E-Paper
Advertisement

మాటల వరకే ప్రేమ, అవసరమైనప్పుడు దూరం.. సీగలింగ్ డేటింగ్‌తో జాగ్రత్త

మాటల వరకే ప్రేమ, అవసరమైనప్పుడు దూరం.. సీగలింగ్ డేటింగ్‌తో జాగ్రత్త
Advertisement

Seagull Dating| మోడ్రన్ డేటింగ్‌లో కొత్త కొత్త పదాలు, ట్రెండ్స్ తరచుగా వినిపిస్తున్నాయి. ఘోస్టింగ్, బ్రెడ్‌క్రంబింగ్, సిచ్యుయేషన్‌షిప్, పేపర్‌క్లిప్పింగ్ వంటి పదాలు ఇప్పటికే ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు సీగలింగ్ డేటింగ్ అనే మరో కొత్త పదం చర్చలోకి వచ్చింది. ఈ ట్రెండ్‌లో ఒక వ్యక్తి రిలేషన్‌షిప్‌పై స్పష్టమైన కమిట్‌మెంట్ ఇవ్వకుండా, ఎదుటివారి జీవితంలో మాత్రం కొనసాగుతుంటారు. అప్పుడప్పుడు ప్రేమ, శ్రద్ధ చూపిస్తూ మళ్లీ కొంత సమయం దూరంగా ఉంటారు. దీనివల్ల ఎదుటి వ్యక్తికి గందరగోళం, నిరాశ కలుగుతంది.

సీగలింగ్ డేటింగ్ అంటే ఏంటి?

సీగలింగ్ అంటే స్పష్టమైన కమిట్‌మెంట్ లేకుండా అప్పుడప్పుడు అటెన్షన్ ఇవ్వడం లేదా తీసుకోవడం. వ్యక్తి మీతో లవ్ చేస్తున్నట్లు చెప్పి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాడు. కానీ రిలేషన్‌షిప్‌కు భవిష్యత్తు ఉందా అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడు. ఇలాంటి వ్యక్తులు కమిట్‌మెంట్ ఇవ్వడానికి వెనుకాడుతారు. కానీ కొన్ని సార్లు తమ ఆలోచనల వల్ల కూడా ఇలాంటి ప్రవర్తన రావచ్చు. అయితే మరికొందరు కేవలం అటెన్షన్, సపోర్ట్ లేదా వాలిడేషన్ కోసం ఇలా చేస్తారు. ఇలాంటి పరిస్థితి ఎదుటివారిని తమ రిలేషన్‌షిప్ గురించి నిరంతరం ఆలోచించేలా చేస్తుంది.

దీనికి సీగలింగ్ అనే పేరు ఎందుకు వచ్చింది?

Advertisement

ఈ పదం సముద్రపు పక్షి సీగల్ ప్రవర్తన నుంచి వచ్చింది. సీగల్స్ ఇతరుల ఆహారం వైపు కూడా వేగంగా దూసుకెళ్లడం సాధారణంగా కనిపిస్తుంది. అదే విధంగా సీగలింగ్ చేసే వ్యక్తి రిలేషన్‌షిప్ కోరుకోకపోయినా, ఎదుటివారి జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టడు. అతనికి లేదా ఆమెకు ఆ వ్యక్తి నుంచి లభించే అటెన్షన్‌ పొందడమే ఇష్టం.

ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు?

కొంతమంది ఇతరుల నుంచి లభించే శ్రద్ధ, ఎమోషనల్ సపోర్ట్ లేదా సహాయాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. మరికొందరు తమకు ఎదుటివారి జీవితంలో ప్రాధాన్యం ఉందనే భావనను ఆస్వాదిస్తారు.
కొన్ని సందర్భాల్లో ఎదుటివారిని కంట్రోల్ చేయాలనే కోరిక కూడా కారణం కావచ్చు. అయితే ప్రతి అస్పష్టమైన రిలేషన్‌షిప్‌ను సీగలింగ్‌గా భావించకూడదు. వ్యక్తిగత సమస్యలు లేదా కమ్యూనికేషన్ లోపాలు కూడా కారణాలు కావచ్చు.

సీగలింగ్‌ను ఎలా గుర్తించాలి?

Advertisement

ఒక్క సంఘటనను కాకుండా పదేపదే కనిపించే ప్రవర్తనను గమనించాలి. వ్యక్తి తరచూ దూరమై, కొంతకాలం తర్వాత మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అతను లేదా ఆమె కమిట్‌మెంట్ గురించి మాట్లాడకుండా అటెన్షన్ చూపిస్తుంటారు. వారి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా మాట్లాడటం కూడా ఒక సంకేతం కావచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాటలకు, చేతలకు మధ్య తేడా ఉందా అనేది గమనించాలి.

Also Read: పిసినారిగా ఉండాల్సిన అవసరం లేదు.. జీవితాన్ని ఆస్వాదిస్తూ డబ్బు ఆదా చేసే టిప్స్

సీగలింగ్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?

ముందుగా మీరు ఎంతకాలం అనిశ్చితి భరించగలరో నిర్ణయించుకోండి. మీ వ్యక్తిగత హద్దులను స్పష్టంగా నిర్ణయించుకోవడం ముఖ్యం. ఎదుటి వ్యక్తిని నేరుగా ఈ రిలేషన్‌షిప్‌పై వారి ఉద్దేశం ఏమిటో అడగండి. సమాధానం స్పష్టంగా లేకపోతే, వారి ప్రవర్తనను జాగ్రత్తగా గమనించండి. అప్పుడప్పుడు లభించే అటెన్షన్ కోసం నిరంతరం ఎదురుచూడకండి. మీకు గౌరవం, స్పష్టత, స్థిరమైన ప్రయత్నం అందించే సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

Also Read: తప్పు చేసినా అంగీకరించరు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఈగో, మొండితనం ఎక్కువ

ఎప్పుడు ముందుకు వెళ్లాలి?

ఎదుటి వ్యక్తి నిరంతరం దూరంగా ఉంటూ, మళ్లీ మళ్లీ మీ జీవితంలోకి వస్తుంటే ఆ సంబంధాన్ని పునరాలోచించండి. మీ ప్రశాంతతను కాపాడుకోవడం స్వార్థం కాదు. ఆరోగ్యకరమైన సంబంధానికి పరస్పర ఆసక్తి, నమ్మకం, స్పష్టమైన కమ్యూనికేషన్, స్థిరమైన ప్రయత్నం అవసరం. సీగలింగ్ వంటి ప్రవర్తనను ముందుగానే గుర్తిస్తే అనవసరమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌ని తగ్గించుకోవచ్చు.

Related News

మీ సోదరి రాఖీ గిఫ్ట్ ఇచ్చే ముందు ఇది తెలుసుకోండి.. రాశి ప్రకారం వారికి నచ్చే వస్తువులు ఇవే

రాఖీ కేవలం అన్నాచెల్లెళ్ల పండగేనా? అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలైంది?

మీరు కూడా మీ ఆఫీస్ బాస్‌ని తిట్టుకుంటూ ఉంటారా? దానివల్ల కలిగే ప్రభావం ఇదే

వయసు పెరిగినా తరగని గ్లో..మాస్ మహారాజా తాగే ఆ మ్యాజికల్ డ్రింక్ ఇదే!

దేశంలో వేగంగా పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు.. కరోనా లాగా మాస్క్ ధరించాలా?

రాఖీ స్పెషల్ స్వీట్స్.. పండుగ రోజు సులభంగా తయారు చేసే 3 రెసిపీలు

పిసినారిగా ఉండాల్సిన అవసరం లేదు.. జీవితాన్ని ఆస్వాదిస్తూ డబ్బు ఆదా చేసే టిప్స్

Big Stories

Advertisement
×