E-Paper
Advertisement

ఫామ్‌హౌజ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌.. తొలిసారిగా కవితపై విరుచుకుపడ్డ పార్టీ..! సిద్దిపేట అడ్డాగా చేసిన కామెంట్స్‌తో మౌనం వీడి..

ఫామ్‌హౌజ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌.. తొలిసారిగా కవితపై విరుచుకుపడ్డ పార్టీ..! సిద్దిపేట అడ్డాగా చేసిన కామెంట్స్‌తో మౌనం వీడి..
Advertisement

మొన్నటిదాకా మౌనాన్నే ఆశ్రయించింది గులాబీ పార్టీ. కవిత ఎంతటి ఆరోపణలు చేసినా.. పార్టీని డ్యామేజ్‌ చేసేలా విమర్శలు గుప్పించినా సైలెంట్‌గా చూస్తూనే ఉన్నారే తప్ప చడీ చప్పుడు చేయలేదు. కానీ తాజాగా కవిత సిద్దిపేట అడ్డాగా చేసిన విమర్శలు, ఆరోపణలను మాత్రం తట్టుకోలేకపోతున్నారు ఆ పార్టీ అగ్రనాయకత్వం. ఇక ఉపేక్షించేది లేదని తీర్మానించుకున్నారు. కవితపై గులాబీ ‘దండుయాత్ర’ ను కొననసాగించేందుకు రంగంలోకి దిగారు. ఫామ్‌హౌజ్‌ నుంచి పెద్దాయన గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని ప్రదర్శించేందుకు రెడీ అయ్యారు గులాబీ పార్టీ నేతలు

సిద్దిపేట కేంద్రంగా కవిత హరీశ్‌రావుపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్‌ పైనా ఇండైరెక్టుగా సెటైర్లు వేశారు. కేటీఆర్‌నూ తూర్పారబట్టారు. కొండపోచమ్మ సాగర్‌ నుంచి ఫామ్‌హౌజ్‌కు సాగునీళ్లు తరలించుకుపోతున్నారని క్లారిటీ ఇచ్చేశారు. ఫామ్‌హౌజ్‌ చుట్టూ ఆ కటుంబానికి సంబంధించిన భూములు ఉన్నాయని గూగుల్ మ్యాప్‌లో పాయింట్‌ చేసి మరీ మీడియాకు చూపించారామె. ఆ కుటుంబ అవినీతిలో తాను లేనని చెప్పుకున్నారు. నిమ్స్‌లో వంద కోట్ల స్కామ్‌కు హరీశ్‌ తెరలేపారని కూడా ఆరోపించారు కవిత.

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశ్యమే పక్కదారి పట్టిందని, లక్ష్యం నీరుగారిపోయిందని విమర్శించారు. ఇవన్నీ విన్న తరువాత ఇక సైలెంట్‌గా ఉండటం భావ్యం కాదని డిసైడ్ అయ్యింది గులాబీ పార్టీ. తండ్రి కేసీఆర్‌ వ్యూహాత్మకంగానే కవిత ఆరోపణలపై మౌనంగానే ఉంటూ వస్తున్నా.. కేటీఆర్, హరీశ్‌లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. అందుకే కేసీఆర్‌ను కూడా ఈ విషయంలో ఒప్పించినట్టున్నారు. ఇక మౌనం వీడాల్సిందేనని గట్టిగానే వాదించినట్టున్నారు. అందుకే పెద్దాయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడంటున్నారు.

అందుకే ఇవాళ పార్టీ తరుపున ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కవితపై ఘాటు విమర్శలు చేశారు. పార్టీ అగ్రనాయకత్వం తరుపున ఆర్‌ఎస్‌ను పంపారని అందరికీ తెలిసిపోయింది. ప్రవీణ్‌ ఆరోపణలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. కవిత.. రేవంత్‌రెడ్డి సారథ్యంలో తన పార్టీని నడుపుతున్నారని ఆరోపించారు. రేవంత్‌ తో కలిసి కంపెనీలను ఏర్పాటు చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి టీఆరెస్‌ పార్టీ నాలుగో అనుబంధ సంస్థగా మారిందన్నారు. మున్ముందు ఇంకా చాలా విషయాలు బయటపెడతామని ఆమెకు డైరెక్టు వార్నింగ్ ఇచ్చాడు ఆర్ఎస్‌.

Advertisement

కేసీఆర్‌ .. కవితను పార్టీ నుంచి వెళ్లగొట్టి మంచి పనిచేశారని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా కవితను మరింతగా రెచ్చిగొట్టారు ప్రవీణ్‌. హరీశ్‌పై కోపంతో ఏవేవో పనిగట్టుకుని ఆరోపణలు చేసే క్రమంలో ఆమె సోయి తప్పి మాట్లాడుతున్నారని హద్దు మీరి విమర్శించారు. ఇకపై మా మాటల దాడి కొనసాగుతుందని, ఇది మొదటి ఎపిసోడేనంటూ కాస్కో.. కవిత అనే విధంగా వ్యాఖ్యానించాడాయన.

కవిత పార్టీ పెట్టిన తరువాత .. ఆమె ఆ పార్టీ పై, నేతలపై చేసిన ఆరోపణలపై స్పందించడం ఇదే తొలిసారి. ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను తొలత దింపినా.. మున్ముందు ఇక మిగిలిన సీనియర్లు కూడా కవితపై ఫైర్‌ అయ్యేందుకు రూట్‌ క్లియర్‌ అయినట్టుగా కనిపిస్తున్నది. గతంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌ రెడ్డిలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మళ్లీ సైలెంట్‌ అయ్యారు. కవిత వ్యూహం కూడా బీఆరెస్‌ మౌనవ్రతాన్ని చెడగొట్టాలనే. ఇప్పుడు అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

Tags

Related News

గులాబీ పార్టీలో యువ గలం అసంతృప్తి.. ఎందుకో తెలుసా..?

ఏడేళ్ల కిందటి ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కథతో ‘దాయ్రా’ మూవీ! పృథ్వీరాజ్‌ హీరోగా హిందీ మూవీ..! ఎన్‌కౌంటర్‌ను సమర్థించే పాత్రలో పృథ్వీ!

పన్నుల నుంచి పర్మిషన్‌ల వరకు.. CUREతో హైదరాబాద్‌లో మారేదేంటి?

ఒక్క కేసీఆర్‌.. పదేండ్ల పాలన! ఆమాంతం పెరిగిన కుటుంబ ఆస్తులు! అంతా కలిసి కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసి!

భారత్‌ సమ్మిట్ వేదికగా రాజకీయ రగడ.. వీసాల రద్దు వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి?

ఫామ్‌హౌజ్‌ చుట్టూ కుటుంబ సభ్యుల భూములు! కొండ పోచమ్మ నుంచి ఫామ్‌హౌజ్‌కు నీళ్లు నిజమే? కవిత నిప్పులాంటి నిజాలు..!

తెలంగాణ నర్సింగ్ కాలేజీల్లో విచిత్ర పరిస్థితి.. ఇలాంటి వారు కూడా ఉన్నారా..?

Big Stories

Advertisement
×