Jagapathi Babu : తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమని, జగపతి బాబు జోడికి మంచి డిమాండ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మావిచిగురు, శుభలగ్నం వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఆ సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తుంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు అంతగా ఆ సినిమాలు ప్రేక్షకుల మనసును దోచుకున్నాయి. అందుకే వీరి కాంబోకి మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇద్దరూ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టులుగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆ మధ్య ‘పటేల్ సార్’ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇద్దరు బిజీబిజీగా సినిమాలను చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన జగపతిబాబు ఫ్యాన్స్ఆమని పై సీరియస్ అవుతున్నారు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
నటుడు జగపతిబాబు వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య యాక్టివ్ గా ఉంటున్నాడు. తన సినిమాల విషయాల గురించి మాత్రమే కాదు పర్సనల్గా కూడా తన వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు. తనపై తాను జోకులు వేసుకుంటూ, తన ఫోటోలకు వేరైటీ క్యాప్షన్లు పెడుతూ అందరినీ నవ్విస్తుంటారు. లేటెస్టుగా జగ్గూ భాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఆమనితో ఉన్న ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియోలో ఆమనికి మేకప్ ఆర్టిస్ట్ గా జగపతిబాబు పనిచేస్తాడు.
Also Read :సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ చేసి బాధపడ్డాను.. బాంబ్ పేల్చిన నటుడు..
ఆమని ఏదో షూటింగ్ రెడీ అవుతుంటే ఆమెకు గొడుగు పట్టుకుని టచ్ అప్ చేస్తూ కనిపిస్తాడు. ఆమె కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని మేకప్ సరిగ్గా వెయ్యు అంటూ జగపతిబాబును డిమాండ్ చేస్తుంది. ముందు గొడుగు సరిగా పట్టు.. అది నీకా నాకా?” అంటూ ఆమని చిరాకు పడింది. టచప్ సరిగా చెయ్యి.. ఇప్పుడే వేసారు మేకప్, అప్పుడే ఎలా అయిందో చూడు. సరిగ్గా మేకప్ వేయకపోతే నేను వేరే అసిస్టెంట్ ని పెట్టుకుంటా అని వార్నింగ్ ఇచ్చింది.. అద్దం కూడా సరిగ్గా పట్టుకోవడం రాదు నువ్వు ఏమైనా హీరోలాగా ఫీల్ అవుతున్నావా? హీరో అనుకుంటున్నావా అంటూ ఓ ఆట ఆడుకుంటుంది. ఇక టచ్ అప్ పూర్తి అయిన తర్వాత అద్దంలో ఆమెని మొహం చూసుకుంటుంది అప్పుడే జగపతిబాబు కూడా వెనకాల నుంచి చూస్తుంటాడు ఏంటి మీద పడుతున్నావ్ హీరోలేగా ఫీల్ అవ్వద్దు నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది అంటూ గట్టిగానే జగపతిబాబుకు వార్నింగ్ ఇస్తుంది. అప్పటి దాకా ఆమె మాటలన్నీ భరించిన జగపతిబాబు.. చివరకు ఇంక చాల్లే లెయ్యి అని గట్టిగా అరుస్తాడు.. అక్కడితో వీడియో ఎండ్ అవుతుంది ప్రస్తుతం ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏంటి ఆమని ఇలా చేసిందంటూ జగపతిబాబు ఫ్యాన్సు ఆమనిపై సీరియస్ అవుతున్నారు.. ఇక వీరిద్దరి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరూ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు