EPAPER

Kolkata Rape Case: కోల్ కతా అత్యాచారం కేసు అటాప్సీ రిపోర్ట్.. ఇంత నీచుడా.. అసలు ఎవడీ సంజయ్ రాయ్?

Kolkata Rape Case: కోల్ కతా అత్యాచారం కేసు అటాప్సీ రిపోర్ట్.. ఇంత నీచుడా.. అసలు ఎవడీ సంజయ్ రాయ్?

Kolkata Rape Case: కోల్‌కతా రేప్ కేస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని గురించే చర్చించుకుంటున్నారు. చర్చించాలి కూడా.. ఎందుకంటే అత్యంత దారుణమైన ఘటన ఇది. ఓ ట్రైనీ డాక్టర్‌ను అత్యంత అమానుషంగా రేప్‌ చేసి చంపడం. అమానుషమంటే మాములుగా కాదు. చిత్రవధ చేసి.. అత్యంత తీవ్రంగా హింసించి చంపడం. అది కూడా హస్పిటల్‌లోనే ఈ దారుణం జరగడం. ఈ ఘటన ఓ రకంగా మేలుకొలుపు లాంటిది. మనుషుల్లో ఉన్న మృగాళ్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే ఘటన ఇది.


కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్ అండ్ హాస్పిటల్‌. ఆగస్టు 9 తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య జరిగింది ఈ ఘటన. సెమినార్‌ హాల్‌లో చదువుకుకొని అక్కడే నిద్రిస్తుంది ఓ ట్రైనీ డాక్టర్.
ఆ సమయంలో అటువైపు వచ్చాడు సంజయ్‌ రాయ్‌ అనే నరరూప రాక్షసుడు. నిద్రిస్తున్న ఆ ట్రైనీ డాక్టర్‌పై తన ప్రతాపాన్ని చూపాడు. ఆమెను చిత్రవధ చేసి అత్యాచారం చేసి చంపాడు. తెల్లారిన తర్వాత కానీ ఆమె చనిపోయిన విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. ఈ ఘటన తర్వాత కోల్‌కతా మాత్రమే కాదు. బెంగాల్‌ మొత్తం అట్టుడికి పోయింది. నాట్ ఓన్లీ బెంగాల్‌ మొత్తం దేశమే ఈ ఘటన గురించి తెలుసుకొని షాక్‌ అయ్యింది.

మృతురాలి అటాప్సీ రిపోర్ట్‌ చూస్తే మైండ్‌ బ్లాక్‌ అవ్వడం ఖాయం. నాలుగు పేజీల రిపోర్ట్‌లో ఒక్కొక్క లైన్‌ చదువుతుంటే ఒళ్లు గగుర్పాటుకు గురైందంటున్నారు పోలీసులు. ఒక్కొక్క విషయం చూస్తుంటే అసలు వాడు మనిషేనా? అనిపిస్తుంది. నిజానికి ఇది చెప్పడం భావ్యం కాదు. కానీ మనుషుల్లో పైశాచిక ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి చెబుతున్నాం. మృతురాలి మెడ విరిగిపోయింది. కడుపు, పెదవులు, చేతి వేళ్లు, ఎడమ కాలిపై తీవ్ర గాయాలయయ్యాయి.


Also Read: సీబీఐకి కలకత్తా వైద్యురాలి కేసు.. 3 వారాల్లోగా నివేదిక ఇవ్వాలన్న కోర్టు

ఆమె అరిస్తే ఎక్కడ దొరికిపోతానన్న భయంతో.. ఆమెను గోడకేసి గట్టిగా నొక్కి పట్టి.. ఆమె ముక్కు, గొంతును గట్టిగా బిగించిపట్టుకున్నాడు. ముఖాన్ని గోడకేసి గట్టిగా కొట్టాడు. ఈ టైమ్‌లో ఆమె మొఖంపై కూడా గాయాలయ్యాయి. ఆఖరికి కళ్లపై కూడా గాయాలున్నాయి. ఇక ప్రైవేట్‌ పార్ట్స్‌, కళ్లు, గొంతు నుంచి కూడా రక్తస్రావమైంది. ఇవన్నీ చెబుతున్న మాకైతే రక్తం మరిగిపోతుంది. అసలు వాడు మనిషేనా? అని మీకు అనాలనిపిస్తుందా? ఇంకో దారుణమైన విషయం ఏంటంటే.. ఆమె చనిపోయిన తర్వాత కూడా అత్యాచారం చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇవన్నీ విన్న తర్వాత ఆ అమ్మాయిని ఇంత చిత్రవధ చేసి చంపిన వాడు దొరికితే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా? ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కాబట్టే.. కోల్‌కతాలో రగులుకున్న జ్వాలలు ఇంకా చల్లారడం లేదు.

ఇన్ని దారుణాలకు పాల్పడింది సంజయ్‌రాయ్ అని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. అయితే ఈ దారుణంలో ఉన్నది రాయ్‌ ఒక్కడేనా..? లేక ఇంకేవరైనా ఉన్నారా? అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ బ్లూ టూత్‌ హెడ్‌సెట్‌ కారణంగా సంజయ్‌ రాయ్‌ దొరికాడు. హాస్పిటల్‌కు వచ్చేప్పుడు అతని మెడలో ఉన్న బ్లూటూత్‌ హెడ్‌సెట్‌.. వెళ్లేప్పుడు లేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతని ఇంటికి వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులు రక్తపు మరకలు ఉన్న బట్టలను పిండినట్టు గుర్తించారు. అంతేకాదు అతని షూస్‌పై ఉన్న రక్తపు మరకలు మాత్రం అలానే ఉన్నాయి. ఆ బట్టలు పిండటం కూడా వెంటనే చేయలేదు. ఇంత దారుణం చేశాక ఇంటికి వెళ్లి హాయిగా పడుకున్నాడు. ఆ తర్వాత నిద్రలేచి బట్టలు పిండే సమయానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

అసలింతకు ఎవరీ సంజయ్‌ రాయ్? అసలు హాస్పిటల్‌లో అతనికేం పని? సంజయ్‌ రాయ్‌ అనేవాడు ఓ కాంట్రాక్ట్ ఎంప్లాయి. అంతకుముందు ట్రాఫిక్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో వాలంటీర్‌గా చేశాడు. ఆ తర్వాత కోల్‌కతా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సివిల్ వాలంటీర్‌గా చేశాడు. ఆర్‌జీ కార్‌ మెడికల్ కాలేజ్‌ వద్ద ఉన్న పోలీస్‌ ఔట్‌పోస్ట్‌లో పనిచేసేవాడు. మనోడు రెగ్యులర్‌ పోలీస్‌ కాకపోయినా.. పరపతి మాత్రం మాములుగా లేదని తెలుస్తుంది. ఇదే వాడి పని. ఇక పర్సనల్ విషయానికి వస్తే.. సంజయ్‌కు నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురు భార్యలు వీడితో వేగలేమని వదిలేశారు. నాలుగో భార్య.. క్యాన్సర్‌తో చనిపోయింది.

Also Read: దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె.. కోల్‌కతా మర్డర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన

పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్‌ స్టార్ట్ చేయగానే మొత్తం కక్కేశాడు. ఈ దారుణానికి పాల్పడింది నేనే.. కావాలంటే ఉరి తీసుకొండి అని చెబుతున్నాడు. అంతేకానీ.. చేసిన పనికి ఏమాత్రం పశ్చాతాపం పడటం లేదు. అంతేకాదు.. విచారణలో భాగంగా అతడి ఫోన్‌ను సీజ్‌ చేసి పరిశీలించిన పోలీసుల దిమ్మ తిరిగిపోయింది. ఫోన్‌ నిండా పోర్న్ వీడియోసే ఉన్నాయని గుర్తించారు. అంతేకాదు.. సంజయ్ పెద్ద womanaiser అని తేల్చారు.

సంజయ్‌ ఏళ్లుగా అక్కడే పని చేస్తున్నాడు. అందరి మధ్య మంచితనం ముసుగేసుకొని చక్కర్లు కొట్టాడు. అతనిలో ఉన్న ఈ మృగవాంఛను ఎవరూ గుర్తించకుండా జాగ్రత్త పడ్డాడు. అదునుచూసి అత్యంత పైశాచికంగా దాడి చేశాడు. ఇలాంటి వారు మన మధ్య కూడా తిరుగుతుంటారు. సో కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక హాస్పిటల్‌లోనే ఇలాంటి ఘటన జరగడం.. అక్కడి సెక్యూరిటీ అంశాలపై కూడా కొత్త డౌట్స్‌ను రేకెత్తించింది.

Also Read: కలకత్తా వైద్యురాలి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

కోల్ కతా లాంటి మహానగరంలో అంతమంది అంటే.. రోగులు, డాక్టర్లు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్.. ఇలా వందలాది మంది తిరిగే చోటున ఇలాంటి ఘటన జరగడం అత్యంత దారుణమనే చెప్పాలి. పనిచేసే చోట.. ఉండే చోట.. ఎక్కడా రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు. మరి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక్క మమతా బెనర్జీ సర్కార్‌కే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న పాలకులందరికీ ఉంది. ఇప్పటికే ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించింది కోల్ కతా హైకోర్టు. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలంది. విచారణ సంగతి పక్కన పెడితే.. ఇలాంటి ఘటన మన మధ్య జరగదన్న గ్యారెంటీ అయితే లేదు. సో.. అమ్మాయిలూ.. ఆల్వేస్ బీ కేర్ ఫుల్.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×