి చేసి 33 వేల ఓట్లను దక్కించుకున్నారు. వాస్తావానికి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే నాగబాబు జనసేన టికెట్ తెచ్చుకోవడంతో ఓటింగ్ సరళి కొంత మైనస్ అయ్యాయని చెప్పుకోవచ్చు.. అయితే 2021 గుణ్ణం నాగబాబు జనసేన పార్టీ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి జనసేన పార్టీకి నియోజకవర్గంలో దిక్కుమోక్కు లేకుండా పోయింది.
పాలకొల్లుకు చెందిన సీని నిర్మాత బన్ని వాసు
పాలకొల్లుకు చెందిన బన్ని వాసు సీని నిర్మాత కావడంతో పాటుగా మెగా ఫ్యామిలీ మీద ఉన్న అనుబంధంతో జనసేన పార్టీ కార్యకలాపాలు చూసుకోవడానికి ముందుకు వచ్చారు. అయితే అయిన ఏదో మోక్కుబడిగా కాళీగా ఉన్న సమాయాల్లో మాత్రమే పాలకొల్లు వస్తున్న నేపథ్యంలో జనసేనను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. చివరకు పాలకొల్లులో జనసేన పార్టీకి కార్యలయం కూడా లేకపోవడం చూస్తుంటే.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎంత దిగజారి ఉందో చెప్పవచ్చని పార్టీ శ్రేణులు అంటున్నాయి. పార్టీని నియోజకవర్గంలో నడిపించే నాయకుడు లేనప్పుడు 10 వేలకు పైగానే క్రియాశీలక సభ్యత్వాలు జయించినట్లు జనసైనికులు చెబుతున్నారు.
Also Read: HCA కేసులో నేటితో ముగియనున్న సీఐడీ కస్టడీ
పాలకొల్లు నియోజకవర్గంలో ఇతర రాజకీయ పార్టీలు కనుమరుగు చేస్తూ మంత్రి తుమ్మల రామానాయుడు తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ముందుకు దూసుకుపోతున్నారు. 2014 ఎన్నికల నాటి నుంచి గెలుస్తూ హ్యాట్రిక్ ఎమ్ఎల్ఎగా ప్రస్తుతం రామానాయుడు కొనసాగుతున్నారు. వాస్తవానికి పాలకొల్లు ముందునుంచి టీడీపీకి కంచుకోటే అని చెప్పాలి. టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడ కాంగ్రెస్ రెండు సార్లు మాత్రమే గెలిచింది. వైసీపీ ఇంతవరకు కాతా ఓపెన్ చేయలేకపోయింది.
Story By KLN, Bigtv