Indian Army Attack: మోడీని, మోడీ బాడీ లాంగ్వేజ్ ను అర్థం చేసుకోవడం పాకిస్తాన్ కు ఈ జన్మలో సాధ్యంకాని విషయం. బాలాకోట్ లో ఎయిర్ స్ట్రైక్స్, లేటెస్ట్ గా ఆపరేషన్ సిందూర్ మిషన్.. రెండిట్లో పెద్ద తేడా లేదు. కానీ మోడీ చర్యలను పాక్ స్టడీ చేయలేకపోయింది. అందుకే దాడుల్ని చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అదే మోడీ స్ట్రాటజీ. ప్రత్యర్థికి అర్థంకాని ఒక పజిల్ మన మోడీ. ఎప్పుడు ఎలా టార్గెట్ ఫిక్స్ చేస్తారో, ఆయన ముఖంలో కనిపించదు. కానీ అనుకున్న సమయానికి పని జరిగిపోతుందంతే. మరికొన్ని గంటల్లో దాడి చేస్తున్నామని ప్రధానికి తెలుసు. అయినా సరే తుఫాన్ కు ముందు ప్రశాంతతలా కనిపిస్తారు. కానీ ఆ ప్రశాంతత వెనుక… బద్దలయ్యేందుకు సిద్ధంగా ఓ అగ్ని పర్వతం ఉందని ఎవరికి తెలుసు? చలో మోడీ మాస్టర్ ఎటాక్ స్ట్రాటజీని డీకోడ్ చేద్దాం.
ఇదే ఆపరేషన్ సిందూర్ పవర్..
గురి తప్పకుండా..
లక్ష్యం చెదరకుండా..
చాలా పద్ధతిగా..
అమాయక జనం జోలికి వెళ్లకుండా..
పవర్ ఫుల్ గా..
శత్రువు గుండెల్లో భయం పెరిగేలా..
భారత్ వైపు ఇంకోసారి చూసేందుకే వణికేలా..
సాగిన ఈ మిషన్.. పాకిస్తాన్ కు ఒక పెద్ద గుణపాఠం.
ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచమంతా కళ్లారా చూసింది.
కళ్లప్పగించింది. శాంతి అంటూ కథలు చెప్పారు కొందరు..
కానీ భారతీయుల రక్తం మరిగిపోదా..?
హిందువులనే టార్గెట్ గా అందులోనూ పురుషుల్నే లక్ష్యంగా చేసుకున్నప్పుడు తమను కూడా చంపేయండన్నారు మహిళలు.
మిమ్మల్ని చంపం.. ఇక్కడి జరిగింది వెళ్లి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు టెర్రరిస్టులు.
మరి మోడీకి చెబితే రీసౌండ్ ఎలా ఉంటుందో తెలుసా?
చూశారుగా సరౌండ్ సౌండ్..
దెబ్బకు పదింతల దెబ్బ..
కొడితే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
టార్గెట్లు పేలిపోయాయ్..
ఉగ్రశిబిరాలు ధ్వంసమయ్యాయ్..
26 మంది అమాయకుల ప్రాణాలకు ప్రతిగా 70 మంది ఉగ్రవాదుల తలలు తెగిపడ్డాయ్..
శవాల ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయ్..
బాంబుల వర్షం చూసి పాకిస్తానీల పరుగులే పరుగులు..
అదీ భారత్ తడాకా..
శత్రువు వెన్నులో టన్నుల కొద్దీ భయం
మోడీ చర్యలు ప్రపంచాన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.
పహల్గామ్ లో అమాయకులపై దాడికి ప్రతీకారం ఉండక్కర్లేదా.. సరిగ్గా భారత్ అదును చూసి అదే పని చేసింది.
అర్ధరాత్రి చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదుల గుండెలను చీల్చింది.
నెత్తురు పారించింది..
శత్రువు వెన్నులో టన్నుల కొద్దీ భయం పుట్టించింది.
భారత్ జోలికొస్తే తడాఖా ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించింది..
దీనికి పాకిస్తాన్ దుస్సాహసం చేసి రియాక్ట్ అయితే మాత్రం… వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ గాయబ్ అవడం ఖాయమే..
ఉగ్రవాద శిబిరాలపై దాడికి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టడం భారత్ ప్రతీకారానికి నిదర్శనం. ఎందుకంటే టూర్ కు వెళ్లిన మహిళల భర్తలను మాత్రమే హింసించి కాల్చి చంపారు ఉగ్రవాదులు. వారి నుదుటన సిందూరం లేకుండా చేశారు. మన మహిళల నుదుటన ఏ సిందూరమైతే లేకుండా పోయిందో.. అదే సిందూరం పేరుతో ఆపరేషన్ చేసి చూపించారు ప్రధాని మోడీ.
సైలెంట్ గా.. వయొలెంట్ క్రియేట్
ఎవరికీ హింట్ ఇవ్వలేదు..
ఎక్కడా మ్యాటర్ బయటకు రాలేదు..
అర్ధరాత్రి బయల్దేరి వెళ్లాయి రాఫెల్ ఫైటర్ జెట్స్..
సైలెంట్ గా.. వయొలెంట్ క్రియేట్ చేసి వచ్చాయి..
ఇలాంటి టఫ్ మిషన్ ప్లానింగ్ మోడీకే చెల్లింది.
స్వయంగా ఆ ఆపరేషన్ ను తన వార్ రూమ్ నుంచి చూశారు కూడా.
మోడీ రియాక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందో యావత్ ప్రపంచం ప్రతిసారి ఊహించలేకపోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్… మోడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను పసిగట్టలేకపోతోంది. జస్ట్ తాజా ఆపరేషన్ ను ఒక మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయింది. నోరు తెరిచినా ఏమీ చేయలేని పరిస్థితి. పాకిస్తానీ ఆర్మీ అంతా ఎక్కడ చచ్చింది అని పాకిస్తానీలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
దాడి ఎక్కడ చేస్తామో చెప్పం అంటున్న పాక్
ఇంత జరిగాక పాక్ విదేశాంగ మంత్రి ఓ మాటన్నాడు. మేం ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తామో చెప్పం… చేసి చూపిస్తామన్నాడు. భారత్ పై దాడి చేసే దమ్ముందా.. దాడి చేస్తే ప్రాణాలతో మిగులుతారా? ఇప్పటికే మన త్రివిధ దళాలకు మోడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అందుకు తగ్గట్లే మన బలగాలు టార్గెట్ ఫిక్స్ చేశాయి. పేల్చేశాయి
మోడీ తాండవం ఎలా ఉంటుందో యావత్ ప్రపంచం కళ్లజూసింది. దెబ్బకు పదింతల దెబ్బ. ఉగ్రవాదులకు టన్నుల కొద్దీ భయం అంటే ఏంటో రుచి చూపిన ఆపరేషన్ ఇది. ఎవరూ ఊహించని విధంగా, ఉగ్రస్థావరాలే లక్ష్యంగా సాగిన ఈ మిషన్ తో పాకిస్తాన్ కు బుద్ధి వస్తుందా? మరోసారి ఉగ్రవాదాన్ని ఎగదోయకుండా సైలెంట్ అవుతారా? ఈ మొత్తం ఆపరేషన్ మోడీ వార్ స్ట్రాటజీని ఎలా హైలెట్ చేస్తోంది? చాణక్యుడు చెప్పిన యుద్ధ తంత్రాలను మోడీ ఫాలో అయ్యారా?
తమ ప్రతీకారం ప్రపంచం చూస్తుందన్న మోడీ
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కొద్ది రోజులకే బిహార్ లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మోడీ పాల్గొనాల్సి వచ్చింది. దాన్ని క్యాన్సల్ చేసుకోలేదు. వెళ్లారు. బహిరంగ సభలో తన మనసులో మాట చెప్పేశారు. ఉగ్రవాదం ఎక్కడున్నా అంతం చేస్తామన్నారు. తమ శక్తి ఏంటో యావత్ ప్రపంచం చూడబోతోందంటూ హిందీలో కాకుండా ఇంగ్లీష్ లో అందరికీ మెసేజ్ వెళ్లేలా మాట్లాడారు. ఇక అంతే. ఆ తర్వాత కంప్లీట్ స్ట్రాటజీ మార్చేశారు మోడీ. వరుస మీటింగ్ లు, దౌత్య పరమైన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. త్రివిధ దళాలకు స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. కానీ మోడీ ముఖంలో మాత్రం ఎటాక్ స్ట్రాటజీ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు.
దాడి చేసేందుకు టైం పడుతుందన్నట్లుగా స్కెచ్
బయటి నుంచి చూసే వారికి ముఖ్యంగా పాకిస్తానీలకు… భారత్ ఎటాక్ చేసేందుకు చాలా టైం పడుతుందన్నట్లుగానే కనిపించారు. మొన్నటికి మొన్న అమరావతి సభకు వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ గురించి, ఉగ్రవాదుల గురించి, తమ ఆపరేషన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరికీ మోడీ రిలాక్స్ మోడ్ లో ఉన్నారనిపించేలా కనిపించారు. కానీ లోలోపల మాత్రం మోడీ ప్లానింగ్ ను పాకిస్తాన్ అర్థం చేసుకోలేదు. 2019లో బాలాకోట్ దాడులకు ముందు.. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ టైంలో మోడీ వ్యవహార శైలి అందరినీ ఆశ్చర్యపరిచేలా సాగింది. యాదృచ్ఛికమే కానీ.. రెండుసార్లు ఇలాగే జరిగింది. పాకిస్తాన్ తనను తాను తిట్టుకోవడం తప్ప ఇప్పుడు చేసేదేమీ లేదు.
ఫైటర్ జెట్స్ టేకాఫ్‌కు రెడీగా ఉన్నా అదే ప్రశాంతత
2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ పై దాడి జరిగింది. ఆ ఎటాక్ కు ముందు 48 గంటల్లో మోడీ ప్రవర్తన నార్మల్ గానే కనిపించింది. అదే ఏడాది ఫిబ్రవరి 25న ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్‌ను దేశానికి అంకితం చేశారు. భారత సైన్యం వీరత్వం గురించి మాట్లాడినా, పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉగ్రస్థావరాలపై జరగబోయే దాడి గురించి ఎలాంటి హింట్ కూడా ఇవ్వలేదు. అదే రోజు రాత్రి 9 గంటలకు భారత ఫైటర్ జెట్స్ టేకాఫ్‌కు రెడీగా ఉన్నప్పుడు, మోడీ ఢిల్లీలో ఒక మీడియా గ్రూప్ నిర్వహించిన సమ్మిట్‌లో ప్రసంగిస్తున్నారు. భారత ఆకాంక్షలు, అభివృద్ధి, ఉగ్రవాదంపై పోరాటంలో దృఢసంకల్పం గురించి మాట్లాడారు. 2047 నాటికి భారత్ ఆర్థిక శక్తిగా ఎదగాలనే ఆకాంక్షల గురించి మాట్లాడారు. టైం గడుస్తున్నా కొద్దీ శాంతంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించారు. ఒత్తిడి, ఆందోళన లాంటివి హైలెట్ కాలేదు ఆనాడు.
భారత్ లో ఉన్న పాకిస్థానీలను ఖాళీ చేయించేశారు..
తుఫాన్‌కు ముందు ప్రశాంతతలా.., యుద్ధ సమయంలో ధైర్యం గొప్ప నాయకుడి లక్షణాలు అన్నది మనస్తత్వవేత్తల అభిప్రాయం. నిజానికి మోడీ ముందు ఒక టార్గెట్ ఉంటే.. బ్యాక్ గ్రౌండ్‌లో దాని గురించి మ్యాటర్ నడుస్తూనే ఉంటుంది. కానీ బయటకు కనిపించదు. కంప్లీట్ వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. అలాగే కనిపిస్తారు. కానీ తెరవెనుక జరిగే విధ్వంసం ఇలాగే ఉంటుంది. మోడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను పసిగట్టలేని పాక్ మౌనంగా ఉండడం తప్ప చేసేదేమీ లేదు. అందులో భాగంగానే భారత్ లో ఉన్న పాకిస్తానీలను దేశం వదిలి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశారు. ఎవరూ ఉండొద్దన్నారు. అందరినీ పంపించేశారు. ఆ తర్వాతే కథ నడిపించారు.
Also Read: ఆపరేషన్ సిందూర్‌పై అబద్ధాల వరద.. పాక్ బుద్ధి ఎప్పటికీ మారదా?
పాకిస్థాన్ పై మాట్లాడాలని అంతా అన్నా.. ఆ పదాన్ని తీసుకోలేదు. పదేపదే ఎటాక్స్ గురించి మాట్లాడే వారు ఆ పని చేయరు. సో మోడీ మాత్రం ఆ మాటలు మాట్లాడకుండానే చేతల్లో ఆపరేషన్ సిందూర్ చేసి చూపించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటంటే.. దాడి చేసేందుకు ఇంకా సమయం ఉందని భ్రమ కల్పించడం, తాము వేరే పనుల్లో ఉన్నామని ఆలోచన వచ్చేలా చేసి, శత్రువు ఆలోచనలను ఏమార్చి అదే అదునుగా దాడి చేయడం కీలకంగా ఉంది. ఎడమవైపు చూపి కుడివైపు తిరిగేలా మోడీ స్ట్రాటజీ ఉంటుంది. ఆయన మాటల్లో అసలైన అంతరార్థాన్ని గ్రహిస్తేనే ఏం చేయబోతున్నారన్నది తెలుస్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే కథ మరోలా ఉంటుందని అర్థం. సో ఇప్పుడు పాకిస్తాన్ కు దెబ్బ కొట్టింది కూడా అలాంటి స్ట్రాటజీతోనే.
చాణక్య వ్యూహాన్నే ఫాలో అయిన ప్రధాని మోడీ
యుద్ధాన్ని దేశ రక్షణ కోసం చివరి ఆయుధంగా చూడాలంటాడు చాణక్యుడు. దాన్ని కూడా జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగించాలంటాడు. సమయం, సన్నద్ధత యుద్ధంలో విజయానికి కీలకం. ఇప్పుడు మోడీ వ్యూహంలోనూ అదే పని చేసింది. ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ నోరు మూయించింది. శత్రువును తప్పుదారి పట్టించడం, వారి యూనిటీని బలహీనపరచడం కీలకమన్న చాణక్యనీతిని ప్రాక్టికల్ గా ఫాలో అయ్యారు ప్రధాని మోడీ. సో యుద్ధం గురించి చాణక్య నీతి సూత్రాలు ఆధునిక సైనిక వ్యూహాలకూ అన్వయించారు. 2019లో బాలాకోట్ దాడులైనా, ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ అయినా… తెలివైన ఎత్తుగడ, కచ్చితమైన టార్గెట్, దాడి చేసేందుకు కచ్చితమైన సమయం ఇవన్నీ కీలక పాత్ర పోషించాయి.