E-Paper
Advertisement

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!
Advertisement

కొండంత రాగం తీసి…అన్నట్టుగానే జంతర్‌మంతర్‌ 2.0 ఆందోళనలో సీజేపీ విఫలమైంది. జంతర్‌ మంతర్‌ వేదికగా నీట్‌ పేపర్‌ లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా పై బొద్దింకలు చేసిన అలుపెరగని పోరాటానికి దేశం మొత్తం సపోర్టు చేసింది. కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి నెలకొన్నది.

చలి చీమల చేతజిక్కి చావదే సుమతీ ..అన్న చందంగా బలవంతుడైన మోడీ మెడలు వంచడంలో జెన్‌జీ సక్సెస్‌ అయిందనే మెసేజ్‌ ప్రపంచానికి చేరింది. మోడీ సైతం జెన్‌ జీ ఉద్యమానికి లొంగక తప్పలేదనే ప్రచారం జోరందుకున్నది. ఆ తరువాత అంత పెద్ద ఎత్తున తీసుకున్న రెండో ఆందోళనగా .. సీఈసీ జ్ఞానేశ్వర్ రాజీనామా అంశాన్ని నెత్తికెత్తున్నది సీజేపీ.

Advertisement

దీనికి ముందు ముంబై, బెంగుళూరులో సీజేపీ చేపట్టిన ర్యాలీలు సక్సెసయ్యాయి. ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ, ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా తోడయ్యారు. దీంతో ఈ ఆందోళనపై అంచనాలు పెరిగాయి. ఉద్రిక్తతలకు దారి తీసే ఉద్యమంగా మారుతుందనే సంకేతాలు అందాయి. ముందే ఇవాళ జంతర్‌ మంతర్‌ వద్దకు వచ్చి ఆందోళన చేపడతామని పదే పదే హెచ్చరించినట్టుగానే, కేంద్రాన్నిఅలర్ట్ చేసినట్టుగా సీజేపీ ప్రకటనలు ఉన్నాయే తప్ప.. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు, డిమాండ్‌ను సాధించేందుకు పక్కా వ్యూహం రచించడంలో మాత్రం వీరు ఫెయిలైనట్టుగా భావించాలి.

పదే పదే సోషల్ మీడియాలో వీరి పిలుపులు, కామెంట్లు, కేంద్రం తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికే వీరు పరిమితమయ్యారు.  పైగా తమ రాక సందర్భంగా మోడీ జడుసుకున్నాడని, అందుకే మెట్రోలు, రైళ్లు బంద్‌ చేశాడని, ఢిల్లీని అనధికార బంద్‌గా ప్రకటించాడని, ఇదే తమ విజయంగా పీలయినట్టుగానే కామెంట్లు పెడుతూ సంతోషపడ్డారు.

Advertisement

వారి వీడియోలు చూస్తే ఇది చాలు మా విజయానికి అన్నట్టుగా అల్ప సంతోషంతో ఈ పరిణామాలతోనే సరిపెట్టుకున్నట్టుగానే కనిపించింది. ఓ వైపు మూడు రోజుల నుంచి ఇండీ కూటమి ఇదే అంశంపై ఢిల్లీని స్తంభింపజేస్తోంది. కేంద్రానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. మొదటి రోజు నిర్బంధించి అరెస్టులు చేసినా.. అంతటితో ఆగలేదు రాహుల్‌, ప్రియాంక అండ్‌ టీమ్‌.

వరుసగా మూడు రోజులు అలుపెరగని పోరాటం చేశారు. దేశం దృష్టిని ఆకర్షించి.. ఉద్యమానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు కూడగట్టడంలో ఇండీ కూటమి సక్సెసయ్యిందనే చెప్పాలి. అయినా ఇంకా కేంద్రం మెడలు వంచాలంటే ఈ ఉద్యమానికి జెన్‌జీ సపోర్టు కావాలని అంతా భావించారు. సీజేపీ ఇచ్చిన జంతర్‌ మంతర్‌ పిలుపు పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

కానీ ధర్మేంద్ర రాజీనామా విజయం తరువాత వచ్చిన అహమా..? పక్కా ప్లానింగ్‌ లేకపోవడమా? తామంటే కేంద్రం గడగడా వణికిపోతుందనే అతి విశ్వాసమా? మాకిది చాలు… ఇదే మా విజయం అని పరిమితులకు లోబడిన తత్వమా .. తెలియదు కానీ.. ఈ జంతర్‌మంతర్‌ 2.0లో మాత్రం సీజేపీ ఘోరంగా విఫలమైంది.

అది నిర్మాణాత్మక పార్టీ కాకపోవచ్చు. దీనికి దేశ వ్యాప్తంగా పెద్ద క్యాడర్ లేకపోవచ్చు. కానీ జెన్‌జీ ఈ బొద్దింకల పిలుపును తీసుకుని ముందుకు సాగేందుకు రెడీగా ఉంది. ముందు నిలబడే ఈ ముఖ్య నాయకులు భేటీలు, ప్రచారాలు, వీడియోల ప్రసారాలకే పరిమితమయ్యారే తప్ప.. కేంద్రం ముందస్తు అలర్టులను ఎదుర్కొనేలా తమ వ్యూహాలను మాత్రం రచించలేదనిపిస్తోంది.

‘మోడీజీ.. ఎందుకు మెట్రోలు బంద్‌ చేశారు..? ఎందుకు రైళ్లు బంద్ చేశారు? మీరు భయపడుతున్నారని తెలుసు..?’ అని ఆ ధ్రువ్‌ రాఠీ కామెంట్ చేసిన వీడియో.. ఇదీ మా ఇంపాక్ట్ అని గొప్పతనాన్ని ప్రదర్శించుకునేందుకు ఉపయోగించుకున్నారే తప్ప.. ఉద్యమానికి అవి ఊతంగా నిలబడలేదు.

కేంద్రం భయపడింది అనేది మోడీకి ముఖ్యం కాదు.. కాక్రోచులను చెల్లాచెదురు చేయాలనేదే లక్ష్యం. ఆ లక్ష్యంలో మోడీ విజయం సాధిస్తే.. తమ లక్ష్య సాధనలో మాత్రం అహానికి పోయి.. అల్పసంతోషంగా.. కేంద్రం భయపడింది చూశారా? అని చెప్పుకుని.. దీన్నే విజయంగా భావించింది కాక్రోచ్‌ పార్టీ. ఇది జెన్‌జీ వైఫల్యం కాదు. ముందుండి అంతా మేమే.. మేమే జెన్‌జీని నడిపిస్తున్నామని బిల్డప్‌ ఇచ్చిన కాక్రోచ్‌ పార్టీ బాధ్యులది.

Tags

Related News

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

Big Stories

Advertisement
×