E-Paper
Advertisement

భట్టి విక్రమార్కతో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భేటీ.. వేటు పడినట్టేనా..!

భట్టి విక్రమార్కతో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భేటీ.. వేటు పడినట్టేనా..!
Advertisement

Konda Surekha: ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో.. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి భేటీ అయ్యారు. ఆసమయంలోనే భట్టి దగ్గరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వచ్చారు. భట్టి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమక్షంలో వేర్వేరుగా జరిగిన భేటీలు పొలిటికల్ హీట్ పెంచాయి.

సురేఖపై వేటు తప్పదా..?

ఇక్కడే అసలు సస్పెన్స్ మొదలైంది. కొండా సురేఖ పార్టీ నియమావళిని ఉల్లంఘించడం ఇది మూడోసారి అని.. చిన్నారెడ్డి కూడా హద్దులు దాటి మాట్లాడారని పీసీసీకి కాంగ్రెస్ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ.. నివేదిక ఇచ్చింది. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని DAC సూచించడంతో కొండా సురేఖపై వేటు తప్పదా..? అన్న చర్చ ఊపందుకుంది. సరిగ్గా ఇదే సమయంలో కొండా మురళి.. భట్టి విక్రమార్కను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు కొండా మురళి. గాంధీ కుటుంబంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని క్లారిటీ ఇచ్చారు కొండా మురళి.

Advertisement

Also read: మహిళల దుస్తులపై తీర్పులు.. ఆ దుస్తుల్లో రాఖీ కట్టడం ఏంటని కంగనా ఫైర్!

గతంలో పార్టీకి..

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకుంటే.. గతంలో పార్టీకి ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్‌రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రావొచ్చన్న ప్రచారం ఉంది. మరి అందుకే ముందస్తుగా భట్టిని రాజగోపాల్‌ రెడ్డి కలిసి తన వాదన వినిపించారా..? అని చర్చ మొదలైంది. అయితే.. రాజగోపాల్‌రెడ్డి మాత్రం రాజకీయ భేటీ కాదని క్లారిటీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు, అభివృద్ధి పనుల గురించే భట్టితో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ నివేదిక.. మరోవైపు నేతల వరుస భేటీలు.. ఇంకోవైపు అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూపులు. కాంగ్రెస్‌లో యాక్షన్ ఎప్పుడు మొదలవుతుందన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్.

Advertisement

Also read: నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×