Net Run Rate : ఐపీఎల్ 2025 సీజన్ తుది దశకు చేరడంతో ప్లే ఆఫ్స్ చేరే జట్ల పై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు దాదాపు ప్లే ఆప్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. ఇక మూడో స్థానంలో 15 పాయింట్లతో పంజాబ్ కింగ్స్, నాలుగో స్థానంలో 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్ జట్టు కొనసాగుతోంది. వాస్తవానికి ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్లు నెట్ రన్ రేట్ అన్ని జట్ల కంటే కూడా మెరుగ్గా ఉంది. ఎందుకంటే కొన్ని మ్యాచ్ ల్లో 54, 100 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేయడంతో రన్ రేట్ పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఇరు జట్ల పాయింట్లు సమానంగా ఉంటే.. విజయాలు సాధించినప్పుడు నెట్ రన్‌రేట్‌ను పరిగణలోకి తీసుకుంటారు. నెట్ రన్‌రేట్ ద్వారానే పాయింట్స్ టేబుల్ స్థానాలను కూడా నిర్ణయిస్తారు. ఈ క్రమంలోనే అసలు క్రికెట్‌లో నెట్ రన్‌రేట్ అంటే ఏంటి..? దీన్ని ఎలా లెక్కిస్తారో అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : PSL 2025: ఇండియా దెబ్బకు పాకిస్థాన్ నుంచి పారిపోయిన విదేశీ క్రికెటర్లు..PSL 2025 రద్దు !
నెట్ రన్ రేట్ = (టోర్నీలో చేసిన మొత్తం రన్స్/టోర్నీలో ఆడిన మొత్తం ఓవర్లు) – (అదే టోర్నీలో మొత్తం ఇచ్చుకున్న రన్స్/టోర్నీలో ప్రత్యర్థులు ఆడిన ఓవర్లు). ఐపీఎల్‌లో లీగ్ దశలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడితే అందులో మొత్తం మ్యాచ్‌ల్లో కలిపి ఎన్ని పరుగులు చేసిందో.. దానికి ఎన్ని ఓవర్ల బంతులు ఎదుర్కుందో లెక్కిస్తారు. చివరికి మొత్తం పరుగుల్ని ఎదుర్కొన్న ఓవర్లతో విభజించి సగటు పరుగుల్ని లెక్కిస్తారు. ఆ వచ్చిన మొత్తాన్ని రన్స్ పర్ ఓవర్‌గా నిర్ణయిస్తారు. ఐపీఎల్‌లో లీగ్ దశలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడితే అందులో మొత్తం మ్యాచ్‌ల్లో కలిపి ఎన్ని పరుగులు చేసిందో.. దానికి ఎన్ని ఓవర్ల బంతులు ఎదుర్కుందో లెక్కిస్తారు. చివరికి మొత్తం పరుగుల్ని ఎదుర్కొన్న ఓవర్లతో విభజించి సగటు పరుగుల్ని లెక్కిస్తారు. ఆ వచ్చిన మొత్తాన్ని రన్స్ పర్ ఓవర్‌గా నిర్ణయిస్తారు.
అలాగే అదే జట్టుపై ఇతర జట్లు ఎన్ని పరుగులు చేస్తాయో.. ఆ జట్టు ఎన్ని ఓవర్లను ఎదుర్కొంటాయో లెక్కిస్తారు. ఒకవేళ ప్రత్యర్థి జట్టు ఆ మ్యాచ్‌లో నిర్దేశించిన ఓవర్ల కన్నా తక్కువ ఓవర్లకే ఆలౌటైతే అప్పుడు కూడా వాటిని పూర్తి ఓవర్ల కోటా కింద లెక్కిస్తారు. చేజింగ్‌లో ముందే లక్ష్యాన్ని అందుకుంటే అన్ని ఓవర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇలా వచ్చిన సగటును జట్టు పరుగుల సగటు నుంచి తీసివేస్తే వచ్చేదే నెట్‌రన్‌రేట్. ఇలా నెట్ రన్ రేట్ లో ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు +1.156 తో టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తరువాత గుజరాత్ టైటాన్స్ +0.793 రన్ రేట్ ఉంది. అలాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కూడా కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం -0.992 నెట్ రన్ రేట్, అలాగే నెట్ రన్ రేట్ పరంగా -1.192 నెట్ రన్ రేట్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనసాగుతోంది. అంటే ఈ సీజన్ లో నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెప్పవచ్చు.
?igsh=MTMzcTN2N2JnejhjMQ==