E-Paper
Advertisement

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!
Advertisement

River Indie Now on Flipkart: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి రివర్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరుకు చెందిన ఈవీ తయారీ సంస్థ రివర్ తన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండిని ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులు షోరూమ్‌కు నేరుగా వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే, ఆన్‌లైన్ బుకింగ్ ఎలా చేసుకోవాలి? ఈ స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లో రివర్ ఇండి బుకింగ్ ఎలా?

ఇప్పటివరకు రివర్ ఇండి ఈ-స్కూటర్‌ను బుక్ చేసుకోవాలంటే కంపెనీ షోరూమ్‌ను సంప్రదించాల్సి వచ్చేది. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ స్కూటర్‌ను లిస్ట్ చేయడంతో బుకింగ్ ప్రక్రియ మరింత సులభం కానుంది. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో స్కూటర్ వివరాలను పరిశీలించి, అక్కడి నుంచే బుకింగ్ చేసుకోవచ్చు. అయితే, బుకింగ్ చేసినంత మాత్రాన స్కూటర్ నేరుగా ఇంటికి డెలివరీ అవుతుందని భావించకూడదు. ఆన్‌లైన్‌లో బుకింగ్ పూర్తయిన తర్వాత సంబంధిత సమాచారం సమీపంలోని రివర్ డీలర్‌షిప్‌కు చేరుతుంది. ఆ తర్వాత వాహన కొనుగోలుకు సంబంధించిన మిగిలిన ప్రక్రియను డీలర్‌షిప్ పూర్తి చేస్తుంది. కొనుగోలు అనంతరం సర్వీసింగ్ బాధ్యతలను కూడా స్థానిక డీలర్‌షిప్ నిర్వహిస్తుంది.

48 నగరాల్లో 80కి పైగా స్టోర్లు!

Advertisement

ప్రస్తుతం రివర్ సంస్థ దేశవ్యాప్తంగా 48 నగరాల్లో 80కి పైగా స్టోర్లను నిర్వహిస్తోంది. మరిన్ని ప్రాంతాలకు తన నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. అయితే, ప్రతి ప్రాంతంలోనూ ఈ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని చెప్పలేం. వినియోగదారుల నివాసానికి సమీపంలో రివర్ షోరూమ్ ఉండటం కీలకం. ఆన్‌లైన్ మార్కెట్‌ ప్లేస్‌ల ద్వారా వాహనాలను బుక్ చేసుకునే విధానం ఇప్పటికే ఇతర బ్రాండ్లలోనూ కనిపిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్, యెజ్డీ, ఏథర్, విడా లాంటి బ్రాండ్లు కూడా తమ వాహనాలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంచుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో రివర్ కూడా చేరింది.

రివర్ ఇండి బ్యాటరీ, రేంజ్ వివరాలు!

రివర్ ఇండి ప్రస్తుతం ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 4kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. కంపెనీ   వివరాల ప్రకారం, ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 163 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు.  రివర్ ఇండి స్కూటర్ ప్రత్యేకత కేవలం బ్యాటరీ, రేంజ్‌కే పరిమితం కాదు. రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. ఇందులో 55 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. హెల్మెట్లు, బ్యాగులు, ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి ఈ స్థలం ఉపయోగపడుతుంది.

ధర ఎంతంటే?

Advertisement

రివర్ ఇండి ఈ-స్కూటర్ బెంగళూరులో రూ.1.57 లక్షల ఎక్స్‌ షోరూమ్ ధరతో అమ్ముతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఇదే ధరతో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసే ముందు అందుబాటులో ఉన్న ప్రాంతాలు, బుకింగ్ నిబంధనలు, డెలివరీ వివరాలను పరిశీలించడం మంచిది.

Read Also: భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

Tags

Related News

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?

లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

Big Stories

Advertisement
×