E-Paper
Advertisement

మార్కెట్లో సంచులు మోసేవాన్ని – ఈశ్వర్ సాయి బ్యాక్ గ్రౌండ్ ఇదే

మార్కెట్లో సంచులు మోసేవాన్ని – ఈశ్వర్ సాయి  బ్యాక్ గ్రౌండ్ ఇదే
Advertisement

Eshwar Sai : ఈశ్వర్ సాయి ..ఈశ్వర్ సాయి ..ఈశ్వర్ సాయి ..ఈ పేరునే ఇపుడు రెండు రాష్ట్రాల నెటిజన్లు తెగ స్మరిస్తున్నారు.ఫోక్ ఇండస్ట్రీలో పలు పాపులర్ సాంగ్స్ చేసి ఎంతో ఫ్యాన్ బేస్ ని మూటగట్టుకున్న ఈశ్వర్ సాయి వేసిన ఒక్క తప్పటడుగు అతని లైఫ్ ని గందరగోళంలోకి నెట్టేసింది.

ఇక మాధురి రాథోడ్ తో పట్టుబడి గత మూడు రోజులుగా అజ్ఞాతవాసంలో ఉండి ఈరోజే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈశ్వర్ సాయి తను ఎలా కష్టపడ్డాడో పలు ఆసక్తికరమైన సంఘటనలని చెప్పుకొచ్చాడు.

రెండు వందల కూలీకి కూడా మూటలు

Advertisement

తనది గుంటూరు అని, తమది వెరీ వెరీ పూర్ ఫ్యామిలీ అని తెలిపాడు.ఇంట్లో అమ్మ ఇడ్లీ, వడ,దోశ చేసి ఇస్తే అవి రెండు సంచుల్లో పెట్టుకుని, గుంటూరు మార్కెట్లో అమ్మేవాడినని తన కష్టాలని ఏకరువు పెట్టాడు. ఇక మార్కెట్లో రెండు వందల కూలీకి కూడా మూటలు మోయడానికి వెళ్ళేవాడినని బాధ పడిపోయాడు.

also read :మాధురి రాథోడ్ చేసిన పాపులర్ ఫోక్ సాంగ్స్ ఇవే !

Advertisement

అలా నైట్ పూట మూటలు మోయడానికి వెళ్తూనే ఉదయం పూట కాలేజీకి వెళ్ళేవాడినని చెప్పుకొచ్చాడు. ఇక చిన్నప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడేవాడినని, అలా తనకి ఫిట్ నెస్ పై ఉన్న ఇష్టం ఉండటంతో ఫిట్ నెస్ ట్రైనర్ గా అవకాశం వచ్చిందని తెలిపాడు. అలా మొదటి సారి తను అందుకున్న నెల జీతం 4000 రూపాయలని పేర్కొన్నాడు.

హైదరాబాద్ లో మోడలింగ్ 

ఇక గుంటూర్ లో జిమ్ ట్రైనర్ గా చేస్తునప్పుడే డబ్ స్మాష్ లు తెగ చేసేవాడినని,అప్పుడే మ్యూజిక్ రీల్స్ అలవాటు అయ్యాయని తెలిపాడు.ఇక నటన అంటే ఇష్టం ఉండటంతో గుంటూరులో షార్ట్ ఫిలిమ్స్ చేసేవారి వద్ద కాళ్ళా వెళ్ళా పడి ఒక అవకాశం ఇవ్వమని ప్రాదేయపడ్డానని కానీ ఎవరూ అవకాశం ఇవ్వలేదని వాపోయాడు.ఇక అక్కడి నుండి విజయవాడకి షిఫ్ట్ అయ్యానని అక్కడ ఫిట్ నెస్ ట్రైనర్ గా పని చేస్తూనే వీకెండ్ లలో హైదరాబాద్ కి వచ్చి మోడలింగ్ చేసేవాడినని అని చెప్పుకొచ్చాడు .

ఇక చాలా పెజెంట్స్ కి మోడల్ గా వర్క్ చేశానని, ఇక మిస్టర్ తెలంగాణా, మిస్టర్ ఆంద్రా వంటి ఎన్నో టైటిల్స్ నెగ్గానని అలాగే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ గా, మోస్ట్ స్టైలిష్ మోడల్ గా అనేక అవార్డులు దక్కించుకున్నానని ఆనాటి విషయాలని బయటపెట్టాడు.

సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా 

ఇక తన భార్య శరణ్య సపోర్ట్ తీసుకునే హైదరాబాద్ కి షిఫ్ట్ అవడం జరిగింది అని,ఇక ఇక్కడ ఎలాంటి జాబ్ లేని సమయంలో తన భార్యే తనని ఆదుకుందని తెలిపాడు.అలా మెల్లిగా ఆఫీసుల చుట్టూ తిరగడం, అందరి కాళ్ళా వేళ్ళా పడటం కామన్ అయిపోయిందని కానీ ఎవరూ అవకాశం ఇవ్వలేదని బాధ పడిపోయాడు.

also read :ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ తో రిలేషన్ ఎప్పటినుండో తెలుసా ?

ఇక రోజుకి వెయ్యి రూపాయలకి జూనియర్ ఆర్టిస్ట్ గా, బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేశానని,ఇక ఆ తర్వాత సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశానని తెలిపాడు.అలా మెల్లిగా ఇంస్టా లో రీల్స్ చేయడంతోనే తనకి ఫోక్ సాంగ్స్ లో అవకాశం వచ్చిందని తెలిపాడు ఈశ్వర్ సాయి.

Tags

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×