Congress: తెలంగాణ రాజకీయాల్లో బ్రదర్స్ అనగానే గుర్తుకు వచ్చేది కోమటిరెడ్డి బ్రదర్స్.. అలాంటి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా?..అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి .. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమంటున్నారు. ఆ క్రమంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఇద్దరి మధ్య భేదభిప్రాయాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.. అన్న పై తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి నారాజ్‌గా ఉన్నారంట .. ఇంతకీ బ్రాండ్ బ్రదర్స్ మధ్య ఏం జరుగుతుంది?
నల్గొండ జల్లా కాంగ్రెస్‌లో బ్రాండ్ సృష్టించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్
కోమటిరెడ్డి బ్రదర్స్..నల్గొండ జిల్లా రాజకీయాల్లో అదొక బ్రాండ్ అని అందరూ అంటుంటారు. ఇప్పుడు ఆ బ్రాండ్ లేదు ఏమి లేదు.. అంతా వారికి వారే చెడగొట్టుంటున్నారన్న చర్చ మొదలైందట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గం నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి పదవిలో ఉన్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచారు మంత్రి పదవి ఆశిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఒకటికి రెండు సార్లు హామీ ఇచ్చినా అది నెరవేరలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రకరకాల లెక్కలతో అనుకున్నట్లు మంత్రి వర్గ విస్తరణ లో రాజగోపాల్ రెడ్డి కి చోటు దక్కాలేదు.
కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజగోపాల్‌రెడ్డి
ఆ క్రమంలో రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కొన్ని కామెంట్స్‌పై డైరెక్ట్‌గానే నోరు విప్పి తప్పు పడుతున్నారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వచ్చే పదేళ్లు రేవంత్‌రెడ్డే సీఎం అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం తానే 10 ఏళ్లు సీఎం అని ధీమా వ్యక్తం చేశారు. దానిపై రియాక్ట్ అయిన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, సీఎంలను నిర్ణయించేది హైకమాండ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవలే యూట్యూబ్ జర్నలిస్ట్‌పై సీఎం అగ్రిస్సివ్ గా మాట్లాడారు. దాన్ని సైతం రాజగోపాల్ తప్పు పట్టారు. బాష తీరు మార్చుకోవాలని, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలని సెటైర్లు విసిరారు. అలాగే మంత్రి పదవిపై కూడా తనకంటే జూనియర్‌లకు అవకాశాలు వస్తున్నాయని ఫైర్ అయ్యారు
భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ
అయితే పార్లమెంట్ ఎన్నికలో భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్‌రెడ్డికి హామీ ఇచ్చినట్లు ఆయన వర్గీయులు ఎత్తి చూపిస్తున్నారు. కానీ సామజిక సమీకరణలు దృష్ట్యా ఉమ్మడి నల్లగొండ జిలాల్లో ఇప్పటికే ఇద్దరు రెడ్లు కాబినెట్ లో ఉన్నారు.. అదే జిల్లాలో మూడో మినిస్టర్ కూడా అదే సామజికవర్గం… అలాగే ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతలు పోతాయానే ఆలోచనలో పార్టీ, ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనా?
ఇక ఇటీవలే రాజగోపాల్ చేస్తున్న కామెంట్స్‌పై సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందిస్తూ… అది పార్టీ నిర్ణయం, తన మంత్రి పదవికి సోదరుడి మంత్రి పదవికి లింక్ ఏమి లేదు అంటున్నారు.. ఇక్కడి వరకు ఓకే కానీ మరోసారి సీఎంగా రేవంత్ రెడ్డి అవ్వాలని పూజ చేయిస్తానని అన్నారు. దాని పై రాజగోపాల్ రెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన చెందారట. ఏమైంది అన్నకు ఎందుకిలా మాట్లాడుతున్నారు.. మొన్నటివరకు అన్న పై ఎంతో నమ్మకం, ప్రేమ ఉండేదని, ఇక అన్న మీద ఉన్న గౌరవం పోయింది అన్నట్లుగా మాట్లాడిన్నట్లు సన్నిహితులు అంటున్నారు. ఒకే ఇంట్లో ఒకరు సిఎం ని విమర్శిస్తుంటే మరొక్కరు నెక్స్ట్ సిఎం కూడా రేవంతే కావాలని పూజ చేయిస్తానని మాట్లాడడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ మొదలైంది.
Also Read: గంట కడితే కోర్కెలు తీర్చే గణపతి.. ఎక్కడో తెలుసా?
అన్నదమ్ముళ్ల మధ్య మొదలైన కాంగ్రెస్ పంచాయితీ
రేవంత్ రెడ్డి సిఎం అవ్వకముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్‌ని పెద్ద స్థాయిలోనే వ్యతిరేకించారు.. డబ్బులచ్చి పదవి కొనుక్కున్నారని అనేక మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. ఆ టైమ్‌లోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక గత ఎన్నికల సమయంలో మళ్ళీ హస్తం గూటికి చేరారు. ఇక కోమటిరెడ్ట్ వెంకటరెడ్డి అప్పట్లో పీసీసీ పదవి పై ఆశలు పెట్టుకున్నారు..కానీ దక్కకపోవడంతో మొదట్లో రేవంత్‌ని వ్యతిరేకించినా… తర్వాత సర్దుకొని పోతున్నారు. కానీ ఇప్పుడు పంచాయితీ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కి మరినట్లు పార్టీ వర్గాలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ లేదు ఏమి లేదు అంటూ రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు మరి అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిణామాలకు.. దారి తీస్తాయో చూడాలి.
Story By rami Reddy, Bigtv