Big Stories

Balineni Srinivas Vs Damacharla Janardh: ఒంగోలులో మ్యాచ్ ఫిక్సింగ్! గెలుపు ఫిక్స్!

- Advertisement -
ఈ ప్రాంతాన్ని ఎన్నికల సంఘం.. అతి సమస్యాత్మక కేంద్రంగా గుర్తించింది. ఒంగోలు నియోజకవర్గంలో ప్రత్యేక బలగాలతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో.. లైవ్ వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేసింది. ఒంగోలులో ఎలాంటి ఘర్షణలు జరక్కుండా ఈసీ ఏర్పాట్లు చేయటంతో.. ఎలక్షన్ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ప్రజలతో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడి వరకూ ఓకే. ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో.. TDP, YCP గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నాయి. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి… 10 వేల మెజార్టీతో గెలుస్తునట్లు లెక్కలు వేసుకుంటుండగా.. టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనార్ధన్‌… తనకు 20వేల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు ఈసారి ఒంగోలులో పోలింగ్ శాతం బాగా పెరిగింది. ఇరు పార్టీలకూ గెలుపు, మెజార్టీలపై అంతు చిక్కని పరిస్థితి. ఎవరికి అనుకూలంగా వాళ్లు సోషల్ మీడియాలో తమ పార్టీ గెలుపుపై అంచనా వేసుకుంటూ ట్రోల్స్ చేసుకుంటున్నారు. వాస్తవానికి… ఒంగోలులో ఈ సారి ఎవరు గెలిచినా పెద్దగా మెజార్టీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికలకు ముందు ఒంగోలులో టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనార్ధన్ గాలి గట్టిగా వీచినా.. చివరి పదిరోజుల్లో పరిస్థితి మారింది. దామచర్లకు గాలి రివర్ప్ వీచినట్లు టాక్ నడుస్తోంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో వైసీపీ అభ్యర్ధి కంటే దామచర్ల వెనకబడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటర్లను తాయిలాల ద్వారా ప్రసన్నం చేసుకోవటంతో వైసీపీ బాగా వర్క్‌వుట్ చేసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనార్థన్‌కు సరైన టీమ్‌ కుదరకపోవటంతో పాటు చివరి నిమిషంలో వైసీపీ నుంచి వచ్చిన టీడీపీ వ్యక్తులకు పెత్తనం ఇవ్వటంతో మొదటి నుంచీ ఉన్న టీడీపీ క్యాడర్ కాస్త స్లో అయ్యారనే టాక్ నడుస్తోంది. దీంతో ఎలక్షన్ సమయానికి పోల్ మేనేజ్‌మెంట్‌లో తెలుగుతమ్ముళ్లు డౌన్ అయినట్లు ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. మరోవైపు.. దామచర్ల చుట్టూ ఉన్న కొందరు నేతలు.. బాలినేని కోసం పనిచేశారనే టాక్ నడుస్తోంది. అన్ని సమీకరణాలనూ దృష్టిలో పెట్టుకుని ఒంగోలులో మళ్లీ బాలినేని జెండా ఎగురువేస్తారనే వైసీపీ పేపర్‌ లెక్కలు వేసుకుంటున్నారు. కొందరైతే పందేలకు కూడా సై అంటున్నారట.

- Advertisement -

Also Read: 600 కోట్లు!! జగన్‌కు కడప టెన్షన్!?

మరోవైపు.. టీడీపీ కూడా మెజార్టీ పక్కన పెట్టి విజయంపైనే ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. కొందరైతే ఇప్పటికే దామచర్ల గెలుస్తారని ధీమా వ్యక్తం చేయటం సహా లక్షల్లో బెట్టింగ్‌లకు సిద్ధమయ్యారని టాక్‌ నడుస్తోంది. వైసీపీ లెక్క ప్రకారం.. ఒంగోలు నగరంలో TDP, YCPలకు సమానంగా వస్తాయని ఏట్లు వస్తాయని… ఒంగోలు రూరల్ల్ మండలాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి మూడు వేల ఓట్లు ప్లస్ అవుతాయనే లెక్కలు వేసుకుంటున్నారు. కొత్తపట్నం మండలంలో వైసీపీకి ఐదు వేల మెజార్టీ వస్తుందని అధికారపార్టీ ఆశలు పెట్టుకుంది. టీడీపీ కూడా… నియోజకవర్గం మొత్తంమ్మీద 20 వేల మెజార్టీ వస్తుందని అంచనా వేసుకుంటున్నారు.

ఒంగోలు నియోజకవర్గంలో 85 శాతం పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి 20 వేల మెజార్టీ వచ్చింది. ఈసారి గత ఎన్నికల మెజార్టీ… రివర్స్ అవుతుందనే భావనలో టీడీపీ ఉంది. ఎలక్షన్స్‌ సైలెంట్ జరగటంతో ఆయా పార్టీల నేతలు. వారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో మరోట్విస్ట్ కూడా ఉంది. ఒంగోలులో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు టాక్ నడుస్తోంది. TDP ఎంపీ అభ్యర్ధి మాగుంటకి ఒక ఓటు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బాలినేనికి ఒక ఓటు వేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల ముందు మాగుంట చెంతకు చేరిన కొంతమంది నేతలు మ్యాచ్ ఫిక్స్ంగ్ చెశారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల ముందు బాలినేనిపై మాగుంట.. మాగుంటపై.. బాలినేని రాజకీయ విమర్శలు చేసుకోలేదు. టీడీపీ నేతలు మాత్రం బాలినేని అండ్ కో చేసిన అవినీతి, అక్రమాలు, ఒంగోలులో అభివృద్ధి జరగక పోవటం, వైసీపీ వ్యతిరేకతలే.. తమను గెలిపిస్తాయని ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ అభ్యర్థి బాలినేని మాత్రం.. ఒంగోలులో నిరుపేదలకు 20వేల ఇళ్ల పట్టాలు, జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించిన బాలినేని.. ఐదోసారీ తానే గెలుస్తానని ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ మాత్రం బాలినేనికి పొలిటికల్ రిటైర్‌మెంట్ తప్పదని చెప్పుకుంటున్నారు. ఒంగోలు ప్రజలు ఎవరికి పట్టం కట్టారో.. అనేది తెలుసుకోవాలంటే జూన్ 4 వరకూ వైట్ చేయాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News