OTT Movie : రియల్ లైఫ్ సోషల్ ఇష్యూస్‌ను బేస్డ్‌గా, ఒక ఎమోషనల్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తమిళ మూవీలో కూతురు దారుణమైన అఘాయిత్యానికి గురవ్వడంతో, తల్లిదండ్రులు రివేంజ్ కోసం పోరాటం చేస్తారు. ఈ కథ సోషల్ ఇష్యూస్‌పై ఫోకస్ చేస్తుంది. ఈ సినిమా హార్ట్‌బ్రేకింగ్ సీన్స్ తో ప్రేక్షకుల కళ్ళు చెమ్మ గిల్లేలా చేస్తుంది. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘విల్ వితై’ (Vil Vithai) 2023లో విడుదలైన తమిళ సోషల్ థ్రిల్లర్ చిత్రం. ఎస్.హరి ఉత్రా దర్శకత్వంలో రూపొందింది. ఇందులో అరుణ్ మైఖేల్ డానియల్ (మిథ్రాన్), ఆరత్య (స్వేతా), జానకి అమ్మ, గుణ (గుణ) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 52 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా 2023 జూలై 7న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. కానీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లేదు.
మిథ్రాన్ ఒక కార్ డ్రైవర్. అతని భార్య స్వేతా, కుమార్తె భవనతో సంతోషకరమైన జీవితం గడుపుతుంటాడు. ఒక రోజు వీళ్ళ జీవితంలో ఊహించని దారుణం జరుగుతుంది. భవనని ఒక గ్యాంగ్ ఘోరంగా వేధిస్తారు. ఆమె ఎంత మొత్తుకున్నా వదలకుండా అఘాయిత్యం చేస్తారు. ఆతరువాత ఆమె తల్లిదండ్రుల ముందు చనిపోతుంది. మిథ్రాన్ ఈ దారుణత్వంతో కుంగిపోతాడు. కానీ అటువంటి దుర్ఘటనలు ఇకపై ఎవరికీ రాకూడదని నిర్ణయించుకుంటాడు. మిథ్రాన్, స్వేతా ఆ రేపిస్ట్ గ్యాంగ్‌ను శిక్షించడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో వీళ్ళు ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కుంటారు.
సెకండ్ హాఫ్‌లో మిథ్రాన్, స్వేతా నెరస్థులను ట్రాక్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. మిథ్రాన్ తన కోపం, దుఃఖంతో పోరాడుతూ, గ్యాంగ్ మెంబర్లను ఒక్కొక్కరిని కసి తీరా చంపుతాడు. చివరికి మైన్ విలన్ కోపంతో మిథ్రాన్‌ను చంపడానికి ట్రై చేస్తాడు. కానీ కథ స్పైరింగ్‌గా, ఒక హార్ట్‌బ్రేకింగ్ ఎండింగ్‌తో ముగుస్తుంది. మిథ్రాన్ విలన్ పై రివేంజ్ తీర్చుకుంటాడా ? ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను, ఈ తమిళ సోషల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : సొంత కొడుకుని కూడా వదలకుండా… ఇదెక్కడి దిక్కుమాలిన కథ ? ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా భయ్యా