E-Paper
Advertisement

సన్నరకాలన్నీ ప్రైవేటు దళారులే ఎగబడి కొంటున్న వైనం..! సిండికేట్‌గా మారి క్వింటాలుకు 3వేలుగా నిర్ణయం..! డెబ్బై శాతం ప్రైవేటుకే అమ్ముకుంటున్న రైతులు..

సన్నరకాలన్నీ ప్రైవేటు దళారులే ఎగబడి కొంటున్న వైనం..! సిండికేట్‌గా మారి క్వింటాలుకు 3వేలుగా నిర్ణయం..! డెబ్బై శాతం ప్రైవేటుకే అమ్ముకుంటున్న రైతులు..
Advertisement

గత ఏడాది ఇదే సమయానికి సర్కారు వరి కొనుగోలు కేంద్రాలు కళకళ లాడాయి. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్‌ అయ్యింది. సర్కార్‌ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా.. అక్కడికి వచ్చి ధాన్యం అమ్ముకునే రైతే లేకుండా పోయాడు. ప్రైవేటు దళారులు సన్నరకాల ధాన్యాన్నిఎగురేసుకు పోతున్నారు. అయితే మొదట్లో పలికనంతగా ధర పలకడం లేదు. అంతా సిండికేట్‌గా మారారు.

క్వింటాలుకు రూ. 3వేలు ధర నిర్ణయించుకున్నారు. ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేలా లేరు. సర్కార్‌ ఇచ్చేది కూడా క్వింటాలుకు ఇంచుమించుగా ఇంతే ఉంటుంది. మద్దతు ధర రూ. 2,400తో పాటు ఆ తరువాత ఇచ్చే బోనస్‌ రూ. 500 కలుపుకుంటే.. మొత్తం రూ. 2,900 ధర వస్తుంది. ఇందులోనూ కడ్తా, తరుగు పేరుతో కోతలు పెడితే.. మరింతగా రేటు తగ్గే అవకాశం ఉంటుంది.

Advertisement

కరువు నేపథ్యంలో సన్నరకాలకు భారీ డిమాండ్‌ ఏర్పడిన నేపథ్యంలో తొలత పొరుగు రాష్ట్రాల నుంచి దళారుల వచ్చి రేటు పెంచి తీసుకున్నారు. క్వింటాలుకు రూ. 4 వేల నుంచి రూ. 4,500 వరకు ఇచ్చారు. ఆ తరువాత లోకల్ రైస్‌ మిల్లర్లు.. వారితో గొడవ పడి తరిమేశారు. అంతా మీరే కొంటే మా రైస్‌మిల్లులేం గాను..? అని గొడవకు దిగి రేటును దించేశారు. అలా రేటు క్రమక్రమంగా పడి పోయి..చివరకు ఈ సిండికేటుల బారిన పడి రూ. 3వేల వద్ద ఆగిపోయింది.

ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వొద్దని తీర్మానించుకున్నారు. దీంతో రైతులు కోతలు కోసి.. వేచి చూసినా రేటు పెరిగే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఆ మూడు వేల రేటుకే తమ ధాన్యాన్ని ప్రైవేటుకు అమ్ముకుంటున్నారు. అక్కడక్కడా సర్కారీ కొనుగోలు కేంద్రాలు పెట్టినా.. అటువైపు చూడటం లేదు రైతు. సర్కార్‌కు ధాన్యం అమ్మితే ఆ మద్దతు ధర ఎప్పడిస్తారో? ఆ బోనస్‌ ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందనే చర్చ రైతాంగంలో ఉంది.

Advertisement

ఈ ప్రైవేటు దళారులకే అమ్మేసుకుంటే మద్దతు ధర, బోనస్‌ కలిపి ధర వస్తుంది కదా? అనే ఆలోచనకు వచ్చాడు రైతు. అందుకే కోతలు ముగిశాయో లేదో.. అక్కడ దళారులు గద్దల్లా వాలుతున్నారు. కాంటాలు పెట్టి కొనేస్తున్నారు. వెంటనే క్వింటాలుకు రూ. 3వేలు చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది ఈ సమాయానికి 21.73 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతుల ఖాతాల్లో మద్దతు ధర కింద రూ. 5,040 కోట్లను జమ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్‌ 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసింది. కానీ జిల్లాల నుంచి రైతులు పెద్దగా స్పందించకపోయే సరికి, అక్కడక్కడ నామ మాత్రంగా సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ కూడా తూకాలు జరగడం లేదు. ప్రైవేటుకు 75 శాతం మేర ధాన్యాన్ని అమ్ముకుంటుండగా, మిగిలినవి అక్కడక్కడ సర్కార్‌ కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు సర్కార్‌ ఎంత మేర ధాన్యం సేకరించిందో కూడా అధికారిక లెక్కలు విడుదల చేయలేని పరిస్థితి ఉంది.

ఇప్పటికే వరి కోతలు ముగింపు దశకు వచ్చేశాయి. వచ్చినవి వచ్చినట్టుగా దళారులు కొనుగోలు చేస్తున్నారు. సిండికేటుగా మారి రేటును తగ్గించేశారు గానీ, బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధర మాత్రం ఇంకా ఆకాశానికి అంటుకునే ఉంది. కరువు వేళ రైతులకు రావాల్సిన ఆ కొద్ది పాటి లాభాన్ని కూడా లాక్కుని మిల్లర్లు, బ్రోకర్లు లక్షలు ఆర్జిస్తున్నారనే విమర్శలున్నాయి.

 

Tags

Related News

రాష్ట్రంలో సబ్సిడీ విత్తనాలు ఎక్కడ.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు!

కాంట్రవర్సీలకు కేరాఫ్​‌గా కార్మిక శాఖ.. పీక్స్‌కు చేరిన అంతర్గత పోరు!

‘ఇందిరమ్మ బీమా’పై సర్వత్రా ఆసక్తి! రేషన్‌ కార్డు దారులందరికీ వర్తించేలా పథకం..! రూ. 4వేల కోట్లు కేటాయించిన సర్కార్‌..!

మైక్రోసాఫ్ట్ నుంచి బ్యాంకుల వరకు.. అమెరికాలో అసలేం జరుగుతోంది?

స్టేట్‌లో సిద్దాంతపర విమర్శల దాడి! సెంట్రల్‌లో కేంద్ర సాయం కోరి..! భారత్‌ సమ్మిట్‌తో విమర్శలు గుప్పించినా.. ప్రధానితో సమస్యలు విన్నవించినా..!

అసదుద్దీన్ మోదీకి శత్రువా? మిత్రుడా? యూపీలో ఏం జరుగుతోంది?

ఐదు లక్షల మందికి పైగా ఉపాధి కూలీ పనులకు హాజరు! గత ఏడాదితో పోలిస్తే 15 రెట్లు ఎక్కువ..! నల్లగొండలో అత్యధికంగా ఉపాధి కూలీలకు!

Big Stories

Advertisement
×