E-Paper
Advertisement

గులాబీ పార్టీలో యువ గలం అసంతృప్తి.. ఎందుకో తెలుసా..?

గులాబీ పార్టీలో యువ గలం అసంతృప్తి.. ఎందుకో తెలుసా..?
Advertisement

BRS Youth: గులాబీ దళంలో యువతరం అసంతృప్తి చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమంలోనూ, అనంతరం పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పనిచేసిన యువనేతలకు తగిన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారం ఉన్న సమయంలోనూ, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ కోసం కష్టపడిన తమకు పదవులు, బాధ్యతలు, రాజకీయ అవకాశాల విషయంలో ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు యువ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకులుగా, యువజన విభాగాల ప్రతినిధులుగా పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే పలువురు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనూ యువనేతల్లో ఈ అసంతృప్తి మరోసారి తెరపైకి వచ్చినట్లు సమాచారం. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారిని పక్కనపెట్టి, చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారనే అభిప్రాయం కొందరు నాయకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఇలాంటి అసంతృప్తి వ్యక్తమైంది. 2024లో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక సమయంలో సైతం ఉద్యమకారులు, సీనియర్‌ పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వలేదంటూ కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సైతం గత ఎన్నికల్లో యువనేతలకు అవకాశం ఇవ్వలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు యువ నాయకుల్లో చర్చకు దారితీస్తున్నాయి.

ఉద్యమకారులకు గుర్తింపు ఏదీ?

Advertisement

తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల ద్వారా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకులు చాలామంది ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు తగిన గుర్తింపు, నామినేటెడ్‌ పదవులు, సంస్థాగత బాధ్యతలు వస్తాయని ఆశించారు. అయితే కొందరికి మాత్రమే అవకాశాలు దక్కాయని, మిగిలిన వారిని పట్టించుకోవడం లేదనే భావన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలోనూ గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పనిచేస్తున్నా నాయకత్వం నుంచి ప్రోత్సాహం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

అధినేత దృష్టికి అసంతృప్తి..

యువ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి అంశం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. యువతను విస్మరించకుండా వారిని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలం చేయాల్సిన అవసరాన్ని కొందరు సీనియర్‌ నాయకులు అధినేత కేసీఆర్ ను కలిసి సమస్యను దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. యువ నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం పెంచడం, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలపై అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: బాబ‌ర్ ఆజం బ్యాటింగ్ చేస్తుండ‌గా…క‌ట్ డ్రాయ‌ర్లు, బ‌నియ‌న్ల‌, నైటీల విజువ‌ల్స్‌

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కీలకంగా యువత

త్వరలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో యువత అసంతృప్తిని చల్లార్చడం పార్టీకి సంస్థాగతంగా కీలకంగా మారింది. పట్టభద్రులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువ ఉద్యోగులు వంటి వర్గాలతో పార్టీకి ఉన్న సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో యువ నాయకులు పార్టీకి దూరమవుతున్నారనే భావన ఏర్పడకుండా చూడాలని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. వారు దూరమైతే అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఎన్నికల సమయంలో యువజన విభాగాలు, విద్యార్థి సంఘాల నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉండటంతో వారిని సమన్వయం చేసుకోవడంపై దృష్టి సారించినట్లు సమాచారం.

యువజన కమిటీల ప్రకటనకు కసరత్తు?

పార్టీలో యువతకు ప్రాధాన్యం కల్పించేందుకు పెండింగ్‌లో ఉన్న యువజన విభాగాల కమిటీలను ప్రకటించే అంశం తెరపైకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర యువజన విభాగానికి ప్రస్తుతం మున్నూరు కాపుసామాజిక వర్గానికి చెందిన శంభీపూర్ రాజు అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే నూతన కమిటీని ప్రకటిస్తే ఏ సామాజిక వర్గానికి అధ్యక్షుడిగా ప్రాధాన్యం ఇస్తారనే చర్చ పార్టీలు మొదలైంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో యువజన కమిటీలను ఏర్పాటు చేసి, ఉద్యమ నేపథ్యం ఉన్నవారితో పాటు పార్టీ కోసం పనిచేస్తున్న కొత్తతరం నాయకులకు బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కమిటీల ఏర్పాటు ద్వారా యువతకు సంస్థాగతంగా గుర్తింపు లభించడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుందని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

బుజ్జగింపులతో సమస్య పరిష్కారమయ్యేనా?

యువతలో నెలకొన్న అసంతృప్తిని కేవలం హామీలతో కాకుండా ఆచరణలో గుర్తింపు కల్పించడం ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన కడారిస్వామి, గోపగాని రఘురాం, తుంగబాలు, పడాల సతీష్, బాలరాజుయాదవ్, పల్లెరవి, వాసుదేవరెడ్డి, రాంనర్సింహాగౌడ్ తదితరులు పార్టీ పదవులతోపాటు ఎమ్మెల్సీ టికెట్ ను ఆశిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన బాధ్యతలు, రాజకీయ అవకాశాలు కల్పిస్తేనే నమ్మకం పెరుగుతుందని యువ నాయకులు భావిస్తున్నారు. టికెట్ ఇస్తే ఆయా సామాజిక వర్గాల్లోనూ పార్టీపై ఆదరణ పెరుగుతుందని, అండగా ఉంటారని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు, పార్టీ పునర్నిర్మాణంలో యువతకు కీలక పాత్ర కల్పించేందుకు నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో యువతను సమన్వయం చేసుకోవడం, వారి అసంతృప్తికి పరిష్కారం చూపడం గులాబీ నాయకత్వానికి కీలకంగా మారింది.

Also Read: సింపుల్ లుక్‌తోనే గ్లామర్ ట్రీట్.. నెట్టింట హీట్ పెంచుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్!

Tags

Related News

ఏడేళ్ల కిందటి ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కథతో ‘దాయ్రా’ మూవీ! పృథ్వీరాజ్‌ హీరోగా హిందీ మూవీ..! ఎన్‌కౌంటర్‌ను సమర్థించే పాత్రలో పృథ్వీ!

పన్నుల నుంచి పర్మిషన్‌ల వరకు.. CUREతో హైదరాబాద్‌లో మారేదేంటి?

ఒక్క కేసీఆర్‌.. పదేండ్ల పాలన! ఆమాంతం పెరిగిన కుటుంబ ఆస్తులు! అంతా కలిసి కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసి!

భారత్‌ సమ్మిట్ వేదికగా రాజకీయ రగడ.. వీసాల రద్దు వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి?

ఫామ్‌హౌజ్‌ చుట్టూ కుటుంబ సభ్యుల భూములు! కొండ పోచమ్మ నుంచి ఫామ్‌హౌజ్‌కు నీళ్లు నిజమే? కవిత నిప్పులాంటి నిజాలు..!

తెలంగాణ నర్సింగ్ కాలేజీల్లో విచిత్ర పరిస్థితి.. ఇలాంటి వారు కూడా ఉన్నారా..?

తెలంగాణ ఇసుక క్వారీల్లో అక్రమ బకాసురులు.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×