BigTV English

PAC Chairman Arikepudi: పీఏసీ చైర్మన్ పదవిపై హరీష్ రావు రాజకీయాలు.. గట్టి కౌంటర్ కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు

PAC Chairman Arikepudi: పీఏసీ చైర్మన్ పదవిపై హరీష్ రావు రాజకీయాలు.. గట్టి కౌంటర్ కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు

PAC Chairman Arikepudi| మొన్న పీఏసీ చైర్మన్.. నేడు శాసనమండలి చీఫ్ విప్ పదవులపై కాంగ్రెస్ , బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. తనకు దక్కాల్సిన పీఏసీ చైర్మన్ పదవి అరికపూడి గాంధీకి దక్కడంపై హరీష్‌రావు అప్పట్లో ధ్వజమెత్తారు. తాజాగా పట్నం మహేందర్‌రెడ్డిని చీఫ్ విప్‌గా అపాయింట్ చేయడంపై మండిపడుతున్నారు. పార్టీ మారిన వారికి ఆ పదవులు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్దమని విమర్శిస్తున్నారు. ఆ క్రమంలో హరీష్‌కు మంత్రి శ్రీధర్‌బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు … తాము రాజ్యాంగబద్దంగానే వ్యవహరిస్తున్నామని.. హరీష్‌రావు ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని యద్దేవా చేశారు.


ఏ రాష్ట్రమైన విపక్షానికి అసెంబ్లీలో దక్కే ప్రధాన పదవుల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఒకటి … శాఖల వారీగా ప్రభుత్వ పద్దులను స్ర్కూటినీ చేసే బాధ్యత పీఏసీ పరిధిలో ఉంటుంది … ఆ పదవి కోసం బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్‌‌రావుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించారు… అయితే అది అనూహ్యంగా శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి దక్కింది … దాంతో పార్టీ మారిన గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని అప్పట్లో హరీష్ రావు నానా హడావుడి చేశారు.

Also Read: ‘అలయ్ బలయ్’లో రగడ.. కేంద్ర మంత్రి Vs రాష్ట్ర మంత్రి


అప్పుడే కాంగ్రెస్ నేతలు అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు … గాంధీ సైతం తాను పార్టీ మారలేదని స్పష్టం చేశారు … తాజాగా శాసనమండలి చీఫ్ విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దానిపై హరీష్ రావు మళ్లీ రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీని చేర్చుకుని చీఫ్ విప్ పదవి ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తుతున్నారు .. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారని… అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా .. పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

పట్నం‌ మహేందర్ రెడ్డి అనర్హత పిటిషన్ కౌన్సిల్ ఛ్మైరన్ దగ్గర పెండింగ్ లో ఉందని … సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ హాయాంలో రాజ్యంగం ఎలా ఖూనీ అవుతుందనే దానికి ఇదొక ఉదాహరణని హరీష్ రావు అంున్నారు .. పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందని … అప్పుడు అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారని … మరి పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

హరీష్‌రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు .. ప్రతిదాన్ని రాజకీయం చేయటం హారీష్ రావుకు అలవాటైందని విమర్శించారు .. హరీష్ రావు వ్యవస్థలను రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదని .. రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్ గా నియమించామని ఘాటుగా రిటార్ట్ ఇచ్చారు.

ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న హరీష్ రావు శాసనసభ వ్యవహారాలమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు .. కేసీఆర్ హాయాంలో హరీష్ రావుకు రాజ్యాంగం గుర్తుకు రాలేదా ?… అప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే ప్రయత్నం చేసిందెవరని యద్దేవా చేశారు.

వాస్తవానికి పీఏసీ చైర్మన్‌గా ఉన్న అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానంటున్నారు.. ఆయనపై బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు… ఇటు పట్నం మహేందర్‌రెడ్డిపైనా పార్టీ పరమైన చర్యలకు గులాబీ నేతలు సాహసించడం లేదు… తాము అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీల వారిని చేర్చుకున్న కారు పార్టీ పెద్దలు.. ఇప్పుడు తమ పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోర్టుల కెక్కుతున్నారు.. మొత్తమ్మీద వలసలు పెరిగిపోతుండటంతో పార్టీ ఉనికి కాపాడుకోవడానికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎప్పటికప్పుడు హడావుడి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×