BigTV English

Matka Movie Tickets Booking : 300 టికెట్లు మాత్రమే.. వరుణ్ తేజ్ ‘మట్కా’కు రిలీజ్ కు ముందే షాక్

Matka Movie Tickets Booking : 300 టికెట్లు మాత్రమే.. వరుణ్ తేజ్ ‘మట్కా’కు రిలీజ్ కు ముందే షాక్

Matka Movie Tickets Booking : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘మట్కా’ (Matka) మూవీతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. కానీ ఈ సినిమాకు దారుణమైన పరిస్థితి ఎదురైంది. ఇంకా రిలీజ్ కాకముందే ‘మట్కా’ మూవీకి ఇలాంటి పరిస్థితి నెలకొంటే, మరి రిలీజ్ అయ్యాక ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో అనిపించే సంఘటన ఒకటి జరిగింది. అదేంటో తెలుసుకుందాం పదండి.


వరుణ్ తేజ్ హీరోగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మట్కా’ (Matka). ‘పలాస’ ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందించారు. ‘మట్కా’ మూవీ తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో నవంబర్ 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

అయితే యూఎస్లో ఈ సినిమా ప్రీమియర్ కు ఊహించనంత దారుణమైన రెస్పాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. నవంబర్ 14న ‘మట్కా’ (Matka) మూవీని శ్లోక ఎంటర్టైన్మెంట్స్ అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది. నవంబర్ 13న ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ జరుగుతున్నాయి. కానీ ఊహించని విధంగా ఈ సినిమా ప్రీమియర్స్ కి కేవలం 300 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయినట్టుగా టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు కనుక నిజమైతే వరుణ్ తేజ్ కు ఘోర అవమానం జరిగినట్టే. ఎందుకంటే వరుస డిజాస్టర్లలో ఉన్న వరుణ్ తేజ్ ఈ మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. మరోవైపు డైరెక్టర్ కరుణ కుమార్ కూడా వరుసగా గత రెండు సినిమాలతో ఫ్లాప్ అందుకున్నారు. అందుకే వీరిద్దరూ ఇప్పుడు ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు.


ప్రస్తుతం ‘మట్కా’ (Matka) మూవీకి టాలీవుడ్లో కాస్తో కూస్తో బజ్ ఉంది. కానీ మిగతా భాషల్లో మినిమం హైప్  కూడా కనిపించట్లేదు. “కంగువ” మూవీకి వస్తున్న రీ సౌండ్ ముందు “మట్కా” చిన్నబోయిందని చెప్పాలి. రీసెంట్ గా ‘మట్కా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు మరో మెగా హీరోని ఉద్దేశించి అంటూ ప్రచారం జరిగింది. దీంతో సినిమాపై కాస్త బజ్ పెరిగింది.

అయితే 1960 నుంచి 80 వరకు ‘మట్కా’ (Matka) అనే జూదం చాలా ఫేమస్. అప్పట్లో ‘మట్కా’ కింగ్ గా ఎదిగిన వాసు అనే వ్యక్తి జీవితంలోని వివిధ దశలను, ఈ జూదం ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది అనే పాయింట్ తో సినిమాను తీసుకొస్తున్నారు. ‘కంగువ’ తప్ప ఈ సినిమాకు పెద్దగా పోటీ లేనప్పటికీ యూఎస్ లో ఇలాంటి రెస్పాన్స్ రావడం సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. మరి ఈ మూవీ నవంబర్ 14 హాలీడేతో పాటు లాంగ్ వీకెండ్ కూడా కలిసి వచ్చినప్పటికీ విజయాన్ని సాధిస్తుందా అనేది చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×